India Vs Australia - BGT 2023: భారత్- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్- గవాస్కర్ ట్రోఫీకి మరో మూడు రోజుల్లో తెరలేవనుంది. ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ చారిత్రాత్మక టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించాలనే లక్ష్యంతో భారత్ సన్నద్దం అవుతుండగా.. మరోవైపు భారత్‌లో టెస్టు సిరీస్ సాధించి 19 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతోంది.
చివరసారిగా భారత గడ్డపై టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియా 2004లో సొంతం చేసుకుంది. అప్పటి నుంచి భారత్‌లో టెస్టు సిరీస్ విజయం ఆస్ట్రేలియాకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇప్పటివరకు 1969, 2004లో మాత్రమే ఆస్ట్రేలియా భారత గడ్డపై టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది.
అయితే ప్రస్తుత ఫామ్ దృష్ట్యా టెస్టుల్లో భారత్ కంటే ఆసీస్ కాస్త మెరుగ్గా ఉంది అని చెప్పుకోవాలి. ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టులో ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. వారి నుంచి భారత జట్టుకు భారీ ముప్పు పొంచి ఉంది. టీమిండియాను భయపెట్టే ఆ ఆసీస్ క్రికెటర్లపై ఓ లుక్కేద్దాం.
ఉస్మాన్ ఖవాజా
ఉస్మాన్ ఖవాజా టెస్టుల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైన ఉస్మాన్.. గతేడాది సిడ్నీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ నాలుగో టెస్టుతో మళ్లీ జట్టులోకి వచ్చాడు. అయితే పునరాగమనం చేసిన తొలి టెస్టులోనే రెండు సెంచరీలు సాధించి సత్తాచాటాడు.
అదే విధంగా ఈ ఏడాది జనవరిలో దక్షణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఖవాజా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 195 పరుగులు చేసిన ఖవాజా తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశం కోల్పోయాడు. గతేడాది పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా ఈ వెటరన్ ఓపెనర్ దుమ్మురేపాడు.
మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 65.33 సగటుతో 496 పరుగులు చేశాడు. అయితే ఖవాజా ఇప్పటివరకు భారత్‌లో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. అయినప్పటికీ స్పిన్‌ను అతడు అద్భుతంగా ఆడగలడు ఈ లెఫ్ట్‌ండర్. కాబట్టి రవి అశ్విన్, రవీంద్ర జడేజా వంటి స్టార్ స్పినర్లు ఎంతవరకు ఖవాజాను అడ్డుకుంటారో వేచి చూడాలి.
మార్నస్ లాబుషేన్
ఆస్ట్రేలియా కీలక ఆటగాళ్లలో మార్నస్ లాబుషేన్ ఒకడు. జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే తనదైన ముద్ర వేసుకున్నాడు. ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో మార్నస్ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ పరంగా రాణించాలంటే లాబుషేన్ బ్యాట్‌కు పనిచెప్పాల్సిందే. అయితే ఇప్పటివరకు లాబుషేన్ కూడా భారత్ గడ్డపై ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు.
కానీ భారత ఉపఖండంలో ఏడు టెస్టులు ఆడాడు. 7 మ్యాచ్‌ల్లో 34.64 సగటుతో 700 పరుగులు చేశాడు. ఇప్పటివరకు 33 టెస్టులు ఆడిన అతడు 59.4తో 3150 పరుగులు చేశాడు. అయితే గతంలో రెండు సార్లు టెస్టుల్లో అశ్విన్‌కు లాబుషేన్ తన వికెట్‌ను సమర్పించుకున్నాడు.ఇక తాజా సిరీస్‌లో లాబుషేన్ స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటాడో లేదో తెలియాలంటే నాగ్‌పూర్ టెస్టు వరకు వేచిచూడాలి.
స్టీవ్ స్మిత్
ప్రస్తుత ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాళ్లలో స్టీవ్ స్మిత్ ఒకడిగా ఉన్నాడు. దాదాపు 18 నెలలగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డ స్టీవ్ స్మిత్.. గతేడాది శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుత సెంచరీ సాధించి మళ్లీ తన పూర్వవైభవాన్ని పొందాడు. అనంతరం వెస్టిండీస్‌పై డబుల్ సెంచరీతో పాటు, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాతో టెస్టుల్లో పరుగులు వరద పారించాడు.
స్మిత్ ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక భారత్ పిచ్‌లపై స్మిత్‌కు మంచి రికార్డు ఉంది. అదే విధంగా స్పిన్‌కు కూడా అద్భుతంగా ఆడగలడు. కాగా భారత్‌పై టెస్టుల్లో స్మిత్‌కు ఎనిమిది సెంచరీలు ఉండడం గమానార్హం. అందులో మూడు భారత గడ్డపై సాధించినివే. అతడు టీమిండియాపై ఇప్పటివరకు 72.58 సగటుతో 1742 పరుగులు సాధించాడు. ఇక ఓవరాల్‌గా ఇప్పటివరకు 92 టెస్టులు ఆడిన స్మిత్ 8647 పరుగులు చేశాడు.
ట్రావిస్ హెడ్
ట్రావిస్ హెడ్ గత ఏడాది నుంచి రెడ్-హాట్ ఫామ్‌లో ఉన్నాడు. జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తన మెరుపు ఇన్నింగ్స్‌లతో ఓటమి అంచులనుంచి గట్టెక్కించే సత్తా హెడ్‌కు ఉంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో 96 బంతుల్లో 92 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.
స్పిన్‌కు సహాయపడే పిచ్‌ల్లో ఎదురుదాడికి దిగడం హెడ్ ప్రత్యేకత. ఒక్క ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను తారుమారు చేయగలడు. కాబట్టి ఇటువంటి విధ్వంసకర ఆటగాడితో భారత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే భారత్‌పై మాత్రం హెడ్‌కు అంత మెరుగైన రికార్డు ఏమి లేదు. భారత్‌పై ఐదు టెస్టులు ఆడిన అతడు కేవలం 119 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఓవరాల్‌గా 33 టెస్టులు ఆడిన హెడ్ 2126 పరుగులు చేశాడు.
నాథన్ లియాన్
నాథన్ లియాన్.. ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడు. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగలడు. భారత్‌పై కూడా అతడికి అద్భుతమైన రికార్డు ఉంది. గతంలో లియాన్ స్వదేశంలోనే భారత బ్యాటర్లు చుక్కలు చూపించాడు.
2017లో బెంగుళూరు వేదికగా జరిగిన రెండో టెస్టులో 50 పరుగులిచ్చి ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు. కాగా లియాన్‌కు ఇవే తన కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు కూడా. భారత్‌పై ఇప్పటివరకు 34 వికెట్లు సాధించాడు. గతంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని లియాన్ చాలా సార్లు బోల్తా కొట్టించాడు.
చదవండి: Ravindra Jadeja: అసలు మళ్లీ ఆడతానా లేదోనన్న సందేహాలు.. నాకోసం వాళ్లు చాలా కష్టపడ్డారు.. ఆదివారాలు కూడా!
IND vs AUS: భారత్ టెస్టు సిరీస్ గెలవడం కష్టమే.. శ్రీలంక దిగ్గజం సంచలన వ్యాఖ్యలు!
Comments
Please login to add a commentAdd a comment