Meera Jasmine Re Entry To Films Debuts On Instagram: ‘అమ్మాయే బాగుంది’చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన మలయాళీ బ్యూటీ మీరా జాస్మిన్. 'గుడుంబా శంకర్', 'భద్ర' వంటి చిత్రాలతో తెలుగులో పాపులర్ అయిన ఈ బ్యూటీ ‘పందెం కోడి’ ‘గోరింటాకు’, ‘ఆకాశ రామన్న’ సహా పలు మలయాళ చిత్రాల్లో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో విజయాలు లభించలేదు. దీంతో కొన్నాళ్లకి దుబాయ్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటాన్‌ని 2014లో పెళ్లి చేసుకుంది.
అయితే మనస్పర్థల కారణంగా కొన్నాళ్లకు భర్త నుంచి విడిపోయిన మీరా జాస్మిన్.. మళ్లీ ఇన్నాళ్లకు తిరిగి సినిమాలు చేసేందుకు సిద్ధమైంది. ఇటీవలె సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మకల్ అనే ఓ మలయాళ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్‌లోనూ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లోకి కూడా అడుగుపెట్టింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉండాలని భావిస్తుందట. అలా ఇన్‌స్టాలో ఆమె ఎంట్రీ ఇచ్చిందో లేదో ఆమెకు ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఒక్క రోజులోనే సుమారు లక్షమంది ఆమెను ఫాలో అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment