Gudumba Shankar
-
బొద్దుగా ఉండే మీరా జాస్మిన్ ఇప్పుడెలా ఉందో చూశారా?
Meera Jasmine Recent Pictures: మీరా జాస్మిన్.. టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఒకప్పుడు ఈమె స్టార్ హీరోయిన్. అందం, అభినయంతో లక్షలాది మంది అభిమానులకు సంపాదించుకుంది. ఈ భామ ఇచ్చే క్యూట్ ఎక్స్ప్రెషన్స్కు యువత ఫిదా అయింది. 2001-2010 కాలంలో మీరా స్టార్ హీరోయిన్. పవన్ కల్యాణ్,బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలకు నటించి, మెప్పించింది. డబ్బింగ్ మూవీ ‘రన్’తో టాలీవుడ్‌కి పరిచయమైంది మీరాజాస్మిన్. ఆ తర్వాత 2004లో శివాజీ ‘అమ్మాయి బాగుంది’మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తనదైన అభినయంతో తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. పవన్ కల్యాణ్‌తో కలిసి గుడుంబా శంకర్‌లో నటించింది. ఈ చిత్రంలో మీరాకు మంచి గుర్తింపు వచ్చింది. ‘చిట్టినడుమునే చూస్తున్న’ పాటలో పవన్, మీరాల కెమిస్ట్రీ అదిరిపోవడంతో ఈ బ్యూటీకి వరస ఆఫర్లు వచ్చాయి. రవితేజ భద్ర, విశాల్ పందెకోడి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. రాజశేఖర్ గోరింటాకు చిత్రంతో తెలుగింటి ఆడపడచు అయిపోయింది. 2014 లో దుబాయ్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న అనిల్ జాన్ టైటాన్‌ని వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది. కొన్నాళ్ల తర్వాత విభేదాల కారణంగా భర్తతో విడిపోయింది. ఆ తర్వాత కూడా సినిమాల వైపు తిరిగి చూడలేదు. చాలా కాలం తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు మీరా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే మలయాళంలో ‘మకల్’అనే చిత్రంలో నటిస్తుంది. ఇప్పుడు తెలుగులో కూడా సినిమాలు చేయాలని ప్రయత్నిస్తుందట. ఇప్పటికే బోయపాటి శ్రీను తెరకెక్కించబోయే చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. తెరపై బొద్దగా ఉండే మీరా.. ఇప్పుడు చాలా సన్నబడింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాలుగు పదుల వయసులో కూడా మీరా..గతంలో కంటే అందంగా కనిపిస్తోంది. రీఎంట్రీ కోసమే ఈ అమ్మడు వెయిట్ లాస్ అయిందట. సన్నబడిన మీరా జాస్మిన్ ఫోటోలు చూసి నెటిజన్స్ షాకవుతున్నారు. మీరా ఏంటి.. ఇంత సన్నబడింది? సినిమాల్లో రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాం అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఒక్కరోజులోనే మీరా జాస్మిన్‌కు లక్షమంది ఫాలోవర్లు
Meera Jasmine Re Entry To Films Debuts On Instagram: ‘అమ్మాయే బాగుంది’చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన మలయాళీ బ్యూటీ మీరా జాస్మిన్. 'గుడుంబా శంకర్', 'భద్ర' వంటి చిత్రాలతో తెలుగులో పాపులర్ అయిన ఈ బ్యూటీ ‘పందెం కోడి’ ‘గోరింటాకు’, ‘ఆకాశ రామన్న’ సహా పలు మలయాళ చిత్రాల్లో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో విజయాలు లభించలేదు. దీంతో కొన్నాళ్లకి దుబాయ్‌కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటాన్‌ని 2014లో పెళ్లి చేసుకుంది. అయితే మనస్పర్థల కారణంగా కొన్నాళ్లకు భర్త నుంచి విడిపోయిన మీరా జాస్మిన్.. మళ్లీ ఇన్నాళ్లకు తిరిగి సినిమాలు చేసేందుకు సిద్ధమైంది. ఇటీవలె సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మకల్ అనే ఓ మలయాళ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్‌లోనూ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లోకి కూడా అడుగుపెట్టింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉండాలని భావిస్తుందట. అలా ఇన్‌స్టాలో ఆమె ఎంట్రీ ఇచ్చిందో లేదో ఆమెకు ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఒక్క రోజులోనే సుమారు లక్షమంది ఆమెను ఫాలో అయ్యారు. -
హీరోయిన్ మీరా జాస్మిన్ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా?
Meera Jasmine Lifestory: కొంతమంది హీరోయిన్లు చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ తమదైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో చిరకాలం నిలిచిపోతుంటారు. అలాంటి కొద్ది మంది హీరోయిన్లలో మీరా జాస్మిన్ ఒకరు. తన అభినయం, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది ఈ కేరళ కుట్టి. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ కేవలం హావభావాలతో లక్షలాదిమంది మనస్సును దోచుకుంది. 2001-2010 కాలంలో ఆమె స్టార్ హీరోయిన్. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషల్లో నటించిన జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు పొందింది. కేరళకు చెందిన ఈ బ్యూటీ.. 1982 ఫిబ్రవరి 15న కేరళలోని తీరువల్లలో ఓ సిరియన్ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. ఈమె అసలు పేరు జాస్మిన్ మేరి జోసెఫ్. మీరా సోదరుడు జార్జ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. మీరా డిగ్రీ చదువుతున్న రోజుల్లో బ్లెస్సి అనే సహాయ దర్శకుడు ఆమెను చూసి సినిమాల్లోకి ఆహ్వానించాడు. ప్రముఖ దర్శకుడు లోహిత్ దాస్‌కు మీరాని పరిచయం చేసి మలయాళం మూవీ ‘సూత్రధారన్’లో అవకాశం ఇప్పించాడు. ఆ తర్వాత పలు కోలీవుడ్, మాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించిన మీరా.. ‘పాదమ్ ఒన్ను ఒరు విలాపం’ మూవీతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డును అందుకుంది. (చదవండి: నయనతార, విజయ్ సేతుపతిలతో సమంత సెలబ్రేషన్.. ఫోటోలు వైరల్) ఇలా తనదైన నటనతో దూసుకెళ్తున్న మీరాకు తక్కువ టైమ్‌లోనే టాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. తెలుగులోకి రిలీజైన్ డబ్బింగ్ మూవీ ‘రన్’తో టాలీవుడ్‌కి పరిచయమైంది మీరాజాస్మిన్. ఆ తర్వాత 2004లో హీరో శివాజీతో కలిసి ‘అమ్మాయి బాగుంది’లో నటించి మెప్పించింది. పవన్ కళ్యాణ్‌తో గుడుంబా శంకర్, రవితేజతో భద్ర, విశాల్‌తో పందెం కోడి తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ భామ. హీరో రాజశేఖర్, మీరా జాస్మిన్ అన్న చెల్లెలుగా నటించిన ‘గోరింటాకు’తో తెలుగింటి ఆడపడుచు అయిపోయింది. ఈ మూవీలోని ఎమోషనల్ సీన్స్‌లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. తనదైన నటనతో దక్షిణాదిన స్టార్ హీరోయిన్గా ఎదిగిన మీరా.. 2014 లో దుబాయ్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న అనిల్ జాన్ టైటాన్‌ని వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది. అయితే వివాహం తర్వాత తలెత్తిన విబేధాల కారణంగా మీరా.. తన భర్తతో విడిపోయింది. అయినప్పటికీ ఆమె సినిమాలపైపు తిరిగి చూడలేదు. జీవితంలో ఉన్న ఒడిదుడుకుల కారణంగా సినిమాలకు దూరమైన ఆమె ఇప్పుడు రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. కొంతకాలం క్రితం ఓ మలయాళం సినిమాలో గెస్ట్ రోల్లో మీరా కనిపించింది. అయితే ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మళ్లీ పూర్తిగా సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుందట. రీ ఎంట్రీ కోసం ఈ అమ్మడు జిమ్ కి వర్క్ అవుట్స్ చేసి వెయిట్ లాస్ అయిందట. ప్రజెంట్ మీరాకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏదేమైనా.. భూమిక, స్నేహల మాదిరిగా మీరా సెకండ్ ఇన్సింగ్స్ కూడా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగాలని ఆశిద్దాం. -
నాకేం తక్కువ? కొంచెం కలర్ తక్కువ...
ఉత్తమ విలన్ గౌరీ... ఇది ఆట కాదు. జీవితం. ఏదైనా సరే... నాకు ఓడిపోవడం ఇష్టం ఉండదు. అలాంటి నన్ను ఓడించాలని చూస్తావా? నాకేం తక్కువ? కొంచెం కలర్ తక్కువ. పవర్ ఉంటే... అన్నీ కొట్టుకుపోతాయి. అది నాకు ఉంది కదా! ‘గుడుంబా శంకర్’ సినిమాలో కుమారస్వామి నాయుడు డైలాగ్ ఇది. ఈ నాయుడు... ఆశిష్ విద్యార్థి. నిజమే... ఆశిష్ దగ్గర పవర్ ఉంది. అది పొలిటికల్ పవర్ కాదు. కరెన్సీకి సంబంధించిన పవర్ కాదు... కలేజా పవర్! ‘నన్ను సవాల్ చేసే పాత్ర రావాలి...దాన్ని నేను సవాలు చేయాలి’ అనుకునే పవర్. ప్రాంతీయ టీవీ ఛానెళ్లలో మొదట్లో మైనర్ రోల్స్ చేసిన ఆశిష్ పెద్ద విలన్‌గా ఎదగడానికి ఈ పవరే కారణం. ‘ఒరేయ్ ఆనంద్... బ్రిటిష్ వాళ్లు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్లిపోయారని ఓ... ఏడుస్తుంటారు మనవాళ్లంతా. దాని పేరేమిటి? కోహినూర్ వజ్రం. ఎవరు చెప్పారురా బ్రిటిష్ వాళ్లు పట్టుకెళ్లారని? అదిగో... రోడ్ల మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్....’ అందమైన ఆడపిల్ల శ్రుతిని ఇలా కవితాత్మకంగా టీజ్ చేయడమే కాదు... ఎన్ని దుర్మార్గాలు చేయాలో అన్ని దుర్మార్గాలూ చేస్తాడు ‘పోకిరి’ సినిమాలో ఇన్స్పెక్టర్ పశుపతి(ఆశిష్). ఈ పశుపతి అంటే అందాల శ్రుతికి మాత్రమే కాదు ఆమె తమ్ముడికి, అమ్మకీ భయమే. వీళ్ల సంగతి వదిలేయండి...పెద్ద పెద్ద గూండాలే ఇతనికి భయపడతారు. పనిగట్టుకొని దుర్మార్గాన్ని అదేపనిగా పండిస్తున్నట్లుగా ఉండదు ఆశిష్ విద్యార్థి నటన. సహజంగా ఉంటుంది. ఎంత సహజంగా అంటే... తెర మీద విలన్‌ను చూస్తున్నట్లుగా ఉండదు. నిజజీవితంలో ఎప్పుడో, ఎక్కడో ఒక దుర్మార్గుడిని చూసినట్లుగానే ఉంటుంది. అతనిలోని ‘చెడు’ను చూస్తున్నట్లుగానే ఉంటుంది. ‘ఆశిష్ విద్యార్థి మంచి నటుడు’ అనే పేరు ఒకే ఒక సినిమాతోనో, రెండో సినిమాతోనో రాలేదు. అదొక అందమైన ప్రయాణం. ‘నటుడు అనే వాడు ఎప్పటికప్పుడు సవాళ్ల కోసం ఎదురుచూడాల్సిందే’ అంటాడు ఆశిష్. ‘ద్రోహ్కాల్’లో ‘కామ్రేడ్ భద్రా’గా తన అద్భుత నటనతో ప్రేక్షకుల మెప్పును మాత్రమే కాదు... జాతీయ అవార్డ్‌ను కూడా అందుకున్నాడు ఆశిష్. ‘ఒక సంతృప్తికరమైన పాత్రను పోషించాను’ అని ఫుల్లుగా సంతృప్తి పడి ఎడాపెడా పాత్రలు చేసుకుంటూ పోలేదు. తనను సవాలు చేసే పాత్రల కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. కానీ అతడి నిరీక్షణ ఫలించలేదు. ‘సేమ్ కైండ్ ఆఫ్ రోల్స్’ అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఊపిరి పీల్చుకోవడానికి ముంబై విడిచి పారిపోవడం తప్ప వేరే మార్గం లేదు అనుకున్నాడు. ఈలోపు ఒక పెద్ద నటుడిని కలిసి తన మనసులో బాధను చెప్పుకున్నాడు. ‘‘చేసిన పాత్రలే చేసి బోర్ కొడుతోంది’’ అన్నాడు. ‘‘ఫరావాలేదు... మొదట బోర్ కొట్టినా... ఆ తరువాత అదే అలవాటైపోతుంది’’ అన్నాడు ఆ నటుడు. ఆయన సీరియస్‌గా అన్నాడో, నవ్వించడానికి అన్నాడోగానీ.... ఆశిష్‌కు బోర్ పాత్రలు అలవాటైపోలేదు. మరింత బోర్ కలిగించాయి. ‘ఈమాత్రం దానికేనా నేను సినిమాల్లో నటించేది!’ అనుకున్నాడు. తక్షణం ముంబాయి విడిచాడు. ఒక పాత కథ ముగియలేదు. ఒక కొత్త కథ మొదలైంది... ఆకలితో ఉన్న ఆశిష్‌కు దక్షిణాది సినీపరిశ్రమ కడుపు నిండిపోయే ఆతిథ్యాన్ని ఇచ్చింది. ఎలాంటి పాత్రలైతే చేయాలనుకున్నాడో అలాంటి పాత్రలు చేశాడు. ఒకదానితో ఒకటి సంబంధం లేని పాత్రలు. తృప్తితో కడుపు నిండే పాత్రలు. ‘బాబా’, ‘శ్రీరామ్’, ‘ఏకె-47’, ‘గుడుంబాశంకర్’, ‘నరసింహుడు’, ‘పోకిరి’, ‘చిరుత’, ‘అతిథి’, ‘తులసి’, ‘అలా మొదలైంది’, ‘కిక్-2’... మొదలైన సినిమాలు ఆశిష్‌కు మంచి గుర్తింపును ఇచ్చాయి. ‘‘సౌత్‌లో నేను పోషించిన పాత్రలు... నటుడిగా నన్ను నేను పునర్నిర్మించుకోవడానికి ఉపయోగపడ్డాయి’’ అంటాడు ఆశిష్ కృతజ్ఞత నిండిన కంఠంతో. -
సమాజాన్ని మేలుకొలిపే పాట
‘‘మనిషి నిరాశలో, నిస్పృహలో ఉన్నప్పుడు... మనిషి కష్టాల్లో, దుఃఖాల్లో ఉన్నప్పుడు... మనిషికి ఎదురుదెబ్బ తగిలినప్పుడు.. ఎదురీదాలనుకున్నప్పుడు.. ఎదురు తిరగాలనుకున్నప్పుడు.. పవన్ కల్యాణ్ ‘గుడుంబా శంకర్’లో ‘లే.. లే.. లేలే..’ పాట వినాలి. ఈ పాట వింటే... చచ్చిపోవాలనుకునేవాడికి బ్రతకాలనే ఆశ కలుగుతుంది. భయపడేవాడికి ధైర్యం వస్తుంది. పారిపోయేవాడికి నిలబడి రొమ్ము చూపించాలని అనిపిస్తుంది. జీవచ్ఛవంగా ఉన్న మనిషిని లేపగలిగే శక్తి సామర్ధ్యం ఈ సాహిత్యంలో ఉంది. మనిషిని మేలుకొలిపే పాట ఇది’’ అన్నారు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో. ‘లే.. లే.. లేలే..’ పాటతత్వం గురించి భీమ్స్ మాటల్లో... ఈ పాటను ఎన్నిసార్లు విన్నానో లెక్కలేదు. 2004లో విడుదలైందీ సినిమా. అప్పటికి నేనింకా సంగీత దర్శకుడు కాలేదు. సహాయకుడిగా పనిచేసేవాణ్ణి. అసలు సంగీత దర్శకుడు అవుతామా? లేదా? ఎవరైనా అవకాశం ఇస్తారా? లేదా? ఒకవేళ అవకాశం వస్తే, ఈరోజు వస్తుందా? రేపు వస్తుందా? తెలియకుండానే ఒక మానసిక సంఘర్షణ జరుగుతున్న ప్రతిసారీ చంద్రబోస్ గారు రాసిన ఈ పాట నాలో ఎంతో స్ఫూర్తి నింపేవి. లే.. లే.. లేలే.. ఇవ్వాళ్ళే లేలే/ లే.. లే.. లేలే.. ఈరోజల్లే లేలే ఈ పల్లవి వింటుంటూనే నాలో ఓ ఉత్సాహం వస్తుంది. మనం చేయాలనుకున్న పనిని ఈరోజు, ఈ క్షణమే చేసేయాలి. వాయిదా వేయడమంటే మనకు వచ్చే అవకాశాలను వృథా చేసుకోవడమే. చిరుతతో పోటీపడే వేగంగానైనా, చిరుగాలిలా అయినా మనం చేయబోయే పనిని ప్రారంభించాలి. అప్పుడే ఆకలి, బాధలు తీరుతాయి. ఎవరైనా ఏదైన సందర్భంలో నీ ఆలోచనలను, శక్తి సామర్థ్యాలను, నిజాయితీని తక్కువ అంచనా వేసినప్పుడు నీ ప్రతిభ ఏంటనేది చూపించాలి. జీవితంలో నిజాయితీగా ఉండడమనేది చాలా ముఖ్యం. కానీ, నీ నిజాయితీ ఎదుటివ్యక్తికి బలహీనత అవ్వకూడదు. ఎప్పుడైతే.. ఎదుటివ్యక్తి నీ నిజాయితీని అలుసుగా తీసుకున్నాడో, శక్తిని తక్కువ అంచనా వేశాడో.. ఎదురీదాలి, ఎదురు తిరగాలి. నీరల్లే పారాలి.. అందరి దాహం తీర్చాలి.. అణిచేస్తే ముంచేయాలి లే నేలల్లే ఉండాలి.. అందరి భారం మోయాలి.. విసిగిస్తే భూకంపాలే చూపాలే ఈ చరణంలో ప్రజలు ఎలా ఉండాలో వివరించారు. నీరు చేరని చోటు ఉండదు. మనసుంటే మార్గం ఉంటుందంటారు కదా. ప్రయత్నిస్తే.. మనమూ చేరుకోలేని చోటు ఉండదు. ఈ ప్రయత్నంలో ఎవరైనా అణిచివేయాలని ప్రయత్నిస్తే.. చేతులు కట్టుకుని కూర్చోకూడదు. చెడు వుంది.. మంచి వుంది.. అర్థం వేరే వుంది..చెడ్డోళ్లకి చెడు చేయ్యడమే మంచి/చేదుంది.. తీపి వుంది.. భేదం వేరే వుంది.. చేదన్నది ఉన్నపుడేగా తీపి ఈ లోకంలో మంచి చెడులున్నాయి. నువ్వు స్వీకరించే దానిబట్టి నీ ప్రయాణం ఉంటుంది. ఒక మనిషిలో రెండు పార్శ్వాలుంటాయి. చెడు ఉన్నప్పుడేగా అసలు మంచి ఏదో మనకు అర్థమయ్యేది, స్వీకరించేది. ఉదాహరణకు... సమస్య ఉన్నప్పుడేగా పరిష్కారం ఏంటో వెతికేది. పరిష్కారం ఎలా ఉండాలో ఆలోచించేది. మనం మంచిని చూసుకుంటూ చెడుని సవరించుకుంటూ ముందుకు వెళ్లాలి. మనం ప్రయాణించే దారుల్లో కుడి, ఎడమలు సహజమే. ఏది ఎటువైపు వెళ్లినా గమ్యం మాత్రం ఒక్కటే. పని పట్ల మనకు శ్రద్ధ ఉండాలి, కష్టపడాలి. అప్పుడు.. కుడి ఎడమయ్యే గొడవుంది. అంటే దాని అర్థం.. ఎడమ కూడా కుడి అవుతుందని, కష్టపడిన ప్రతి ఒక్కరూ గమ్యం చేరుకుంటారని. మన కష్టమే గమ్యం వైపు తీసుకువెళ్తుంది. ఇక, చివరి వాక్యంలో ఎంతో అర్థముంది. మరణించిన తర్వాత కూడా మనం జీవించేలా ఊపిరి ఉన్నప్పుడు బతకాలి. బాల కార్మికులు, ఈవ్ టీజింగ్, రాజకీయ పరిస్థితులను వివరిస్తూ చిత్రంలో ఈ పాట సాగుతుంది. కానీ, అంతర్గతంగా చాలా సందేశం ఉంది. సేకరణ: సత్య పులగం చంద్రబోస్ గీత రచయిత