హీరోయిన్‌ మీరా జాస్మిన్‌ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా? | Actress Meera Jasmine Marriage And Real Life Story In Telugu | Sakshi
Sakshi News home page

Meera Jasmine Now: మీరా జాస్మిన్‌ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుంది?

Published Tue, Aug 24 2021 11:20 AM | Last Updated on Tue, Aug 24 2021 3:36 PM

Actress Meera Jasmine Marriage And Real Life Story In Telugu - Sakshi

Meera Jasmine Lifestory: కొంతమంది హీరోయిన్లు చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ తమదైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో చిరకాలం నిలిచిపోతుంటారు. అలాంటి కొద్ది మంది​ హీరోయిన్లలో మీరా జాస్మిన్‌ ఒకరు. తన అభినయం, క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది ఈ కేరళ కుట్టి. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ కేవలం హావభావాలతో లక్షలాదిమంది మనస్సును దోచుకుంది. 2001-2010 కాలంలో ఆమె స్టార్‌ హీరోయిన్‌. తెలుగుతో పాటు మలయాళం, త‌మిళ భాషల్లో న‌టించిన జాతీయ ఉత్త‌మ న‌టిగా గుర్తింపు పొందింది. 

కేరళకు చెందిన ఈ బ్యూటీ.. 1982 ఫిబ్రవరి 15న కేరళలోని తీరువల్లలో ఓ సిరియన్‌ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. ఈమె అసలు పేరు జాస్మిన్‌ మేరి జోసెఫ్‌. మీరా సోదరుడు జార్జ్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. మీరా డిగ్రీ చదువుతున్న రోజుల్లో బ్లెస్సి అనే సహాయ దర్శకుడు ఆమెను చూసి సినిమాల్లోకి ఆహ్వానించాడు. ప్రముఖ దర్శకుడు లోహిత్‌ దాస్‌కు మీరాని పరిచయం చేసి మలయాళం మూవీ ‘సూత్రధారన్‌’లో అవకాశం ఇప్పించాడు. ఆ తర్వాత పలు కోలీవుడ్‌, మాలీవుడ్‌ సినిమాల్లో నటించి మెప్పించిన మీరా.. ‘పాదమ్ ఒన్ను ఒరు విలాపం’ మూవీతో ఉత్తమ నటిగా నేషనల్‌ అవార్డును అందుకుంది.
(చదవండి: నయనతార, విజయ్‌ సేతుపతిలతో సమంత సెలబ్రేషన్‌.. ఫోటోలు వైరల్‌)

ఇలా తనదైన నటనతో దూసుకెళ్తున్న మీరాకు తక్కువ టైమ్‌లోనే టాలీవుడ్‌ నుంచి పిలుపొచ్చింది. తెలుగులోకి రిలీజైన్ డబ్బింగ్ మూవీ ‘రన్‌’తో టాలీవుడ్‌కి పరిచ‌య‌మైంది మీరాజాస్మిన్‌. ఆ త‌ర్వాత 2004లో హీరో శివాజీతో క‌లిసి ‘అమ్మాయి బాగుంది’లో నటించి మెప్పించింది. పవన్ కళ్యాణ్‌తో గుడుంబా శంకర్, రవితేజతో భద్ర, విశాల్‌తో పందెం కోడి తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ భామ. హీరో రాజ‌శేఖ‌ర్, మీరా జాస్మిన్ అన్న చెల్లెలుగా న‌టించిన ‘గోరింటాకు’తో తెలుగింటి ఆడపడుచు అయిపోయింది. ఈ మూవీలోని ఎమోషనల్‌ సీన్స్‌లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. 

తనదైన నటనతో దక్షిణాదిన స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన మీరా.. 2014 లో దుబాయ్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న అనిల్‌ జాన్‌ టైటాన్‌ని వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది. అయితే వివాహం తర్వాత తలెత్తిన విబేధాల కారణంగా మీరా.. తన భర్తతో విడిపోయింది. అయినప్పటికీ ఆమె సినిమాలపైపు తిరిగి చూడలేదు. జీవితంలో ఉన్న ఒడిదుడుకుల కారణంగా సినిమాలకు దూరమైన ఆమె ఇప్పుడు రీ ఎంట్రీకి రెడీ అవుతోంది.

కొంతకాలం క్రితం ఓ మలయాళం సినిమాలో గెస్ట్ రోల్‌లో మీరా కనిపించింది. అయితే ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మళ్లీ పూర్తిగా సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుందట. రీ ఎంట్రీ కోసం ఈ అమ్మ‌డు జిమ్ కి వ‌ర్క్ అవుట్స్ చేసి వెయిట్ లాస్ అయిందట. ప్ర‌జెంట్ మీరాకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ఏదేమైనా.. భూమిక, స్నేహల మాదిరిగా మీరా సెకండ్‌ ఇన్సింగ్స్‌ కూడా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగాలని ఆశిద్దాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement