ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. సినిమా విడుదలై 20 రోజులు దాటినా ఇప్పటికీ భారీ కలెక్షన్స్‌తో రికార్డులు సృష్టిస్తోంది. ఇక హిందీలో అయితే రూ. 700 కోట్లకు పైగా వసూళ్ల సాధించి.. అత్యధిక వేగంగా 700 కోట్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఓవరాల్‌గా ఇప్పటికే రూ.1600 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. త్వరలోనే 2 వేల కోట్ల క్లబ్‌లోకి చేరుతుందని ట్రేండ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వరుసగా వీడియో సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా మంగళవారం ‘దమ్ముంటే పట్టుకోరా’ అనే పాటను రిలీజ్ చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ఈ పాటను అల్లు అర్జున్ ఆలపించగా.. సుకుమార్ లిరిక్స్ అందించాడు. టీ సీరిస్ తన యూట్యూబ్ చానల్‌లో ఈ పాటను రిలీజ్ చేయగా..అది కాస్త వైరల్ అయింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఈ పాటను యూట్యూబ్ నుంచి తొలగించారు.
కాగా, అల్లు అర్జున్‌ను పోలీసులు విచారించిన రోజు డిసెంబర్ 24 సాయంత్రం ఈ సాంగ్‌ను టీ సిరీస్ విడుదల చేసింది. అయితే ఈ పాట పోలీసులను ఉద్దేశించే రిలీజ్ చేశారంటూ కొంతమంది నెటిజన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ఆ కారణంతోనే పాటను యూట్యూబ్ నుంచి డిలీట్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరగుతోంది.
కాగా, అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన పుష్ప 2 చిత్రం డిసెంబర్ 5న విడుదలై తొలి రోజు నుంచి బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఫహద్ ఫాజిల్ ఇందులో పోలీసు అధికారి షెకావత్ గా నటించాడు. పుష్ప రాజ్‌కు షెకావత్‌కి మధ్య జరిగే ఓ సన్నివేశంలో భాగంగానే ఆ పాట వస్తుంది. సినిమాలో సంభాషణలుగా చూపించిన మేకర్స్. . ఇప్పుడు అది పాట రూపంలో రిలీజ్ చేసి.. మళ్లీ డిలీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment