బెంగాల్ లోని నదియా జిల్లాలో ఓటు వేయడాన్ని ప్రొత్సహించేందుకు ఎన్నికల సంఘం వినూత్న పద్థతిని ఎంచుకుంది. నదియాలో 67 హెక్టేర్ల విస్తీర్ణంలో బేతువాదహారి అభయారణ్యం ఉంది. అందులో మచ్చల లేడి చాలా ఫేమస్. అందుకే ఆ జిల్లాలో ఓటింగ్ ను ప్రోత్సహించేందుకు మచ్చల లేడిని ఎంచుకుంది.
ధోతీ కట్టిన మచ్చల లేడి బొమ్మ ఇప్పుడు జిల్లా అంతటా దర్శనమిస్తోంది. దానిని మృగబాబు అని పేరు పెట్టి, మృగబాబు చేత ప్రజలను ఓటేయమని అడిగే పోస్టర్లు వెలిశాయి. జిల్లాలో రెండు లోకసభ నియోజవకర్గాలున్నాయి. అవి కృష్ణ నగర్, రాణాఘాట్. ఈ రెండింటిలో దాదాపు 37 లక్షల మంది ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గాల్లో మే 12 న పోలింగ్ జరుగుతుంది.