The Warrior Pre Release Event: Ram Pothineni | Kriti Shetty - Sakshi
Sakshi News home page

The Warrior-Ram Pothineni: ఇది అందరికీ సూట్‌ అయ్యే టైటిల్‌

Published Fri, Jul 8 2022 12:50 AM | Last Updated on Fri, Jul 8 2022 9:11 AM

The Warrior Pre Release Event - Sakshi

మణిరత్నం, భారతీ రాజా, శంకర్, శ్రీనివాసా చిట్టూరి, లింగుసామి, రామ్, కృతీ శెట్టి

‘‘నేను ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రాన్ని హైదరాబాద్‌లో షూట్‌ చేస్తున్నప్పుడు లింగుసామి ‘ది వారియర్‌’ సినిమా తీస్తున్నారు. అయితే ఆయన తర్వగా షూటింగ్‌ పూర్తి చేసేశారు. సినిమాను విడుదల కూడా చేసేస్తున్నారు. మేం మెల్లిగా చేస్తూ వస్తున్నాం. లింగూ.... (నవ్వుతూ) మీరు ముందు రోడ్‌ బాగా వేస్తే వెనకాలే మేం కూడా వచ్చేస్తాం (పొన్నియిన్‌ సెల్వన్‌ విడుదలను ఉద్దేశించి). ‘ది వారియర్‌’ సినిమా హిట్‌ కావాలి’’ అని ప్రముఖ డైరెక్టర్‌ మణిరత్నం అన్నారు.

రామ్‌ పోతినేని, కృతీ శెట్టి జంటగా లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది వారియర్‌’. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో డైరెక్టర్‌ శంకర్‌ మాట్లాడుతూ– ‘‘ది వారియర్‌’ చాలా మంచి టైటిల్‌. జీవితంలో ఏదో సాధించటానికి అందరం ఫైట్‌ చేస్తూనే ఉంటాం.

కాబట్టి ఇది అందరికీ సూట్‌ అయ్యే టైటిల్‌. లింగుసామి నాకు మంచి స్నేహితుడు. కరోనా సమయంలో అండగా నిలబడ్డారు. అంత మంచి వ్యక్తి చేసిన ‘ది వారియర్‌’ పెద్ద హిట్‌ అవ్వాలి. ఈ ట్రైలర్‌ చూస్తుంటే రామ్‌లో ఓ ఫైర్‌ కనిపించింది. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. ఈ వేడుకలో దర్శకులు ఎస్‌.జె.సూర్య, సెల్వమణి, కార్తీక్‌ సుబ్బరాజ్, హీరోలు విశాల్, ఆది పినిశెట్టి, ఆర్య, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement