Meera Jasmine Present Photos, Goes Viral on Social Media - Sakshi
Sakshi News home page

Meera Jasmine: వామ్మో.. మీరా జాస్మిన్‌ ఇలా మారిపోయిందేంటి?

Published Tue, May 17 2022 11:27 AM | Last Updated on Tue, May 17 2022 11:53 AM

Actress Meera Jasmine Latest Photo Goes Viral - Sakshi

Meera Jasmine Recent Pictures: మీరా జాస్మిన్‌.. టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఒకప్పుడు ఈమె స్టార్‌ హీరోయిన్‌. అందం, అభినయంతో లక్షలాది మంది అభిమానులకు సంపాదించుకుంది. ఈ భామ ఇచ్చే క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌కు యువత ఫిదా అయింది. 2001-2010 కాలంలో మీరా స్టార్‌ హీరోయిన్‌. పవన్‌ కల్యాణ్‌,బాలకృష్ణ లాంటి స్టార్‌ హీరోలకు నటించి, మెప్పించింది. 

డబ్బింగ్ మూవీ ‘రన్‌’తో టాలీవుడ్‌కి పరిచ‌య‌మైంది మీరాజాస్మిన్‌. ఆ త‌ర్వాత 2004లో శివాజీ ‘అమ్మాయి బాగుంది’మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. తనదైన అభినయంతో తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. పవన్ కల్యాణ్‌తో కలిసి గుడుంబా శంకర్‌లో నటించింది. ఈ చిత్రంలో మీరాకు మంచి గుర్తింపు వచ్చింది. 

‘చిట్టినడుమునే చూస్తున్న’ పాటలో పవన్‌, మీరాల కెమిస్ట్రీ అదిరిపోవడంతో ఈ బ్యూటీకి వరస ఆఫర్లు వచ్చాయి. రవితేజ భద్ర, విశాల్‌ పందెకోడి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. రాజశేఖర్‌ గోరింటాకు చిత్రంతో తెలుగింటి ఆడపడచు అయిపోయింది. 2014 లో దుబాయ్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న అనిల్‌ జాన్‌ టైటాన్‌ని వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది. కొన్నాళ్ల తర్వాత విభేదాల కారణంగా భర్తతో విడిపోయింది. ఆ తర్వాత కూడా సినిమాల వైపు తిరిగి చూడలేదు. 

చాలా కాలం తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు మీరా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే మలయాళంలో ‘మకల్‌’అనే చిత్రంలో నటిస్తుంది. ఇప్పుడు తెలుగులో కూడా సినిమాలు చేయాలని ప్రయత్నిస్తుందట. ఇప్పటికే బోయపాటి శ్రీను తెరకెక్కించబోయే చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. 

ఇదిలా ఉండగా.. తెరపై బొద్దగా ఉండే మీరా.. ఇప్పుడు చాలా సన్నబడింది. తాజాగా ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. నాలుగు పదుల వయసులో కూడా మీరా..గతంలో కంటే అందంగా కనిపిస్తోంది. రీఎంట్రీ కోసమే ఈ అమ్మడు వెయిట్ లాస్ అయిందట. సన్నబడిన మీరా జాస్మిన్‌ ఫోటోలు చూసి నెటిజన్స్‌ షాకవుతున్నారు. మీరా ఏంటి.. ఇంత సన్నబడింది? సినిమాల్లో రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాం అంటూ నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement