రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి | Two killed, 20 injured in Nadia road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

Published Fri, Mar 11 2016 2:05 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

Two killed, 20 injured in Nadia road accident

కోల్కత్తా : పశ్చిమబెంగాల్ నాడియా జిల్లాలోని గరోలియాలో శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కోల్కత్తా వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రయిలర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. క్షతగాత్రులను శాంతిపూర్, రంఘాట్ ఆసుపత్రులకు తరలించారు.

అయితే క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని... వారిని కృష్ణనగర్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ బస్సు మాల్డా నుంచి కోల్కత్తా వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించిందన్నారు. బస్సు డ్రైవర్, బస్సులోని ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement