ఘజియాబాద్ : నేరస్థులను జైలుకు పంపటం లేదా ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంటమే సరైన పనని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అభిప్రాయపడ్డారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్న తరుణంలో శనివారం రామ్‌లీలా మైదానంలో భారీ ర్యాలీలో ఆయన నిర్వహించారు.
భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక యూపీలో శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయని.. నేరాలు తగ్గి పరిస్థితి చాలా మెరుగైందని ఆయన చెప్పారు. ఒకప్పుడు ఇక్కడ నేరాలను తట్టుకోలేక వర్తక వ్యాపారస్థులు, యువత ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. కానీ, 2017 మార్చి తర్వాత(ఆదిత్యానాథ్ పగ్గాలు చేపట్టాక) లా అండ్ ఆర్డర్ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆదిత్యానాథ్ అన్నారు.
‘‘అధికారంలోకి వచ్చాక నేరాలను అదుపు చేయటమే ప్రధాన లక్ష్యంగా పని చేయటం ప్రారంభించాం. దీంతో వారికి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడు వారి ముందున్నవి రేండే రెండు దారులు.. జైలుకి అయినా వెళ్లాలి. లేదా ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయి యముడిని చూడాలి’’ అని ఆదిత్యానాథ్ వ్యాఖ్యానించారు. అనంతరం మీరట్‌లో కూడా ఇదే తరహాలో ర్యాలీ నిర్వహించగా.. అక్కడ నిరసకారుల నల్ల జెండాలు ప్రదర్శించి సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు వారిని చితకబాది పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment