యాషెస్ సిరీస్లో చెత్త ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ టెస్టు క్రికెట్కు వీడ్కోలు చెప్పనున్నాడు. యాషెస్ సిరీస్ తర్వాత క్లార్క్ టెస్టు ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్టు ఆస్ట్రేలియా మీడియా వెల్లడించింది. ఇంగ్లండ్లో జరుగుతున్న యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా 1-3తో ఓడిపోయింది. శనివారం ముగిసిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ సిరీస్లో నామమాత్రమైన చివరి, ఐదో టెస్టు ఆడాల్సివుంది. క్లార్క్కు ఇదే చివరి టెస్టు కావచ్చు. 2004లో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన క్లార్క్ తన కెరీర్లో 113 మ్యాచ్లు ఆడాడు. 28 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలతో 8605 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 329 (నాటౌట్).