ఆటో నడిపిన మాజీ క్రికెటర్! | Michael Clarke drives auto-rickshaw in Bengaluru | Sakshi
Sakshi News home page

ఆటో నడిపిన మాజీ క్రికెటర్!

Published Thu, Mar 2 2017 1:56 PM | Last Updated on Sat, Mar 9 2019 4:29 PM

ఆటో నడిపిన మాజీ క్రికెటర్! - Sakshi

ఆటో నడిపిన మాజీ క్రికెటర్!

బెంగళూరు:ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఆటో రిక్షాను నడపడం నేర్చుకున్నాడు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న క్లార్క్ కు ఆటో నడపాలనే సరదా పుట్టిందట. ఇంకేముందే బెంగళూరులోని ఓ ఆటో వాలా దగ్గరకు వెళ్లి కొన్ని నిమిషాలు పాటు శిక్షణకు తీసుకుని మరీ డ్రైవ్ చేశాడు క్లార్క్. భారత్ -ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్లో  క్లార్క్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తొలి టెస్టు మూడు రోజుల్లోనే ముగిసిపో్వడంతో మిగతా పనులపై దృష్టి పెట్టాడు క్లార్క్. దీనిలో భాగంగానే  ఆటో రిక్షాను నేర్చుకోవడం, నడపడం చేశాడు క్లార్క్.

 

'మేము టక్ టక్ అని పిలుచుకునే ఆటో రిక్షాను భారతీయ రోడ్లపై  నడపాలనుకున్నా. అందుకు ముందుగా  కొద్ది నిమిషాలు పాటు శిక్షణ తీసుకున్నా. టక్ టక్ ను నడపడం చాలా సరదాగా ఉంది. నేను ఇక్కడే క్రికెట్ కెరీర్ ను ఆరంభించా. మళ్లీ బెంగళూరుకు వచ్చినందుకు ఆనందంగా ఉంది' అని క్లార్క్ తెలిపాడు. ఈ మేరకు ఆటో రిక్షాను నడిపిన వీడియోను క్లార్క్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement