ఇది కూడా ఆదిత్యనాథ్ యోగి రికార్డే
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని మెరగుపరుస్తామన్న హామీతో గత మార్చి నెలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. దురదష్టవశాత్తు పరిస్థితి మెరగు పడాల్సిందిపోయి మరింత దిగజారింది. ఆదిత్యనాథ్ యోగి అధికారంలోకి వచ్చిన 2017, మార్చి 15వ తేదీ నుంచి 2017, ఏప్రిల్ 15వ తేదీ మధ్యన, అంటే నెల రోజుల్లో. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే అత్యాచారాలు, దొంగతనాలు నాలుగింతలు పెరిగాయి. ఇక దోపిడీలయితే ఏడింతలు పెరిగాయి. హత్యలు రెండింతలు పెరిగాయి.
పెరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలను అరికట్టడంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మరీ దారణంగా ఉంది. ఓ బీజేపీ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి సీనియర్ పోలీసు అధికారి ఇంటిపైనే దాడి చేశారంటే పరిస్థితులు ఎంతగా దిగజారుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మాంసం విక్రయాల క్రమబద్ధీకరణ పేరుతో వేలాది మాంసం దుకాణాలను మూసేయించి వారి పొట్టగొట్టిన ప్రభుత్వానికి మాంసం విక్రయాలను ఆపేయించడంలో వున్న శ్రద్ధ, చిత్తశుద్ధి శాంతి భద్రతల పరిరక్షణపై లేకపోవడమే పరిస్థితి దిగజారేందుకు కారణం అవుతోంది.
మే 5వ తేదేన దళితులపై ఠాకూర్లు దాడి చేసినప్పుడే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తగిన చర్యలు తీసుకొని ఉన్నట్లయితే పరిస్థితి చేయిదాటి పోయేది కాదు. సహరాన్‌పూర్‌లో దళితులను మే 9వ తేదీన చితకబాదారు. పర్యవసానంగా ఠాకూర్లు మంగళవారం నాడు దళితులపై దాడిచేసి ఒకరిని హత్య చేశారు. అగ్రవర్ణాల మద్దతో అధికారంలోకి వచ్చిన అగ్రవర్ణానికి చెందిన ఆదిత్యనాథ్ వారి సంక్షేమం కోసమే కషి చేస్తున్నారన్న భావం బీసీల్లో, దళితుల్లో పెరిగిపోతోంది. ఇప్పుడే చక్కదిద్దే ప్రయత్నాలను చేపట్టకపోతే పరిస్థితి మరింత దిగజారి అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. – ఓ సెక్యులరిస్ట్ కామెంట్