టీమిండియాకు కెప్టెన్సీ కష్టతరమైనది: క్లార్క్
సిడ్నీ: టీమిండియాలో మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్నిభర్తీ చేయడం చాలా కష్టతరమైనదని ఆసీస్ క్రికెటర్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. టెస్ట్ క్రికెట్ నుంచి ధోనీ వైదొలగడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. శనివారం హెరాల్డ్ సన్ కు రాసిన కాలమ్ లో క్లార్క్ పై విధంగా స్పందించాడు. అంతర్జాతీయ ఆటల్లో ఉండే చాలా ఉద్యోగాలు కంటే టీమిండియాకు కెప్టెన్సీ చేయడం చాలా క్లిష్టమైనదిగా పేర్కొన్నాడు
ఒక ప్రక్క మూడు ఫార్మెట్లలో కెప్టెన్ గా ఉంటూ.. వికెట్ల వెనుక తన బాధ్యతను ధోనీ అత్యంత సమర్ధవంతంగా నిర్వర్తించాడని క్లార్క్ కొనియాడాడు.ఆ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టమని తన మనుసులో మాటను బయటపెట్టాడు. గత కొంతకాలంగా ధోనీతో తన సంబంధాలు బాగున్నాయన్నాడు. ప్రత్యేకంగా ధోనీని మోటార్ బైక్స్ గురించి అడిగి తెలుసుకోనేవాడినని క్లార్క్ తెలిపాడు.