ధోనికి మైఖేల్ క్లార్క్ ప్రత్యేక సందేశం..
సాక్షి, హైదరాబాద్: శ్రీలంకతో జరిగే నాలుగో వన్డేతో కెరీర్‌లో 300వ మ్యాచ్ ఆడబోతున్న భారత సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనికి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ప్రత్యేక సందేశాన్ని పంపించాడు. ‘ శ్రీలంకపై రెండు ఫార్మట్లలో అసాధారణ ఆటతో అదర గోట్టారు. ఎంఎస్ ధోని అగ్నిశిఖలా దూసుకుపోతున్నాడు’ అని ట్వీట్ చేశాడు.
లంకతో రెండో వన్డేలో ధోని భువీతో కలిసి 8 వికెట్‌కు అత్యధికంగా 100 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి ఓటమి అంచున ఉన్న భారత్‌ను గట్టెక్కించిన విషయం తెలిసిందే. అలాగే మూడో వన్డేలో కూడా ధోని రోహిత్ తో కలిసి భారత్‌కు 6 వికెట్ల తేడాతో విజయాన్నిందించి కష్టపరిస్థితుల్లో తన అవసరం ఏమిటో చూపించాడు. ఇక శ్రీలంకతో ప్రేమదాసు స్టేడియంలో జరిగే నాలుగో వన్డేతో ధోని 300 క్లబ్‌లో చేరనున్నాడు. అంతేకాకుండా సచిన్ టెండూల్కర్ (463), రాహుల్ ద్రవిడ్(344), మహ్మద్ అజారుద్దీన్(334), సౌరవ్ గంగూలీ(311), యువరాజ్ సింగ్(304) ల సరసన నిలవనున్నాడు.