బన్నీ నెక్ట్స్ సినిమాకు అంతా రెడీ | Allu arjun next movie details | Sakshi
Sakshi News home page

బన్నీ నెక్ట్స్ సినిమాకు అంతా రెడీ

Jun 19 2016 3:44 PM | Updated on Sep 4 2017 2:53 AM

బన్నీ నెక్ట్స్ సినిమాకు అంతా రెడీ

బన్నీ నెక్ట్స్ సినిమాకు అంతా రెడీ

సరైనోడు సినిమా రిలీజ్ అయి చాలా రోజులు గడుస్తున్నా తన నెక్ట్స్ సినిమా విషయంలో ఇంత వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు అల్లు అర్జున్. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్లో ఉన్న బన్నీ తిరిగి...

సరైనోడు సినిమా రిలీజ్ అయి చాలా రోజులు గడుస్తున్నా తన నెక్ట్స్ సినిమా విషయంలో ఇంత వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు అల్లు అర్జున్. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్లో ఉన్న బన్నీ తిరిగి రాగానే తను చేయబోయే నెక్ట్స్ సినిమాపై క్లారిటీ ఇవ్వనున్నాడట. అయితే చాలా రోజులుగా టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తున్నట్టుగానే తమిళ దర్శకుడు లింగుసామితోనే బన్నీ నెక్ట్స్ సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయిన ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించనున్నారు. ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు తీసుకుంటున్నారు. ఇక బన్నీ.., లక్కీ మ్యూజిక్  డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి అల్లు అర్జున్ కోసం రాకింగ్ సాంగ్స్ రెడీ చేయనున్నాడు. ఇప్పటికే తెలుగుతో పాటు మళయాల ఇండస్ట్రీలో కూడా మంచి మార్కెట్ సాధించిన బన్నీ, ఈ సినిమాతో కోలీవుడ్ మీద కన్నేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement