
బన్నీకైనా బాణీలు కడతాడా..?
కొలవరి పాటతో నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న దక్షిణాది సంగీత దర్శకుడు అనిరుధ్. కోలీవుడ్లో స్టార్ మ్యూజిషియన్గా పేరున్న అనిరుధ్తో కొద్ది రోజులుగా టాలీవుడ్లో మ్యూజిక్ చేయించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనిరుధ్ కూడా స్టార్ హీరోల సినిమాలైతే సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నా.. ఆ ప్లాన్స్ వర్క్ అవుట్ కావటం లేదు. ఇప్పటికే రెండు సినిమాలను ఓకె చేసి కూడా తరువాత వదులుకున్నాడు.
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ ఎంటర్ టైనర్ బ్రూస్లీకి, అనిరుధ్ మ్యూజిక్ చేయాల్సి ఉంది. అయితే అదే సమయంలో అజిత్ హీరోగా వేదాలం సినిమా ఆఫర్ రావడం చరణ్ సినిమాను పక్కన పెట్టేశాడు. ఆ తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్లో నితిన్ హీరోగా తెరకెక్కతున్న అ.. ఆ.. సినిమాకు అనిరుధ్ను సంగీత దర్శకుడిగా ప్రకటించారు. కానీ సగం సినిమా షూటింగ్ కూడా పూర్తయిన తరువాత అనిరుధ్, ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు.
తాజాగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించడానికి అంగీకరించాడన్న టాక్ వినిపిస్తోంది. తమిళ దర్శకుడు లింగుస్వామి, బన్నీ హీరోగా ఓ మాస్ యాక్షన్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్తో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ సినిమాకు అనిరుధ్తో మ్యూజిక్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారు. మరి బన్నీ సినిమాకైన ఈ యువ సంగీత దర్శకుడు బాణీలు కడతాడేమో చూడాలి.