
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 మూవీ నుంచి రెండో సాంగ్ అనౌన్స్‌మెంట్ వీడియో వచ్చసింది. ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’అంటూ సాగే ఈ కపుల్ సాంగ్‌ని ఈ నెల 29న విడుదల చేయనున్నారు. సాంగ్ రిలీజ్ డేట్‌ని పరిచయం చేస్తూ రష్మికతో ఓ స్పెషల్ వీడియోని షూట్ చేశారు మేకర్స్. అందులో ‘శ్రీవల్లి వదినా..పుష్ప 2 నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారట కదా.. ఆ పాట ఏంటో చెబుతావా’ అని చిత్తూరు యాసలో ఓ వ్యక్తి అడగ్గా.. మేకప్ వేసుకుంటున్న రష్మిక వచ్చి ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అంటూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తుంది.
ఈ రొమాంటిక్ సాంగ్‌ని మే 29న ఉదయం 11.07 నిమిషాలకి రిలీజ్ చేయబోతున్నారు. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఆగస్ట్ 15న ఈ చిత్రం విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment