స్టీవెన్ స్మిత్(ఫైల్)
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ మొదటి టెస్టులో మైఖేల్ క్లార్క్ ఆడడం అనుమానంగా మారడంతో ఆస్ట్రేలియా జట్టుకు యువ ఆటగాడు స్టీవెన్ స్మిత్ నాయకత్వం వహించే అవకాశాలు కన్పిస్తున్నాయి. రెగ్యులర్ కెప్టెన్ క్లార్క్ ఆడకపోతే వైస్ కెప్టెన్ బ్రాడ్ హాడిన్ ఛాన్సు దక్కుతుందని భావించినప్పటికీ అనూహ్యంగా స్మిత్ పేరు తెరపైకి వచ్చింది.
క్లార్క్ వారసుడిగా స్మిత్ పనికొస్తాడో, లేదో తేల్చడానికి ఇదే సరైన సమయమని మాజీ క్రికెటర్లు అంటున్నారు. భారత్ తో జరగనున్న మొదటి టెస్టుకు క్లార్క్ దూరమైతే స్మిత్ కు జట్టు పగ్గాలు అప్పగించాలని క్రికెట్ ఆస్ట్రేలియాకు మాజీ కెప్టెన్ కిమ్ హగీస్ సూచించారు. ఆసీస్ క్రికెట్ దిగ్గజం మెక్ గ్రాత్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మొదటి టెస్టు డిసెంబర్ 4న బ్రిస్బేన్ లో ప్రారంభంకానుంది.