
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు. ఇంత వరుకు నెక్ట్స్ ప్రాజెక్ట్ ప్రకటించకపోయినా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉంటుందున్న టాక్ వినిపిస్తోంది.
తాజాగా బన్నీ కొత్త ఆఫీస్‌లోకి వెళ్లారట. ఇన్నాళ్లు గీతా ఆర్ట్స్ ఆఫీస్‌నే తన ఆఫీస్‌గా వినియోగించుకున్న బన్నీ తాజాగా జూబ్లీ హిల్స్‌లో కొత్త ఆఫీస్‌ను ప్రారంభించారు. ఇక మీదట తన సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ డిస్కషన్స్, ఇతర పనులు ఈ ఆఫీస్‌నుంచే చేయనున్నాడట బన్నీ. బన్నీ కొత్త సినిమాకు సంబంధించిన పనులు కూడా కొత్త ఆఫీస్ నుంచే జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment