Pandem Kodi
-
పందెం కోళ్లకూ కోచింగ్ సెంటర్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు కోచింగ్ సెంటర్లున్నాయి. డీఎస్సీ, గ్రూప్స్ ఉద్యోగాల పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు కోచింగ్ సెంటర్లు చూశాం. మనుషులకే కాదు.. కోళ్లకు కూడా కోచింగ్ సెంటర్లున్నాయి. ఇదేమిటి అని అనుకుంటున్నారా? నిజమేనండీ.. గోదావరి జిల్లాల్లో కోడిపందేలు లేకుండా సంక్రాంతి పండగే జరగదు కదా. పందెం గెలవాలంటే కోళ్లకూ శిక్షణ ఉండాలి. వాటికీ శరీర దారుఢ్యం, వేగంగా కదిలి శత్రువుపై దాడి చేసి మట్టుపెట్టే సామర్ధ్యం ఉండాలి కదా. అందుకే ఈ కోళ్ల కోచింగ్ సెంటర్లు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గోదావరి జిల్లాలకు మాత్రమే ఇవి ప్రత్యేకం. వీటికి మూడు నెలలు మంచి గిరాకీ ఉంటుంది. దసరాకు మొదలయ్యే శిక్షణ సంక్రాంతికి మూడు రోజుల ముందు ముగిస్తారు.శిక్షణ ఇలా..» రోజూ గాబు (చుట్టూ తెరకట్టి లోపలఉంచుతారు)లో ఉన్న కోళ్లను తెల్లవారుజామునే బయటకు తీసుకువస్తారు. ఉదయం ఆరు గంటల లోపు మౌత్ వాటర్ బ్రీతింగ్ (నోటిలో నీరు పోసి బయటకు వదలడం) చేస్తారు. ముందు రోజు రాత్రి మట్టిలో నోటితో పొడవడంతో మట్టి చేరి ఇన్ఫెక్షన్ రాకుండా ఈ వాటర్ బ్రీతింగ్ చేస్తారు.» శీతాకాలం కావడంతో రోగాలు రాకుండా నిత్యం ఏలూరుకు చెందిన వెటర్నరీ వైద్యుడు ప్రహర్ష ఆన్లైన్లో పర్యవేక్షిస్తారు.» మూడు నెలల శిక్షణలో ఆరేడుసార్లు ప్రతి పందెం కోడికి స్టీమ్‌బాత్ చేయిస్తారు. సంక్రాంతికి సున్నిపిండితో పిల్లలకు నలుగు పెట్టి స్నానంచేసే మాదిరిగా ఇది ఉంటుంది. వేప, జాజి, కుంకుడు తదితర ఆరు రకాల ఆకులతో నీళ్లను బాగా మరిగించి పందెం కోడి తట్టుకునే ఉష్ణోగ్రత కలిగిన వేడి నీటితో స్నానం చేయిస్తారు. తరువాత ఎండ తగిలేలా ఉదయం 7 నుంచి 10 గంటల వరకు ఆరుబయటే ఉంచుతారు.» కోడి కాళ్లు సాగడానికి పెద్ద డ్రమ్ముల్లో నీటిని పోసి కనీసం గంట పాటు ఈత కొట్టిస్తారు.» మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య చోళ్లు, గంట్లు, ధాన్యం మిశ్రమాన్ని పెడతారు. దీనివల్ల పందెం కోడి రెండు, మూడు అడుగులు సునాయాసంగా పైకి ఎగురుతుంది. కోడి ఎగిరే ఎత్తునుబట్టి ప్రత్యర్థిని దెబ్బతీయడానికి అవకాశం ఉంటుంది.» పందెంకోడి బరిలోకి దిగినప్పుడు మూడున్నర కిలోకు మించి బరువు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అంతకు మించి బరువు ఉంటే పందెంలో పైకి ఎగరలేక దెబ్బ తగిలిన వెంటనే కిందకు పడిపోయి ఓడిపోతుంది. ఇందుకోసం ప్రతి రోజూ ఉదయం బాదం, పిస్తా, ఎండు కర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్‌తో ప్రత్యేక ఆహారం పెడతారు.»పందేనికి మూడు వారాలు ముందు నుంచి రాత్రి ఆహారం మార్చేస్తారు. అన్ని రకాల డ్రైఫ్రూట్స్‌తో పాటు మసాలా దినుసులు (లవంగాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లి) సమపాళ్లలో కలిపిన నాస్తా (లడ్డూలు) రోజుకు రెండు ఆహారంగా ఇస్తారు. డ్రైఫ్రూట్స్‌తో స్వీట్ ఎక్కువగా ఉండటంతో ఆరోగ్యం దెబ్బతింటుందని వేడి చేసే మసాలాలను సమపాళ్లలో కలిపి పెడతారు.మాస్టర్ ట్రైనర్లతో శిక్షణఈ కోచింగ్ సెంటర్లు గోదావరి జిల్లాల్లో పదుల సంఖ్యలోనే ఉన్నాయి. పందెం కోళ్లు పెంచే వారు సొంతంగా నిర్వహించేవి కొన్ని, బయట పందేల రాయుళ్ల నుంచి వచ్చే కోళ్ల కోసం నిర్వహిస్తున్నవి మరి కొన్ని. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఉండూరు అనే చిన్న పల్లెటూళ్లో ఇలాంటి పందెం కోళ్ల కోచింగ్ సెంటర్ పుష్కరకాలంగా నడుస్తోంది. ఇక్కడ శిక్షణ తీసుకున్న కోడి బరిలో దిగిందంటే సత్తా చాటాల్సిందే. అంతటి కఠోర శిక్షణ ఇస్తారు. ఇక్కడ దాదాపు 140 పందెం కోళ్లు శిక్షణలో ఉన్నాయి. సెంటర్ నిర్వాహకుడు కోటిపల్లి శ్రీను పర్యవేక్షణలో నలుగురు మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇస్తున్నారు. ప్రతి కోడికి మూడు నెలల శిక్షణ కోసం రూ.30 వేలు తక్కువ కాకుండా ఖర్చు చేస్తారు.పందెం కొట్టాలంటే శిక్షణ తప్పదుశిక్షణ లేకుండా ఏ పందెం కోడినీ బరిలోకి దింపరు. బరిలోకి దిగేందుకు మూడు నెలల ముందే శిక్షణ మొదలవుతుంది. తినే తిండి నుంచి వాతావరణంలో మార్పులు గమనిస్తుండాలి. కోళ్లను కంటికి రెప్పలా చూసుకుంటాం. ఇక్కడ శిక్షణకు అయ్యే డబ్బు కోసం చూడం. ఖర్చుకు వెనుకాడకుండా పందెం కొడిని అన్ని రకాల శిక్షణతో మెరికల్లా తయారు చేస్తాం. మా సెంటర్లో దాదాపు 140 కోళ్లకు శిక్షణ ఇస్తున్నాం. – కోటిపల్లి శ్రీను, మాస్టర్ ట్రైనర్, ఉండూరు, సామర్లకోట, కాకినాడ జిల్లా -
ఈ గుడ్డు చాలా కాస్ట్లీ.. ధర రూ.700 మాత్రమే!
కోడిగుడ్డు రూ.400 నుంచి రూ.700 ధర పలుకుతోంది. ఏంటీ కోడిగుడ్డుకు ఇంత ధరా. ఏమిటీ దీని స్పెషాలిటీ అనుకుంటున్నారా? ఇవి అలాంటి.. ఇలాంటి గుడ్లు కాదండోయ్. ఈ గుడ్లు వెరీ స్పెషల్. సంక్రాంతి సంబరాల్లో పౌరుషాన్ని చాటి.. పందేలరాయుళ్లకు కాసుల వర్షాన్ని కురిపించే పందెం కోళ్ల జాతికి సంబంధించిన గుడ్లకు భారీ ధర పలుకుతోంది. కోస్తా జిల్లాల నుంచి వీటిని తీసుకొచ్చి ప్రకాశం జిల్లా (Prakasam District) తీరంలోని కొత్తపట్నం, సింగరాయకొండ (Singarayakonda) మండలాల్లో పెంచుతున్నారు. వీటి గుడ్లను జాతి పెట్టలతో పొదిగించి.. పుంజులను ప్రత్యేకంగా సంరక్షిస్తున్నారు. –సాక్షి ప్రతినిధి, ఒంగోలుగుడ్డు రకాన్ని బట్టి ధరపందెం కోడి కోళ్లలో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా తూర్పు కోడి, పెర్విన్ కోడి, భీమవరం కోడి, ఎర్ర మైల, అబ్రాసు మైల, కాకి నెమలి, తెల్ల నెమలి, నల్లపడ కోడి, కాకి డేగ, ఎర్ర కక్కెర, తెల్లకోడి, కాకి నెమలి, పెట్టమారు వంటి పుంజులు ఈ జాబితాలో ఉన్నాయి. రకాన్ని బట్టి గుడ్డు ధరలు పలుకుతున్నాయి. ఒక్కో గుడ్డు (Egg) రూ.400 నుంచి రూ.700 వరకూ విక్రయిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి వీటి ధరలు కూడా పెరిగిపోతుంటాయి. తూర్పు కోడి, భీమవరం కోడి, ఎర్ర కక్కెర, తెల్లకోడి పెట్టిన ఒక్కో గుడ్డు ధర సుమారు రూ.400 వరకు ఉంటుంది.క్రాస్ బ్రీడ్లైన అబ్రాసు మైల, తెల్ల కక్కెర, ఎర్ర మైల తదితర రకాల జాతులకు చెందిన గుడ్డు ఒక్కొక్కటీ రూ.500 నుంచి రూ.700 వరకు ఉంటుంది. పందెం కోడి రకం గుడ్ల కోసం ప్రత్యేకంగా పెంచిన నల్ల పెట్ట, డేగ పెట్ట, తెల్ల పెట్ట, బూడిదరంగు పెట్ట, అబ్రాసు పెట్ట, కక్కెర పెట్టలను ఉపయోగిస్తారు. పందెం కోళ్లతో ఈ పెట్టలు కలవటం ద్వారా గుడ్లు పెడతాయి. ఈ కోళ్లు గుడ్లు పెట్టడమే కానీ.. వాటిని పొదగవు. ఈ కోళ్లు మూడు నెలల్లో 10 నుంచి 15 వరకు గుడ్లను పెడతాయి. ఈ గుడ్లను ప్రత్యేక నాటుకోళ్లతో పొదిగిస్తారు. వీటికి బహిరంగ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది.ప్రత్యేక ఆహారంపందెం కోళ్ల పెంపకంలో ప్రత్యేక ఆహారం పెడతారు. కోడి గుడ్డు పెట్టిన తరువాత మూడు వారాలకు పిల్ల అవుతుంది. అప్పటి నుంచి రెండేళ్లపాటు వాటికి ప్రత్యేక ఆహారం పెడతారు. సుమారు ఏడాదిన్నర పాటు రాగులు, సజ్జలు పెడతారు. తరువాత 6 నెలలు బాదం, ఖర్జూరం, అంజూర్, యాలుక, రసగుల్లా, రంగుల ద్రాక్ష, కిస్మిస్, నాటుకోడి గుడ్డు వంటి బలవర్ధకమైన ఆహారాన్ని పెడతారు. కొన్నింటికి పోతు మాంసం కూడా పెడతారు. దీనిని తినడం ద్వారా పుంజు బలంగా ఉండటమే కాక బరిలో అవతలి పుంజును సమర్థవంతంగా ఎదుర్కొంటుందని పెంపకందారులు చెబుతున్నారుకుటీర పరిశ్రమగా పందెం కోళ్ల పెంపకంపందెం కోళ్లను కొత్తపట్నం, సింగరాయకొండ మండలాల్లోని తీరప్రాంత గ్రామాల్లో కుటీర పరిశ్రమగా పెంచుతున్నారు. కొంతమంది కోడిగుడ్లను అమ్ము కుంటూ ఆదాయం పొందుతుండగా.. మరికొందరు గుడ్లను పొదిగించి వాటిని అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఇంకొందరు వాటిని బరిలో దిగేలా పెంచి అధిక ధరలకు అమ్ముతున్నారు. కోడి పుంజుల పెంపకం లాభసాటిగా ఉందని.. దూరప్రాంతాల నుంచి వచ్చి పుంజులను కొనుగోలు చేస్తుంటారని పెంపకందారులు వివరించారు. -
రూ.కోటి అందుకున్న తొలి హీరో! మీరు అస్సలు ఊహించి ఉండరు!
కోలీవుడ్‌లో రజనీకాంత్, కమల్ హాసన్ టాప్ నటులుగా ఉన్న సమయంలో కూడా వారి కంటే ముందుగా ఒక సినిమాకు కోటి రూపాయలు రెమ్యునరేషన్ అందుకున్న టాప్ నటుడి గురించి తెలుసా..? తమిళ చిత్ర పరిశ్రమలో అగ్రనటులుగా ఉన్న విజయ్, అజిత్, రజనీ, కమల్.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. గత 10 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలోని హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్ విపరీతంగా పెరిగింది. ఇప్పుడంటే సరే... సుమారు 20 ఏళ్ల క్రితం కోటి రెమ్యునరేషన్ తీసుకునే నటీనటులకే ఎక్కువ ఇమేజ్ అని ఉండేది. ఆ విధంగా తమిళ సినిమా చరిత్రలో తొలిసారిగా రూ.కోటి రెమ్యునరేషన్ అందుకున్న తొలి నటుడు 'మొహిదీన్ అబ్దుల్ ఖాదర్' ఆయన స్క్రీన్ నేమ్ రాజ్‌కిరణ్. కోలీవుడ్‌లో ఒక సినిమాకు కోటి రూపాయలు అందుకున్న తొలి నటుడిగా ఆయన రికార్డుకెక్కారు. రాజ్‌కిరణ్ 16 ఏళ్ల వయసులో చెన్నైకి వచ్చి దినసరి కూలీగా జీవనం సాగించాడు. అప్పుడు అతని జీతం కేవలం రూ. 5 మాత్రమే. అప్పుడు రాజ్‌కిరణ్ శ్రమ, అతని నిజాయితీకి ముగ్ధుడైన యజమాని గుమాస్తాగా పదోన్నతి కల్పించాడు. అప్పటి వరకు నెలకు రూ. 150 జీతం తీసుకుంటున్న రాజ్‌కిరణ్ ప్రమోషన్ తర్వాత రూ. 170 జీతం తీసుకున్నాడు. ఇదంతా 1988వ సంవత్సరంలో జరిగిన కథ. రాజ్‌కరణ్ సినిమాలపై ఆసక్తితో సొంతంగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీని ప్రారంభించి, క్రమంగా సినిమా రంగంలో ఎదగడం ప్రారంభించాడు, ఆ తర్వాత అతను దర్శకత్వంతో పాటుగా పలు సినిమాల్లో నటించడం ప్రారంభించాడు. అతని సినిమాలు భారీ హిట్‌గా మారడంతో, హీరోగా నటించమని వివిధ నిర్మాణ సంస్థల నుంచి పిలుపు రావడం జరిగింది. అలాంటి సమయంలో ఒక నిర్మాణ సంస్థ నుంచి రూ. కోటి పది లక్షలు ఇస్తామని ఆయనకు ఆఫర్ వచ్చింది. రాజ్‌కిరణ్ తన కష్టానికి గుర్తింపుగా దీన్ని అంగీకరించాడు. రూ.లక్ష జీతం తీసుకున్నప్పుడు కూడా అదే ఫీలింగ్ కలిగిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. రూ.1 కోటి పారితోషికంతో తమిళ్లో 'మాణిక్కం' అనే సినిమా తీశారు. 1996లో విడుదలైన ఈ చిత్రానికి కెవి పాండియన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రాజ్‌కిరణ్ సరసన నటుడు విజయకుమార్ కూతురు, బిగ్ బాస్ స్టార్ వనిత జతకట్టింది. అమ్మ క్రియేషన్స్ పతాకంపై డి.శివ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ద్వారా రూ.కోటి రెమ్యునరేషన్ అందుకున్న తొలి తమిళ హీరోగా రాజ్‌కిరణ్ నిలిచాడు. ఆయన తర్వాతే రజనీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్, విజయ్, అజిత్ ఆ స్థాయికి చేరుకోవడం గమనార్హం. టాలీవుడ్లో చిరంజీవి టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి ఆయనకంటే ముందుగానే ఒక సినిమాకు రూ. 1.25 కోట్ల రెమ్యునరేషన్ అందుకొని రికార్డ్ క్రియేట్ చేశారు. అత్యధిక పారితోషికం అందుకున్న తొలి భారతీయ నటుడిగా 1992లోనే మెగాస్టార్ వార్తల్లో నిలిచారు. ఆపద్బాంధవుడు సినిమాకు గాను ఆయన ఈ భారీ మొత్తాన్ని తీసుకున్నారు. 1992లో వచ్చిన ది వీక్ మ్యాగజైన్ ఫస్ట్ పేజీలో చిరు గురించి ప్రత్యేకంగా పెద్ద ఆర్టికల్ రాశారు. ఆ మ్యాగజైన్ ముందు పేజీలో “బిగ్గర్ దెన్ బచ్చన్” అనే శీర్షికతో చిరు ఫోటోను ప్రచురించారు. -
ఆంధ్ర సంక్రాంతి బరిలో తెలంగాణ పందెం కోడి..
పహాడీషరీఫ్: ఆంధ్రప్రదేశ్‌లో జరిగే కోడి పందేల కోసం తెలంగాణ కోడి పుంజులు కదనరంగంలోకి దూకేందుకు సిద్ధమయ్యాయి. రెండు నెలల ముందు నుంచే ప్రత్యేక తర్ఫీదు పొందిన పుంజులు ఎప్పుడెప్పుడు బరిలోకి దిగాలా అని కాళ్లు దువ్వుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగే కోడి పందేలకు.. హైదరాబాద్ పాత నగర శివారు ప్రాంతాలకు విడదీయరాని బంధం ఉంది. పరువు, ప్రతిష్టలే లక్ష్యంగా పందేలు కాసేవారు విజేతగా నిలిచే సత్తా ఉన్న కోడిపుంజుల వైపు మొగ్గు చూపుతున్నారు. కంటికి నచ్చిన మేలుజాతి పుంజుకు రూ.50 వేల వరకు కూడా వెచ్చించేందుకు వెనుకాడడం లేదు. జల్పల్లి మున్సిపల్ పరిధిలో పందెం కోళ్ల కూతలు వినిపిస్తున్నాయి. అల్లారుముద్దుగా.. ఎర్రకుంట, షాహిన్‌నగర్, కొత్తపేట, సలాల పరిసరాల్లో కుస్తీ పోటీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే పహిల్వాన్లు మూగ జీవాలను కూడా అంతే మక్కువతో పెంచుతారు. ఈ క్రమంలోనే కాకి, డేగ, నెమలి, అస్లీ తదితర మేలు జాతి కోడి పుంజులను అదే రీతిలో పెంచేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఏటా సంక్రాంతి బరిలో దించుతుంటారు. ఇలా ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున జరిగే కోడి పందేలకు ఇక్కడి నుంచి కోళ్లను ఎగుమతి చేయడం పరిపాటిగా మారింది. కోట్లాది రూపాయలు వెచ్చించి పోటీలకు కాలు దువ్వే పందెంరాయుళ్లకు ఇక్కడి పుంజులు పంట పండించడం విశేషం. వ్యాయామం సైతం సంక్రాంతి పండుగకు రెండు నెలల ముందు నుంచే ఈ కోడి పుంజులకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. సాధారణంగానే నిత్యం వీటికి పౌష్టికాహారంతో పాటు వ్యాయామం చేయించే యజమానులు పండుగ బరి కోసం మరింత తర్ఫీదునిస్తారు. పందేనికి అన్ని రకాల సిద్ధమైన కోడి పుంజులను కొనుగోలు చేసేందుకు పందెం రాయుళ్లు పక్షం రోజుల నుంచే పహిల్వాన్లతో టచ్‌లో ఉంటారు. పందెంలో కచ్చితంగా నెగ్గుతామనే నమ్మకంతో వీరి వద్ద నచ్చిన పుంజును కొనుగోలు చేస్తుంటారు. పరిమిత సంఖ్యలో పుంజులను పెంచి ఎంతో దగ్గరి వ్యక్తులకు మాత్రమే ఇక్కడ విక్రయిస్తుంటారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వీరు పెంచే కోడి పుంజులకు విటమిన్లతో కూడిన బలవర్థకమైన ఆహారాన్ని అందిస్తారు. బాదం, పిస్తా, అక్రోడ్, కీమా, రాగులు, ఉడికించిన గుడ్ల (తెలుపు భాగం)ను ఇస్తుంటారు. ముఖ్యంగా ప్రతిరోజు నైపుణ్యం కలిగిన కోచ్‌లతో రెండు పూటలా మసాజ్‌లు చేయిస్తారు. పరిగెత్తించడంతోపాటు ఈత కూడా కొట్టిస్తారు. కోళ్లకు ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వీటికి ప్రత్యేకమైన ఎన్క్లోజర్ల మాదిరిగా చిన్న చిన్న గూళ్లను ఏర్పాటు చేసి మినీ జూపార్కును తలపించేలా మూగ జీవాల పెంపకంలో పహిల్వాన్ల కుటుంబాలు నిమగ్నమయ్యాయి. మూగ జీవాలపై ఉన్న ప్రేమతో మాత్రమే తాము కోళ్లను పెంచుతున్నాము తప్ప తమది వ్యాపార దృక్పథం కాదని పహిల్వాన్లు పేర్కొంటున్నారు. -
ఒక్కరోజులోనే మీరా జాస్మిన్‌కు లక్షమంది ఫాలోవర్లు
Meera Jasmine Re Entry To Films Debuts On Instagram: ‘అమ్మాయే బాగుంది’చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన మలయాళీ బ్యూటీ మీరా జాస్మిన్. 'గుడుంబా శంకర్', 'భద్ర' వంటి చిత్రాలతో తెలుగులో పాపులర్ అయిన ఈ బ్యూటీ ‘పందెం కోడి’ ‘గోరింటాకు’, ‘ఆకాశ రామన్న’ సహా పలు మలయాళ చిత్రాల్లో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో విజయాలు లభించలేదు. దీంతో కొన్నాళ్లకి దుబాయ్‌కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటాన్‌ని 2014లో పెళ్లి చేసుకుంది. అయితే మనస్పర్థల కారణంగా కొన్నాళ్లకు భర్త నుంచి విడిపోయిన మీరా జాస్మిన్.. మళ్లీ ఇన్నాళ్లకు తిరిగి సినిమాలు చేసేందుకు సిద్ధమైంది. ఇటీవలె సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మకల్ అనే ఓ మలయాళ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్‌లోనూ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లోకి కూడా అడుగుపెట్టింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉండాలని భావిస్తుందట. అలా ఇన్‌స్టాలో ఆమె ఎంట్రీ ఇచ్చిందో లేదో ఆమెకు ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఒక్క రోజులోనే సుమారు లక్షమంది ఆమెను ఫాలో అయ్యారు. -
హీరోయిన్ మీరా జాస్మిన్ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా?
Meera Jasmine Lifestory: కొంతమంది హీరోయిన్లు చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ తమదైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో చిరకాలం నిలిచిపోతుంటారు. అలాంటి కొద్ది మంది హీరోయిన్లలో మీరా జాస్మిన్ ఒకరు. తన అభినయం, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది ఈ కేరళ కుట్టి. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ కేవలం హావభావాలతో లక్షలాదిమంది మనస్సును దోచుకుంది. 2001-2010 కాలంలో ఆమె స్టార్ హీరోయిన్. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషల్లో నటించిన జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు పొందింది. కేరళకు చెందిన ఈ బ్యూటీ.. 1982 ఫిబ్రవరి 15న కేరళలోని తీరువల్లలో ఓ సిరియన్ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. ఈమె అసలు పేరు జాస్మిన్ మేరి జోసెఫ్. మీరా సోదరుడు జార్జ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. మీరా డిగ్రీ చదువుతున్న రోజుల్లో బ్లెస్సి అనే సహాయ దర్శకుడు ఆమెను చూసి సినిమాల్లోకి ఆహ్వానించాడు. ప్రముఖ దర్శకుడు లోహిత్ దాస్‌కు మీరాని పరిచయం చేసి మలయాళం మూవీ ‘సూత్రధారన్’లో అవకాశం ఇప్పించాడు. ఆ తర్వాత పలు కోలీవుడ్, మాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించిన మీరా.. ‘పాదమ్ ఒన్ను ఒరు విలాపం’ మూవీతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డును అందుకుంది. (చదవండి: నయనతార, విజయ్ సేతుపతిలతో సమంత సెలబ్రేషన్.. ఫోటోలు వైరల్) ఇలా తనదైన నటనతో దూసుకెళ్తున్న మీరాకు తక్కువ టైమ్‌లోనే టాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. తెలుగులోకి రిలీజైన్ డబ్బింగ్ మూవీ ‘రన్’తో టాలీవుడ్‌కి పరిచయమైంది మీరాజాస్మిన్. ఆ తర్వాత 2004లో హీరో శివాజీతో కలిసి ‘అమ్మాయి బాగుంది’లో నటించి మెప్పించింది. పవన్ కళ్యాణ్‌తో గుడుంబా శంకర్, రవితేజతో భద్ర, విశాల్‌తో పందెం కోడి తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ భామ. హీరో రాజశేఖర్, మీరా జాస్మిన్ అన్న చెల్లెలుగా నటించిన ‘గోరింటాకు’తో తెలుగింటి ఆడపడుచు అయిపోయింది. ఈ మూవీలోని ఎమోషనల్ సీన్స్‌లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. తనదైన నటనతో దక్షిణాదిన స్టార్ హీరోయిన్గా ఎదిగిన మీరా.. 2014 లో దుబాయ్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న అనిల్ జాన్ టైటాన్‌ని వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది. అయితే వివాహం తర్వాత తలెత్తిన విబేధాల కారణంగా మీరా.. తన భర్తతో విడిపోయింది. అయినప్పటికీ ఆమె సినిమాలపైపు తిరిగి చూడలేదు. జీవితంలో ఉన్న ఒడిదుడుకుల కారణంగా సినిమాలకు దూరమైన ఆమె ఇప్పుడు రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. కొంతకాలం క్రితం ఓ మలయాళం సినిమాలో గెస్ట్ రోల్లో మీరా కనిపించింది. అయితే ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మళ్లీ పూర్తిగా సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుందట. రీ ఎంట్రీ కోసం ఈ అమ్మడు జిమ్ కి వర్క్ అవుట్స్ చేసి వెయిట్ లాస్ అయిందట. ప్రజెంట్ మీరాకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏదేమైనా.. భూమిక, స్నేహల మాదిరిగా మీరా సెకండ్ ఇన్సింగ్స్ కూడా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగాలని ఆశిద్దాం. -
‘పందెంకోడి 3’ వస్తుంది
‘‘పందెంకోడి 2’ వంటి మంచి హిట్ సినిమాని మాకు అందించిన విశాల్‌కి, లింగుస్వామికి థ్యాంక్స్. ఈ దసరా పండగకు మా సంస్థకు మంచి విజయాన్ని అందించిన అందరికీ కృతజ్ఞతలు’’ అని ‘ఠాగూర్’ మధు అన్నారు. విశాల్, కీర్తీ సురేష్ జంటగా, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాజ్‌కిరణ్ ముఖ్య పాత్రల్లో ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పందెంకోడి 2’. ‘ఠాగూర్’ మధు సమర్పణలో విశాల్, దవళ్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతి లాల్ గడా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలైంది. ‘ఠాగూర్’ మధు మాట్లాడుతూ– ‘‘పండక్కి విడుదలైన మూడు సినిమాలకు మంచి స్పందన రావడం హ్యాపీగా ఉంది. ‘పందెం కోడి 2’ విజయం పట్ల విశాల్ హ్యాపీగా ఉన్నారు. సీక్వెల్స్‌లో సక్సెస్ రేట్ తక్కువ. కానీ, ఫస్ట్ పార్ట్‌లోని పాత్రలతో సింక్ అయిన సీక్వెల్స్ సక్సెస్ అయ్యాయి. మా సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ‘పందెంకోడి 3’ కోసం విశాల్, లింగుస్వామి ఓ లైన్ అనుకున్నారు. సెకండ్ పార్ట్ రావడానికి దాదాపు 13 ఏళ్లు పట్టింది. ఈసారి లేట్ అవ్వదు. విశాల్ ప్రస్తుతం 4 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ‘పందెంకోడి 3’ స్టార్ట్ అవుతుంది. నిఖిల్ నటించిన ‘ముద్ర’ సినిమా మా బ్యానర్లో రిలీజ్ అవుతుంది. ‘దేవ్, కాంచన 3’ సినిమాలను తెలుగులో మేం రిలీజ్ చేయాలనుకుంటున్నాం. వీటితో పాటు తెలుగులో రెండు సినిమాల కోసం చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
పులి మేక కలిసి ఆడే ఆట!
గతేడాది విశాల్ హీరోగా తమిళంలో నటించిన ‘తుప్పరివాలన్’ తెలుగులో ‘డిటెక్టివ్’ పేరుతో రిలీజై హిట్ సాధించింది. అలాగే ఈ ఏడాది ఆయన నటించిన ‘ఇరంబుదురై’ కూడా తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో విడుదలై బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించింది. ఇప్పుడు విశాల్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘సండై కోళి 2’. లింగుస్వామి దర్శకత్వం వహించారు. కీర్తీ సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. విశాల్– లింగుస్వామి కాంబినేషన్లోనే 2005లో వచ్చిన ‘పందెం కోడి’ చిత్రానికి ఇది సీక్వెల్. ఇది విశాల్ కెరీర్లో 25వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమా ఫస్ట్ లుక్స్‌తో పాటు టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘ఠాగూర్’ మధు సమర్పణలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ పతాకాలపై రూపొందిన ‘పందెం కోడి 2’ చిత్రాన్ని విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 18న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ‘ఇది పులి, మేక ఆట కాదు. పులి, మేక కలిసి ఆడే ఆట’, ‘ నేనింకా ఆడుకోవడం మొదలుపెట్టలేదు. అడ్డుకోవడం మాత్రమే మొదలుపెట్టాను’ అనే డైలాగ్స్ బాగున్నాయి’’అని సమర్పకులు ‘ఠాగూర్’ మధు అన్నారు. -
పందెం ముగిసింది
హీరో విశాల్ తెలుగువాడే అయినా తమిళంలో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. తమిళంలో ఆయనకున్న ప్రేక్షకాదరణ, అభిమానుల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘పందెంకోడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు విశాల్. ఆ చిత్రం విడుదలైన పుష్కర కాలానికి సీక్వెల్‌గా ‘పందెం కోడి 2’ తెరకెక్కించారు. కీర్తీ సురేశ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓ కీలకపాత్ర చేశారు. పార్ట్ 1 తెరకెక్కించిన లింగుస్వామి దర్శకత్వంలోనే తెరకెక్కిన ఈ సీక్వెల్ షూటింగ్‌కి ఆదివారం గుమ్మడికాయ కొట్టేశారు చిత్రయూనిట్. ఈ సినిమా అక్టోబర్ 18న విడుదల కానుంది. కాగా విశాల్, సమంత జంటగా మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇరంబుదురై’ (అభిమన్యుడు) సినిమా ఆదివారంతో 100 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. -
సీక్వెల్‌ని నమ్ముకున్న విశాల్
-
పందెం కోడి సీక్వెల్‌కు రంగం సిద్ధం!
-
వందకోట్లు ఇస్తామన్నా... మళ్లీ అలాంటి ప్రయోగం చేయను!
తమిళంలో జయభేరి మోగించిన తెలుగు కుర్రాడు విశాల్. హీరోగా తన ప్రతిభ చెప్పడానికి ‘పందెంకోడి’ చాలు. నటుడిగా తనేంటో చెప్పడానికి ఒక్క ‘వాడు-వీడు’ సినిమా చాలు. నవంబర్ 2న ‘పల్నాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విశాల్. అటు ‘పందెంకోడి’, ఇటు ‘వాడు-వీడు’ రెండూ కలిస్తే ఎలా వుంటుందో ‘పల్నాడు’ అలా ఉంటుందని కాన్ఫిడెంట్‌గా చెబుతున్న విశాల్‌తో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ. ‘పల్నాడు’ అంటున్నారు.. ఫ్యాక్షన్ నేపథ్యమా? అవును.. తమిళ వెర్షన్లో ఈ సినిమా పేరు ‘పాండ్యనాడు’. మధురై నేపథ్యంలో సాగే కథ. మన పల్నాడు నేటివిటీకి దగ్గరగా ఉండే కథ కావడంతో ‘పల్నాడు’ అనే టైటిల్ పెట్టాం. సుశీంద్రన్ డెరైక్ట్ చేసిన ‘నా పేరు శివ’ నేపథ్యం చాలా భిన్నంగా ఉంటుంది. మరీ ఇందులో కొత్తదనం ఏంటి? సుశీంద్రన్ గత చిత్రాల మాదిరిగానే రియలిస్టిగ్గా ఉండేసినిమా ఇది. నా పాత్రను చాలా కొత్తగా తీర్చిదిద్దారు. ఇందులో నాకు ఆవేశం వస్తే... ఆటోమేటిగ్గా ‘నత్తి’ వచ్చేస్తుంటుంది. ఛాలెంజింగ్‌గా తీసుకొని ఈ పాత్ర చేశాను. ‘వాడు-వీడు’లో మెల్లకన్ను. ‘పల్నాడు’లో నత్తి... ఏంటి ఉన్నట్టుండి ప్రయోగాల బాట పట్టారు? ప్రతి నటుడికీ స్థాయిని బట్టి ఆకలి ఉంటుందండీ. దాన్ని తీర్చుకునే అవకాశాలు అరుదుగా మాత్రమే వస్తాయి. అలాంటి అవకాశం అప్పుడు ‘వాడు-వీడు’ ద్వారా వస్తే... ఇప్పుడు ‘పల్నాడు’ ద్వారా వచ్చింది. అయితే... ‘వాడు-వీడు’ లాంటి ప్రయోగాన్ని మాత్రం వందకోట్ల రూపాయలు ఇస్తామన్నా సరే... మళ్లీ చేయను. ఎందుకని? దాని వల్ల నా కళ్లకు వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా తగ్గలేదు. అయితే... పాత్రకు వచ్చిన స్పందనను కూడా మాటల్లో చెప్పలేను. కొన్ని పాత్రలు చేస్తున్నప్పుడే మనకు అర్థమైపోతుంది. అవి గొప్ప పేరు తెస్తాయని. ‘పల్నాడు’ విషయంలో కూడా నాకు అలాగే అనిపించింది. ఈ సినిమా తర్వాత మరిన్ని మంచి పాత్రలు నన్ను వెతుక్కుంటూ వస్తాయని నా నమ్మకం. ‘పల్నాడు’లో ప్రముఖ దర్శకుడు భారతీరాజాతో కలిసి నటించడం ఎలా అనిపించింది? నా లైఫ్‌లో మరిచిపోలేని విషయం అది. నా తండ్రి పాత్రను పోషించారాయన. 70 ఏళ్ల వృద్ధుడు పాత్ర ఆయనది. అంత గొప్ప దర్శకుడై ఉండి కూడా, ఒక విద్యార్థిలా చెప్పింది చెప్పినట్లు చేశారు. ఆయన డెడికేషన్ చూసి షాక్ అయ్యాను. తమిళంలో ‘ఎమ్జీఆర్’(మదగజరాజా), తెలుగులో ‘ఎన్టీఆర్’ (నటరాజు-తనేరాజు). కేవలం క్రేజ్ కోసమేనా ఈ టైటిల్స్? ‘మదగజరాజా’కు షార్ట్‌కట్ ‘ఎమ్జీఆర్’. ఈ టైటిల్ పెట్టగానే తమిళనాట మంచి క్రేజ్ ఏర్పడింది. తెలుగులో ఆ స్థాయి క్రేజ్ రావాలంటే... ‘ఎన్టీఆర్’ అని పెట్టడమే కరెక్ట్. అందుకే షార్ట్‌కట్‌లో ఎన్టీఆర్ అని వచ్చేలా ‘నటరాజు-తనేరాజు’ అని టైటిల్ పెట్టాం. దానిక్కూడా మంచి క్రేజ్ వచ్చింది. కథకు కూడా ఈ టైటిల్ చక్కగా సరిపోయింది. ఈ సినిమా పూర్తిస్థాయి వాణిజ్య చిత్రం. ప్రయోగాల జోలికి పోకుండా, ఫక్తు కమర్షియల్ ఫార్ములాను ఫాలో అవుతూ ఈ సినిమా చేస్తున్నాం. సుందర్.సి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం నాకు మంచి పేరు తెస్తుంది. మీ అన్నయ్య నిర్మాణసంస్థని పక్కన పెట్టేసి, సొంతంగా ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు దేనికి? కోపంతో నేనా సంస్థ స్టార్ట్ చేశాను. దానికి బలీయమైన కారణమే ఉంది. నిజానికి ఈ సినిమాకు ముందు నిర్మాత వేరే. కానీ కొన్ని కారణాలవల్ల నేనే నిర్మించా. ఈ విషయంలో లోతుగా వెళ్లడం నాకు ఇష్టం లేదు. గత ఏడాది నా సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అలాంటి పొరపాటు మళ్లీ జరగకూడదనే ఈ సంస్థను మొదలెట్టా. ఇక అన్నయ్య ప్రొడక్షన్ అంటారా! నాన్నకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చూసుకునే పనిలో అన్నయ్య బిజీగా ఉన్నారు. త్వరలో అన్నయ్య ప్రొడక్షన్లో సినిమా ఉంటుంది. తెలుగులో డెరైక్ట్ సినిమా ఎప్పుడు చేస్తారు? నిజానికి ఈ దసరాకే స్టార్ట్ చేయాలి. కథ కూడా ‘ఓకే’ అయ్యింది. శశికాంత్ దర్శకుడు. కానీ నాకు ‘పల్నాడు’ కథ నచ్చడంతో వదులుకోలేకపోయా. దాంతో తెలుగు సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. నా సొంత సంస్థలోనే త్వరలో తెలుగు సినిమా చేస్తా. మీ భవిష్యత్తు ప్రణాళికలు? తిరు దర్శకత్వంలో ‘యూటీవీ’వారితో టైఅప్ అయ్యి ఓ చిత్రం చేయబోతున్నాను. తమిళ వెర్షన్ పేరు ‘నాన్సిగపు మణిదన్’. అలాగే బాలా దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఉండొచ్చు. చివరి ప్రశ్న. శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మితో మీరు లవ్‌లో ఉన్నారట. నిజమేనా? ఈ రూమర్ నా దగ్గరకూ వచ్చింది. వరలక్ష్మి నా బాల్య స్నేహితురాలు. పైగా మేం ఇద్దరం కలిసి ‘మదగజరాజా’ సినిమా చేస్తున్నాం. దాంతో ఈ రూమర్‌ని క్రియేట్ చేశారు. ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు. అసలు పెళ్లి గురించి ఆలోచించడానిక్కూడా నాకు టైమ్ కుదరడం లేదు. ఇక ప్రేమించే టైమ్ ఎక్కడిది చెప్పండి.