ఆ ముగ్గురిలో ఛాన్స్ ఎవరికి..? Allu arjun next movie details | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురిలో ఛాన్స్ ఎవరికి..?

Published Wed, Jun 22 2016 1:32 PM

ఆ ముగ్గురిలో ఛాన్స్ ఎవరికి..?

సరైనోడు సినిమాతో సూపర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఇంత వరకు తన నెక్ట్స్ సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అయితే బన్నీ సినిమాను డైరెక్ట్ చేయటం కోసం టాలీవుడ్ నుంచే కాదు, కోలీవుడ్ దర్శకులు కూడా పోటీ పడుతున్నారు. ఇప్పటికే కొన్ని కథలు విన్న బన్నీ, ఏ సినిమా చేయబోయేది క్లారిటీ ఇవ్వలేదు. ముఖ్యంగా ముగ్గురు దర్శకుల పేర్లు ముందు వరసలో వినిపిస్తున్నాయి.

24 సినిమాతో సౌత్లో సూపర్ హిట్ కొట్టిన విక్రమ్ కె కుమార్, అల్లు అర్జున్ కోసం ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ను రెడీ చేశాడు. ఇప్పటికే ఈ కథ విన్న బన్నీ ఫైనల్ డెసిషన్ మాత్రం చెప్పలేదు. తమిళ దర్శకుడు లింగుసామి కూడా బన్నీతో సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఏకంగా విశాల్తో చేయాల్సిన పందెం కోడి సీక్వల్ను కూడా పక్కన పెట్టేశాడు.

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా బన్నీతో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన రామయ్య వస్తావయ్యా సినిమా తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రావాల్సి ఉంది, కానీ అప్పట్లో కుదరలేదు. ఇప్పుడు మరోసారి బన్నీకి కథ చెప్పి ఒప్పించే పనిలో ఉన్నాడు హరీష్ శంకర్. మరి ఈ ముగ్గురిలో బన్నీ సినిమా ఛాన్స్ ఎవరిని వరిస్తుందో చూడాలి.

Advertisement
 
Advertisement
 
Advertisement