'నా పూర్తి సామర్థ్యాన్ని ఇంత వరకూ చూపించలేదు' | allu arjun about future plans | Sakshi
Sakshi News home page

'నా పూర్తి సామర్థ్యాన్ని ఇంత వరకూ చూపించలేదు'

Published Fri, May 13 2016 5:20 PM | Last Updated on Mon, Sep 4 2017 12:02 AM

'నా పూర్తి సామర్థ్యాన్ని ఇంత వరకూ చూపించలేదు'

'నా పూర్తి సామర్థ్యాన్ని ఇంత వరకూ చూపించలేదు'

సరైనోడు సినిమా సక్సెస్తో ఆనందంగా ఉన్న అల్లు అర్జున్, తన భవిష్యత్ ప్రణాలికను మీడియాతో పంచుకున్నారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న స్టైలిష్ స్టార్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి తెలియజేశాడు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు తనలోని పూర్తి స్థాయి నటనను ప్రదర్శించే అవకాశమే రాలేదంటూ కామెంట్ చేశాడు బన్నీ. నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి మరెన్నో కొత్త తరహా పాత్రలు, కొత్త తరహా కథల్లో నటించాలని తెలిపాడు.

అంతేకాదు సినిమా మార్కెట్ పరంగా మరింత అభివృద్ధి చెందాలంటే మల్టీ లింగ్యువల్ సినిమాలు తెరకెక్కాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని తెలిపాడు. ప్రస్తుతం బన్నీ కూడా బైలింగ్యువల్ సినిమాల మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే మాలీవుడ్లో మంచి మార్కెట్ సొంతం చేసుకున్న స్టైలిష్ స్టార్, ప్రస్తుతం కోలీవుడ్ మీద దృష్టి పెట్టాడు. అందుకే తమిళ దర్శకులతో పనిచేయటంతో పాటు తన నెక్ట్స్ సినిమాలను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు.

బాహుబలి సినిమా తరువాత తెలుగు సినిమా మార్కెట్ చాలా పెరిగిందన్న అల్లు అర్జున్, సరైనోడు సినిమాతో తన కోరిక నేరవేరిందని ఆనందం వ్యక్తం చేశాడు. టాలీవుడ్ హైయ్యస్ట్ గ్రాసర్స్ లిస్ట్లో తన సినిమా తొలి ఐదు స్ధానాల్లో ఉండాలని కోరుకునే వాణ్ని, సరైనోడు వంద కోట్ల వసూళ్లు సాధించటంతో తన కోరిక నెరవేరిందన్నాడు. అంతేకాదు ఈ సినిమాకు నెగెటివ్ రివ్యూస్ ఇచ్చిన వారికి కూడా తన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. రివ్యూ రాసే వారు చాలా తెలివైన వారు, వారికి నచ్చే సినిమా తీయటం చాలా కష్టం అంటూ సెటైర్ వేశాడు.

ప్రస్తుతం బైలింగ్యువల్ సినిమాల మీద దృష్టి పెడుతున్న బన్నీ, తమిళ దర్శకుడు లింగుసామి డైరెక్షన్లోయాక్షన్ డ్రామా చేయడానికి ఓకె చెప్పాడు. ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్న ఈ సినిమాపై పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. తాజాగా 24 సినిమాతో సంచలనం సృష్టించిన విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో మెడికల్ థ్రిల్లర్లో నటించనున్నట్లుగా తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement