ఆసీస్ టెస్ట్ కెప్టెన్ గా స్మిత్! | SMITH Smith becomes Australia's 45th Test captain | Sakshi
Sakshi News home page

ఆసీస్ టెస్ట్ కెప్టెన్ గా స్మిత్!

Published Mon, Dec 15 2014 9:56 AM | Last Updated on Sat, Sep 2 2017 6:13 PM

ఆసీస్ టెస్ట్ కెప్టెన్ గా స్మిత్!

ఆసీస్ టెస్ట్ కెప్టెన్ గా స్మిత్!

బ్రిస్బేన్:టీమిండియాతో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్ కు ఆస్ట్రేలియా కెప్టెన్ గా స్టీవ్ స్మిత్(25)  బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆస్ట్రేలియా రెగ్యులర్ టెస్ట్ కెప్టెన్ గా మైకేల్ క్లార్క్ కు గాయం మళ్లీ తిరగబెట్టడంతో స్మిత్ రెండో టెస్ట్ కు బాధ్యతలు చేపట్టనున్నాడు. ఒకవేళ టీమిండియాతో మిగతా మ్యాచ్ లకు కూడా క్లార్క్ అందుబాటులోకి రాకపోతే స్మిత్ కెప్టెన్ గా కొనసాగుతాడని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది.

 

ప్రస్తుతం ఆసీస్ టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్న స్మిత్.. అడిలైడ్ లో జరిగిన తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో 162 పరుగులు చేసి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టెస్ట్ జట్టుకు కెప్టెన్ గా నియమితులైన స్మిత్ 45వ ఆసీస్ కెప్టెన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement