మళ్లీ నోరు జారిన ఆసీస్ కెప్టెన్ | Sex or Success: Michael Clarke slips once again | Sakshi
Sakshi News home page

మళ్లీ నోరు జారిన ఆసీస్ కెప్టెన్

Published Wed, Jul 29 2015 11:21 AM | Last Updated on Sun, Sep 3 2017 6:24 AM

మళ్లీ నోరు జారిన ఆసీస్ కెప్టెన్

మళ్లీ నోరు జారిన ఆసీస్ కెప్టెన్

లండన్: ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ మరోసారి నోరు జారి అంతలోనే నాలుక్కరుచుకున్నాడు. 'సక్సెస్' అనే మాట బదులు 'సెక్స్' పదాన్ని ఉచ్చరించిన క్లార్క్ వెంటనే తప్పును సరిదిద్దుకుని బిగ్గరగా నవ్వేశాడు. విషయం ఏంటంటే..

ఇంగ్లండ్తో జరగనున్న యాషెస్ సిరీస్ మూడో టెస్టు ముందు క్లార్క్ మీడియాతో మాట్లాడాడు. లార్డ్స్లో జరిగే ఈ టెస్టు మ్యాచ్లో విజయం సాధించాలంటే ఆస్ట్రేలియా పుంజుకోవాలన్నది క్లార్క్ అభిప్రాయం. అయితే 'నైపుణ్యం ప్రదర్శిస్తేనే.. సెక్స్' అంటూ క్లార్క్ నోరు జారాడు. వెంటనే సక్సెక్స్ సాధించగలమని సరిచేశాడు. క్లార్క్ మాటలకు అక్కడనున్నవారందరూ కాసేపు షాక్ అయినా ముసిముసిగా నవ్వుకున్నారు. ఈ విషయం గమనించిన క్లార్క్ తనతో మరోసారి ఇబ్బంది పడ్డారంటూ వ్యాఖ్యానించాడు. ఇటీవల ప్రపంచ కప్ సందర్భంగా కూడా క్లార్క్ ఇలాగే మాట్లాడి ఆనక సరిచేసుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement