బన్నీ డేట్స్ కోసం క్యూ
బన్నీ డేట్స్ కోసం క్యూ
Published Thu, Mar 3 2016 8:43 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 PM
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో సూపర్ ఫాంలో ఉన్న యంగ్ హీరో అల్లు అర్జున్. ఇప్పటికే మూడు 50 కోట్ల సినిమాలతో సత్తా చాటిన బన్నీ తెలుగుతో పాటు మళయాల ఇండస్ట్రీలో కూడా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి సినిమాలతో టాప్ ప్లేస్కి చేరువయ్యాడు. ఇప్పుడు అదే ఫాంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమా తరువాత బన్నీ చేయబోయే సినిమాపై ఇంత వరకు క్లారిటీ లేకపోయినా స్టార్ డైరెక్టర్లు బన్నీ కోసం క్యూలో ఉన్నారు. అల్లు అర్జున హీరోగా జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి రెండు భారీ హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి బన్నీతో ఓ మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. అల్లు అర్జున్, నాగార్జున కాంభినేషన్లో సినిమాను రూపొందించేందుకు కథ రెడీ చేస్తున్నాడు.
ఇష్క్, మనం సినిమాలతో ఆకట్టుకున్న విక్రమ్ కుమార్ కూడా బన్నీ హీరోగా ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. సూర్య హీరోగా నటిస్తున్న 24 చివరి దశకు రావటంతో నెక్ట్స్ బన్నీ డేట్స్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. తమిళ దర్శకుడు లింగుసామి కూడా అల్లు అర్జున్తో సినిమా చేయడానికి సీరియస్గా ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ ముగ్గురు స్టార్ డైరెక్టర్స్లో బన్నీ ఎవరికి ఛాన్స్ ఇస్తాడో చూడాలి.
Advertisement
Advertisement