విక్రమ్తో అల్లు అర్జున్
విక్రమ్తో అల్లు అర్జున్
Published Wed, Apr 13 2016 10:04 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఓ ఇంట్రస్టింగ్ సినిమాకు అంగీకరించాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాను కంప్లీట్ చేసిన బన్నీ.. ఆ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ సంస్థ భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు ప్రమోషన్ను కూడా అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ సినిమా తరువాత బన్నీ చేయబోయే సినిమా ఏంటి అన్న విషయంలో మాత్రం ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు ఘనవిజయం సాధించటంలో హ్యాట్రిక్ సాధించే దిశగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్ను కూడా ప్లాన్ చేస్తున్నాడు అల్లు అర్జున్.
ఇష్క్, మనం సినిమాలతో క్రేజీ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న విక్రమ్ కె కుమార్, ప్రస్తుతం సూర్య హీరోగా 24 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తరువాత విక్రమ్, బన్నీ హీరోగా ఓ సినిమా చేసే ఆలోచనలోఉన్నాడట. బన్నీ కూడా విక్రమ్తో సినిమాకు రెడీ గానే ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. తన ప్రతీ సినిమా ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కించే విక్రమ్ బన్నీతో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.
Advertisement
Advertisement