Parle Agro Joint Managing Director Nadia Chauhan's Success Story in Telugu - Sakshi
Sakshi News home page

డైనమిక్‌ లేడీ నదియా: కిల్లర్‌ మూవ్‌తో రూ. 300కోట్ల-8వేల కోట్లకు

Published Sat, Jul 8 2023 1:39 PM | Last Updated on Sat, Jul 8 2023 4:42 PM

Meet Nadia Chauhan who took Frooti 300 CR brand to an 8000 CR brand - Sakshi

పురుషాధిక్య ప్రపంచంలోఅనేక అసమానతలతో పోరాడి, తమ తమ డొమైన్‌లలో తమకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్న అనేక మంది మహిళా పారిశ్రామికవేత్తల విజయగాథలెన్నో విన్నాం.మార్కెటింగ్, సేల్స్, ఇన్నోవేషన్స్‌తో స్టార్టప్స్‌ ద్వారా కూడా మహిళా సాధికారతకు మారుపేరుగా విజయవంతంగా దూసుకు పోతున్నారు.  అలాంటి యువ మహిళా పారిశ్రామికవేత్త డైనమిక్‌ లీడర్‌, నాలుగు దశాబ్దాల నాటి ఎఫ్‌ఎమ్‌సీజీ  కంపెనీ ముఖచిత్రాన్నే మార్చివేసిన నదియా చౌహాన్‌ గురించి తెలుసుకుందాం.

దేశంలోని టాప్‌ ఎఫ్‌ఎంసీజీ కంపెనీల్లో ఒకటైన పార్లే ఆగ్రో  చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ , జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు నదియా చౌహాన్‌. పార్లే ఆగ్రో చైర్ ప్రకాష్ చౌహాన్ కుమార్తోగా 2003లో 17 ఏళ్లకే పార్లే ఆగ్రోలో  కీలక బాధ్యతలు  చేపట్టి, వివిధ విభాగాలను పర్యవేక్షిస్తూ సంస్థ అభివృద్ధికి బాటలువేసారు. రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఆమె సొంతం. వ్యూహాత్మక దృష్టి , సమస్య పరిష్కారానికి ఎంచుకునే సృజనాత్మక విధానం ద్వారా డైనమిక్ లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు.  పార్లే ఆగ్రో  అద్భుత విజయానికి సంబంధించిన క్రెడిట్ అంతా 34 ఏళ్ల నదియాకే చెందుతుంది. ఆమె కృషి, అంకితభావం వల్ల పార్లే ఆగ్రో దేశంలోని చాలా ఎఫ్‌ఎంసీజీ కంపెనీలకు ధీటుగా ఊహించలేని స్థాయికి చేరుకుందనడంలో సందేహం లేదు.   (మెక్‌డొనాల్డ్స్‌కి టొమాటో ‘మంట’ ఏం చేస్తోందో  తెలుసా?)


నదియా కాలిఫోర్నియాలో పుట్టినా పెరిగింది మాత్రం ముంబైలోనే .హెచ్‌ఆర్‌ కాలేజీలో కామర్స్, ఇండోర్ విశ్వవిద్యాలయం నుంచి  మార్కెటింగ్‌లో  ఎంబీఏ పట్టా పొందిన నదియాకు ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కొత్త మార్గాలను అన్వేషించడం ఇష్టం. పార్లే ఆగ్రోలో  చేరడానికి ముందు, నదియా పెప్సికో ఇండియా , యురేకా ఫోర్బ్స్‌లో సీనియర్ లీడర్‌షిప్  విధుల్లో పనిచేశారు.  (40వేల కోట్లను తృణప్రాయంగా త్యజించిన బిలియనీర్‌ ఏకైక కొడుకు..ఏం చేశాడో తెలుసా?)

రూ.300 కోట్ల నుంచి రూ.8000 కోట్లకు ప్రయాణం
నదియా కంపెనీలో భాగమైనప్పుడు పార్లే ఆగ్రో ఆదాయం కేవలం రూ. 300 కోట్లు (సుమారు 43 మిలియన్లు డాలర్లు) మాత్రమే. అయితే, కొత్త ఉత్పత్తులు ,కేటగిరీల పరిచయం చేయడంతో  రూ.8000 కోట్లకు  పెరిగింది. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పానీయాల బ్రాండ్ ఫ్రూటీ. కంపెనీ టర్నోవర్‌లో  దాదాపు 90 శాతం ఫ్రూటీదే.   తరువాత ఇన్నోవేషన్‌పై దృష్టి పెట్టి  మరింత ఉత్సాహంతో 2005లోనే  PET బాటిళ్లలో, టెట్రా ప్యాకేజింగ్‌తో యాపిల్ జ్యూస్‌తో యాప్పీ ఫిజ్‌ను ప్రారంభించాలనే ఆలోచన  కీలక మలుపు. అలాగే సింగిల్‌ బ్రాండ్ ఫోకస్ నుండి మల్టీ-బ్రాండ్ ,మల్టీ-కేటగిరీ ఫోకస్‌కి తీసుకెళ్లడమే ఆమె ప్రధాన ఎజెండా. 2009 నుంచి  LMN, Appy, Grappo Fizz వంటి కొత్త పానీయాల బ్రాండ్స్‌తో పార్లే ఆగ్రో పోర్ట్‌ఫోలియో మరింత విస్తరించింది.  ఇవే కంపెనీని మరో ఎత్తుకు తీసుకెళ్లాయి. 

అప్పటి నుండి పార్లే ఆగ్రో కార్బోనేటేడ్ ఫ్రూట్ డ్రింక్ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. నాలుగు సంవత్సరాల్లో,యాపీ ఫిజ్‌ 70శాతం వృద్ధి రేటును సాధించింది. పార్లే ఆగ్రో టర్నోవర్‌ రూ.5,000 కోట్లకు చేరుకుంది. ఫ్రూట్ ఫ్లేవర్డ్ కార్బోనేటేడ్ డ్రింక్స్ (యాప్పీ ఫిజ్), కార్బోనేటేడ్ కాఫీ (కేఫ్ క్యూబా), ఫ్రూట్ ఫ్లేవర్డ్ స్టిల్ డ్రింక్స్ (ఫ్రూటీ యాప్పీ) ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్ లాంటి వాటిని అందిస్తోంది.  అలాగే నదియా 2009లో  స్నాక్స్‌ హిప్పోను ప్రారంభించాలనే వ్యూహం బాగా పనిచేసింది. కేవలం రెండేళ్లలో  కుర్‌కుర్‌, బింగో తర్వాత మార్కెట్ వాటాలో మూడవదిగా మారింది. 

 మరో కిల్లర్‌ మూవ్‌..
కంపెనీకి 95శాతం రాబడిని అందించిన "ఫ్రూటీ"పై కంపెనీ ఆధారపడటాన్ని తగ్గించి, సమయానుకూలంగా ఐకానిక్ ప్యాకేజ్డ్ వాటర్ బ్రాండ్ "బైలీస్"ని లాంచ్‌ చేసింది ఫలితం ఇది 1000 కోట్ల బ్రాండ్‌గా మారింది.  అదే సమయంలో ఫ్రూటీ ఆధిపత్యం  48 శాతానికి పడిపోయింది.  కానీ యాప్పీ ఫిజ్‌, ఫ్రూటీ టర్నోవర్‌ను రెట్టింపు చేయాలని లక్ష్యంతో దూసుకుపోతోంది. ఇండస్ట్రీ విసిరిన సవాళ్లనే ఛాలెంజ్‌గా తీసుకోవడమే ఈ విజయానికి కారణమంటారు నదియా. డెలివరీ ఒక నెలలోనే ఇంటి నుండే కార్యక్రమాలను చూడటం, మీటింగ్స్‌ను పాప నియాను తనతోపాటే తీసుకెడుతూ వ్యవహారాలను చక్కబెట్టుకున్నానని  చెప్పారు ఒక సందర్బంగా ఆమె. వృత్తిపరంగా తన తండ్రి, భర్త క్రియేటివ్ ల్యాండ్ ఆసియా వ్యవస్థాపకుడు ,చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ రాజ్ కురుప్ రోల్ మోడల్స్   తన అంటారు నదియా. 

బ్రాండ్‌ ప్రమోటింగ్‌లో దిట్ట 
బ్రాండ్‌ను మరింత ప్రమోట్ చేయడానికి సూపర్‌ స్టార్లను, సెలబ్రిటీలను  ఎంచుకుంది. బాలీవుడ్‌ అలియా భట్ ,  టాలీవుడ్‌   స్టార్‌హీరోలు జూ.ఎన్టీఆర్‌ రామ్ చరణ్ ఫంకీ  క్లోత్స్‌,  "ఫ్రూటీ ఫిజ్" బాటిళ్ల యాడ్స్‌ ఆమె క్రియేటివిటీకి అద్దం పట్టాయి. 

11 ఏళ్లకే  వ్యాపారంలో ఓనమాలు
పువ్వు  పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు  నదియాకుచిన్నప్పటినుంచి తండ్రి ద్వారా వ్యాపార లక్షణాలు అలవడ్డాయి.  స్కూల్లో చదువుకునే టైంలోను,  వేసవి సెలవుల్లో సేల్స్ టీమ్‌తో గడిపేవారట. వారి ఉత్పత్తులు ఎలా పని చేస్తున్నాయో విశ్లేషించడానికి దుకాణాలకు వెళ్లడం లాంటివి ఆమెకు తన చేసే పట్ల  విశ్వాసంతోపాటు,  పార్లే వృద్ధి ప్రణాళికకు అనుగుణంగా సాహసోపేత నిర్ణయాలను తీసుకునేలా చేసింది. ఒకసారి ప్రకటనల ఏజెన్సీతో సమావేశం కోసం టీజర్ గురించి చర్చించేందుకు నదియా తన తండ్రి కార్యాలయంలోని కాన్ఫరెన్స్ రూమ్‌లోకి వెళ్లడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పటికి ఆమెకు 11 ఏళ్లు.

అవార్డులు  
ఆమె వ్యాపార దక్షతకు అత్యంత శక్తివంతమైన మహిళలు, ఫోర్బ్స్ ఇండియాస్ టైకూన్స్ ఆఫ్ టుమారో ,  2018లో అ ఇంపాక్ట్ మ్యాగజైన్ త్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఒకరిగా  నిలిపింది. అంతేకాదు  రింకు పాల్, పూజ సింఘాల్ రాసిన “డాటర్స్ ఆఫ్ లెగసీ” పుస్తకం ఆమె స్టోరీ కూడా చోటు దక్కించుకుంది. 

ఫిట్‌నెస్ ఫ్రీక్, హార్స్‌రైడింగ్‌
నదియా విపరీతమైన రీడర్. ఫిట్‌నెస్ ఫ్రీక్, వ్యాయామం, గుర్రపు స్వారీ చేయడం చాలా ఇష్టం.ఇంకా ఎకౌస్టిక్ గిటార్ వాయించడం  కూడా ఇష్టం. మహిళా సాధికారతను జరుపుకునే ఈవెంట్‌లలో  ప్రసంగాలిస్తారు కూడా. 

సామాజిక సేవ
నదియా సామాజిక కార్యక్రమాల్లో చాలా చురుగ్గాఉంటారు.  ఆ 'పార్లే ఏక్ ప్రయాస్'దేశంలోని వెనుకబడిన పిల్లలకు విద్యా వనరులను అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలుగా  స్కాలర్‌షిప్‌లను కూడా స్పాన్సర్ చేయడం విశేషం.

ముగ్గురూ ముగ్గురే
పార్లే ఆగ్రో వ్యవస్థాపకుడు ప్రకాష్ చౌహాన్ ముగ్గురు కుమార్తెల్లో పెద్దామె నదియాతోపాటు, మిగిలిన ఇద్దరూ వ్యాపారంలో ఉన్నారు.  1998లో కంపెనీలో చేరిన రెండోకుమార్తె  2006లో సీఈవోగా ఉన్నారు షౌనా.  చిన్నకుమార్తె అలీషా CSR ను పర్యవేక్షిస్తుంది. వీరి  ఉమ్మడి లక్ష్యం పార్లే ఆగ్రో పోర్ట్‌ఫోలియోను పెంచడం. 2030 నాటికి పార్లే ఆగ్రోను రూ.20,000 కోట్ల కంపెనీగా మార్చడం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement