‘పందెంకోడి 3’ వస్తుంది | Planning Pandem Kodi 3 very soon: Vishal | Sakshi
Sakshi News home page

‘పందెంకోడి 3’ వస్తుంది

Published Wed, Oct 24 2018 1:01 AM | Last Updated on Wed, Oct 24 2018 1:01 AM

Planning  Pandem Kodi 3  very soon: Vishal - Sakshi

‘‘పందెంకోడి 2’ వంటి మంచి హిట్‌ సినిమాని మాకు అందించిన విశాల్‌కి, లింగుస్వామికి థ్యాంక్స్‌. ఈ దసరా పండగకు మా సంస్థకు మంచి విజయాన్ని అందించిన అందరికీ కృతజ్ఞతలు’’ అని ‘ఠాగూర్‌’ మధు అన్నారు. విశాల్, కీర్తీ సురేష్‌ జంటగా, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాజ్‌కిరణ్‌ ముఖ్య పాత్రల్లో ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పందెంకోడి 2’. ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో విశాల్, దవళ్‌ జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతి లాల్‌ గడా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలైంది. ‘ఠాగూర్‌’ మధు మాట్లాడుతూ– ‘‘పండక్కి విడుదలైన మూడు సినిమాలకు మంచి స్పందన రావడం హ్యాపీగా ఉంది. ‘పందెం కోడి 2’ విజయం పట్ల విశాల్‌ హ్యాపీగా ఉన్నారు. సీక్వెల్స్‌లో సక్సెస్‌ రేట్‌ తక్కువ.

కానీ, ఫస్ట్‌ పార్ట్‌లోని పాత్రలతో సింక్‌ అయిన సీక్వెల్స్‌ సక్సెస్‌ అయ్యాయి. మా సినిమాకి మంచి ఓపెనింగ్స్‌ వచ్చాయి. ‘పందెంకోడి 3’ కోసం విశాల్, లింగుస్వామి ఓ లైన్‌ అనుకున్నారు. సెకండ్‌ పార్ట్‌ రావడానికి దాదాపు 13 ఏళ్లు పట్టింది. ఈసారి లేట్‌ అవ్వదు. విశాల్‌ ప్రస్తుతం 4 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ‘పందెంకోడి 3’ స్టార్ట్‌ అవుతుంది. నిఖిల్‌ నటించిన ‘ముద్ర’ సినిమా మా బ్యానర్‌లో రిలీజ్‌ అవుతుంది. ‘దేవ్, కాంచన 3’ సినిమాలను తెలుగులో మేం రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం. వీటితో పాటు తెలుగులో రెండు సినిమాల కోసం చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement