అమ్మ అవుతారా? | Lingusamy to direct Jayalalithaa biopic with Nayanthara as Amma? | Sakshi
Sakshi News home page

అమ్మ అవుతారా?

Published Wed, Oct 24 2018 12:51 AM | Last Updated on Wed, Oct 24 2018 12:51 AM

 Lingusamy to direct Jayalalithaa biopic with Nayanthara as Amma? - Sakshi

హెడ్డింగ్‌ చదవగానే ఏదేదో ఊహించుకునేరు. నయనతార తల్లి కాబోతున్నారేమో అన్నది మీ ఊహ అయితే తప్పులో కాలేసినట్లే. ఆన్‌స్క్రీన్‌ ‘అమ్మ’గా కనిపించబోతున్నారని చెబుతున్నాం. ఆల్రెడీ తల్లి పాత్ర చేశారు కదా.. ఇప్పుడు కొత్తేంటి అనుకుంటున్నారా? ఆ పాత్ర వేరు. ఈ ‘అమ్మ’ పాత్ర వేరు. తమిళనాట ప్రజలందరికీ ‘అమ్మ’ అయిన నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో కనిపించబోతున్నారు నయన్‌. ప్రస్తుతం ఈ వార్త చెన్నైలో జోరుగా షికారు చేస్తోంది. ఆల్రెడీ జయలలిత జీవితం ఆధారంగా మూడు బయోపిక్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

విశేషం ఏంటంటే నయన్‌ ఈ మూడు ప్రాజెక్ట్‌లో ఏదో ఒక ప్రాజెక్ట్‌లో కాకుండా కొత్త చిత్రంలో ఈ పాత్ర పోషించనున్నారట. ‘పందెం కోడి’ ఫేమ్‌ లింగుస్వామి జయలలిత జీవితం ఆధారంగా ఓ బయోపిక్‌ తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారట. ఇందులో నయనతారను టైటిల్‌ రోల్‌లో నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. మరి ఈ ప్రాజెక్ట్‌ ఎప్పుడు పట్టాలెక్కుతుందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే... జయలలిత అంటే నయనతారకు చాలా అభిమానం. ఓ సందర్భంలో జయలలిత గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు – ‘‘జయలలితగారి పాత్రకు నేను సూట్‌ అవుతానో లేదో తెలియదు కానీ అవకాశం వస్తే మాత్రం చేయాలని ఉంది’’ అని నయనతార పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement