బిస్బేన్ టెస్టునుంచి క్లార్క్ అవుట్! | Michael Clarke's future could be at risk over fitness fiasco | Sakshi
Sakshi News home page

బిస్బేన్ టెస్టునుంచి క్లార్క్ అవుట్!

Published Wed, Nov 26 2014 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM

Michael Clarke's future could be at risk over fitness fiasco

అడిలైడ్: భారత్‌తో తొలి టెస్టు మ్యాచ్ దగ్గర పడుతున్నా ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఆడేది లేనిది ఇంకా స్పష్టత రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం క్లార్క్ బ్రిస్బేన్ టెస్టుకు దూరం కావడం దాదాపు ఖాయమైందని తెలుస్తోంది. వచ్చే నెల 4నుంచి జరగనున్న ఈ మ్యాచ్‌కు ముందు క్లార్క్ కనీసం రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాలని భావించాడు.

అయితే తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగని అతను బుధవారంలోగా ఫిట్‌నెస్ నిరూపించుకునే అవకాశం లేదు. కాబట్టి బ్రిస్బేన్ టెస్టులో ఆడకపోవచ్చు. మొదటి టెస్టు కోసం జట్టులో క్లార్క్‌కు సెలక్టర్లు స్థానం కల్పించినా...ఫిట్‌నెస్ నిరూపించుకోవాలనే షరతు పెట్టారు. ‘ఇన్నేళ్ల నా కెరీర్‌లో 100 శాతం ఫిట్‌గా లేకుండా నేనెప్పుడు మైదానంలోకి దిగలేదు’ అని క్లార్క్ చెప్పడం కూడా అతని గైర్హాజరీకి సంకేతంగా కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement