
సూర్య సరసన ప్రత్యేక పాటలో సోనాక్షి సిన్హా!
దక్షిణాదిలో బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా ఎంట్రీకి రంగం సిద్దమవుతోంది.
దక్షిణాదిలో బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా ఎంట్రీకి రంగం సిద్దమవుతోంది. లింగుస్వామి దర్శకత్వం రూపొందుతున్న చిత్రంలో తమిళ థ్రిల్లర్ లో సూర్య సరసన ఓ ప్రత్యేక పాట కోసం సోనాక్షిని ఇటీవల సంప్రదించారు. అయితే సోనాక్షి నటించేది ఐటమ్ సాంగ్ లో కాదని లింగుస్వామి స్పష్టం చేశారు.
'మా చిత్రంలో ప్రత్యేక పాటలో నటించేందుకు సోనాక్షి ఓకే చెప్పింది. ఆ పాటలో నటించేందుకు సోనాక్షి ఇష్టపడింది. అయితే అధికారికంగా డేట్స్ ఇవ్వలేదు' అని లింగుస్వామి తెలిపారు. వచ్చే నెల ముంబైలో ప్రత్యేక పాట చిత్రీకరణ ఉంటుందన్నారు. ఈ చిత్రంలో సూర్య సరసన సమంత, ఇతర పాత్రల్లో విద్యుత్ జమాల్, మనోజ్ బాజ్ పేయి, రాజ్ పాల్ యాదవ్ నటిస్తున్నారు.