
ఆర్థిక ఇబ్బందుల్లో శ్రుతిహాసన్?
నటి శ్రుతిహాసన్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారట. ఏమిటి నమ్మశక్యం కావడంలేదా? తమిళం, తెలుగు, హిందీ అంటూ బహుభాషల్లో క్రేజీ నటిగా వెలుగొందుతూ సంపాదిస్తున్న శ్రుతిహాసన్‌కు ఆర్థిక ఇబ్బందులంటే ఎవరయినా నవ్విపోతారు. అయితే ఇలాంటి వార్త మాత్రం నిజంగానే ప్రచారంలో ఉంది. అసలు విషయం ఏమిటంటే శ్రుతి హాసన్ బాలీవుడ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్న భావనతో ముంబాయిలో ఇటీవల ఒక డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు.
అంత వరకు బాగానే ఉన్నా ఆమె ఫ్ల్లాట్‌కొన్నది మామూలు ప్రాంతంలో కాదు. అత్యంత ధనవంతులు నివశించే అందేరిలో. ఈ ఫ్లాట్ కొనుగోలు కోసం బ్యాంకులో రుణం తీసుకున్నారట. అయితే ఆమె బ్యాంక్‌కు ఇచ్చిన చెక్కు బౌన్స్ అవ్వడంతో వారు ఆశ్చర్యపోయారట. ఈ విషయాన్ని వారిప్పుడు శ్రుతిహాసన్‌కు తెలియజేస్తున్నారట. ఈ వ్యవహారం కాస్త బయటకు పొక్కడంతో శ్రుతిహాసన్ చెక్ బౌన్స్, ఆర్థిక ఇబ్బందుల్లో శ్రుతిహాసన్ అంటూ ప్రచారం చేసేస్తున్నారు. అసలు విషయం తెలియాలంటే శ్రుతి నోరు విప్పాల్సిందే.