నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆసీస్‌ను చిత్తు చేసిన టీమిండియా.. ఇప్పుడు ఢిల్లీ టెస్టులోనూ అదే ఫలితాన్ని రిపీట్ చేసింది. కేవలం రెండున్నర రోజులలోనే మ్యాచ్‌ను భారత్ ముగిసింది. భారత స్పిన్నర్ల దాటికి ఆసీస్ బ్యాటర్లు మరోసారి విలవిల్లాడారు. జడేజా, అశ్విన్ దెబ్బకు ఒక సెషన్‌లోనే ఆసీస్ 9 వికెట్లు కోల్పోవడం గమానార్హం.
జడేజా బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొవాలో తలలు పట్టుకున్న కంగారూలు.. ఆఖరికి స్వీప్, రివర్స్ స్వీప్ షాట్‌లు ఆడి తమ వికెట్లను కోల్పోయారు. ఇక తొలి రెండు టెస్టుల్లో కంగరూల ఘోర ప్రదర్శనపై ఆ జట్టు ఆ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ స్పందించాడు.
ఈ సిరీస్‌కు ముందు భారత గడ్డపై ఎటవంటి వార్మప్ మ్యాచ్‌లు ఆడకపోవడం ఆస్ట్రేలియా చేసిన అతి పెద్ద తప్పు అని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. కాగా వార్మప్ మ్యాచ్‌లకు బదులుగా పాట్ కమ్మిన్స్ బృందం బెంగళూరు సమీపంలో ఏర్పాటు చేసిన ఓ స్పెషల్ ట్రైనింగ్ క్యాంప్‌లో ప్రాక్టీస్ చేసింది.
ఆస్ట్రేలియా చేసిన తప్పులు ఇవే..
"తొలి రెండు టెస్టుల్లో మా జట్టు ప్రదర్శన చూసి నేను ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఈ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా ఒక ప్రాక్టీస్ మ్యాచ్ కూడా అడలేదు. అదే వారు చేసిన పెద్ద తప్పు. భారత పరిస్థితులకు అలవాటు పడాలంటే అక్కడ కనీసం ఒక్క వార్మప్ మ్యాచ్ అయినా ఆడాలి. కానీ మా జట్టు అది చేయలేదు. అదే విధంగా మొదటి టెస్టులో మా జట్టు ఎంపిక కూడా సరిగ్గా లేదు. అది వారు చేసిన రెండో తప్పు.
తర్వాత రెండో టెస్టులో అనవసర స్వీప్ షాట్‌లు ఆడి పెవిలియన్‌కు చేరారు. ఇక్కడ పరిస్థితులు స్వీప్ షాట్‌లు ఆడడానికి సరికావు . అది ఇన్నింగ్స్ ఆరంభంలోనే మనకు ఆర్ధమైంది. కానీ అది మా బ్యాటర్లకు ఎందుకు ఆర్ధంకాలేదో తెలియడంలేదు. కనీసం ఆఖరి రెండు టెస్టులోనైనా మా జట్టు పోటీ ఇస్తుంది అని ఆశిస్తున్నాను" అని బిగ్ స్పోర్ట్స్ బ్రేక్‌ఫాస్ట్ పోడ్‌కాస్ట్‌తో క్లార్క్ పేర్కొన్నాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ఇండోర్ వేదికగా మార్చి 1 నుంచి ప్రారంభం కానంంది.
చదవండి: ind Vs Aus: స్వదేశానికి పయనం.. అవమానించారు కాబట్టే అంటున్న గిల్‌క్రిస్ట్!!
Comments
Please login to add a commentAdd a comment