షాన్ మార్ష్‌కు చోటు
తొలి టెస్టుకు ఆసీస్ జట్టు
అడిలైడ్: కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఫిట్‌నె స్ ఇంకా సందేహంగానే ఉన్న నేపథ్యంలో భారత్‌తో జరిగే తొలి టెస్టుకు షాన్ మార్ష్‌ను ఆస్ట్రేలియా జట్టులోకి తీసుకున్నారు. ఈనెల 9 నుంచి అడిలైడ్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది. అదనపు బ్యాట్స్‌మన్‌గా మార్ష్‌ను తీసుకోవాల్సిందిగా జాతీయ సెలక్షన్ ప్యానెల్ సూచించిందని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.
ఇప్పటికే 13 మందితో కూడిన జట్టులో షాన్ సోదరుడు మిచెల్ మార్ష్ కూడా ఉన్నాడు. 2002 అక్టోబర్‌లో వా సోదరులు కలిసి చివరిసారిగా టెస్టు ఆడారు. ఆ తర్వాత జట్టులో స్థానం దక్కించుకుంది మార్ష్ సోదరులు కావడం విశేషం. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న క్లార్క్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండే విషయంలో ఇంకా స్పష్టత లేదు. గాయం నుంచి కోలుకున్నప్పటికీ హ్యూస్ మరణానంతరం అతడు చికిత్స తీసుకోలేదు. మరోవైపు హ్యూస్ అంత్యక్రియల్లో పాల్గొన్న ఆసీస్ జట్టు గురువారం అడిలైడ్‌కు చేరుకుంది.
ఆసీస్ జట్టు: క్లార్క్ (కెప్టెన్), హాడిన్, హ్యారిస్, హాజెల్‌వుడ్, జాన్సన్, లియోన్, మిచెల్ మార్ష్, షాన్ మార్ష్, రోజర్స్, సిడిల్, స్మిత్, వార్నర్, వాట్సన్.
హ్యూస్ గౌరవార్థంగా టెస్టు ఆడాలి: లీమన్
ఫిలిప్ హ్యూస్ స్మృతులు వెంటాడుతుండగానే టెస్టు మ్యాచ్ ఆడాల్సి రావడం కాస్త కష్టమేనని ఆసీస్ జట్టు కోచ్ డారెన్ లీమన్ అంగీకరించారు. అయితే అడిలైడ్ మ్యాచ్‌ను అతడి గౌరవార్థంగా భావించాలని తమ ఆటగాళ్లకు సూచించారు.