McGrath
-
కోహ్లిపై ఒత్తిడి పెంచండి!
మెల్బోర్న్: ఆ్రస్టేలియా గడ్డపై విరాట్ కోహ్లి ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడ ఆడిన 13 టెస్టుల్లో ఏకంగా 54.08 సగటుతో 1352 పరుగులు చేసిన కోహ్లి ఖాతాలో 6 సెంచరీలు ఉన్నాయి. కెపె్టన్‌గా 2018–19లో తొలిసారి భారత జట్టుకు ఆ్రస్టేలియా గడ్డపై సిరీస్ అందించిన ఘనత అతని సొంతం. అందుకే ఇటీవల కోహ్లి గొప్ప ఫామ్‌లో లేకపోయినా...ఆసీస్ దృష్టిలో అతనే ప్రధాన బ్యాటర్. కోహ్లిని నిలువరిస్తే భారత్‌ను అడ్డుకున్నట్లే అని అక్కడి మాజీ ఆటగాళ్లకూ తెలుసు. అందుకే కోహ్లిపై ఒత్తిడి పెంచాలని, అతడి భావోద్వేగాలతో ఆడుకోవాలని దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ తమ బౌలర్లకు చెబుతున్నాడు. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో చిత్తయిన విషయం వారి మనసుల్లో ఇంకా ఉంటుందని...దానిని కొనసాగించాలని అతను అన్నాడు. ‘ఒక జట్టు సొంతగడ్డపై 0–3తో ఓడి వస్తుందంటే కచ్చితంగా మనమే పైచేయి సాధించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి భారత్‌పై ఒత్తిడి కొనసాగించాలి. వారు సిద్ధంగా ఉన్నారో లేదో తెలుస్తుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లిపై కూడా ఇదే పద్ధతిని అనుసరించాలి’ అని మెక్‌గ్రాత్ చెప్పాడు. అయితే కొన్ని సార్లు ఇలా రెచ్చగొడితే కోహ్లి మరింత దూకుడుగా చెలరేగిపోయే ప్రమాదం కూడా ఉంటుందని ఆసీస్ మాజీ పేసర్ చిన్న హెచ్చరిక కూడా జారీ చేశాడు. ‘కోహ్లిని లక్ష్యంగా చేసుకొని ఆ్రస్టేలియా బౌలర్లు పదేపదే తలపడితే అతనూ సిద్ధమైపోతాడు. అది అతడి అత్యుత్తమ ఆటను కూడా బయటకు తీయవచ్చు. సిరీస్ ఆరంభంలోనే తక్కువ స్కోర్లకు కట్టడి చేయగలిగితే కోహ్లి కూడా కోలుకోవడం కష్టమవుతుంది. నా దృష్టిలో కోహ్లితో భావోద్వేగాలపాలు ఎక్కువ. బాగా ఆడటం మొదలు పెడితే అస్సలు ఆగిపోడు. ఒక వేళ విఫలమైతే మాత్రం అదే కొనసాగుతుంది’ అని మెక్‌గ్రాత్ అభిప్రాయ పడ్డాడు. -
అదరగొట్టిన ఆసీస్ బ్యాటర్.. టీ20ల్లో వరల్డ్ నెం.1 ర్యాంక్
భారత మహిళలతో టీ20 సిరీస్‌లో అదరగొడుతున్న ఆస్ట్రేలియా బ్యాటర్ తహీలా మెక్‌గ్రాత్.. ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. ముంబై వేదికగా జరిగిన తొలి రెండు టీ20ల్లో మెక్‌గ్రాత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. రెండు మ్యాచ్‌లు కలిపి మెక్‌గ్రాత్ 110 పరుగులు సాధించింది. ఈ క్రమంలో తన సహచర క్రికెటర్లు , బెత్ మూనీ, మెగ్ లానింగ్, భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానలను అధిగమించి మెక్‌గ్రాత్ టాప్ ర్యాంక్‌కు చేరుకుంది. కాగా ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు తొలి స్థానంలో మూనీ కొనసాగింది. ఇక ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో నెం1 ర్యాంక్ సాధించిన 12 ఆస్ట్రేలియా బ్యాటర్‌గా మెక్‌గ్రాత్ నిలిచింది.మెక్‌గ్రాత్ తన కెరీర్లో కేవలం 16 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడి నెం1 ర్యాంక్‌ను తన ఖతాలో వేసుకుంది. కాగా ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్ టాప్-10లో భారత నుంచి ముగ్గురు బ్యాటర్లు ఉన్నారు. మూడో స్థానంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, ఆరు, తొమ్మిది ర్యాంక్‌లలో షషాలీ వర్మ, రోడ్రిగ్స్ కొనసాగుతున్నారు. చదవండి: IND vs BAN 1st Test: కోహ్లి, పంత్ 125 పరుగులు చేస్తారు! వారిద్దరూ 20 వికెట్లు తీస్తారు.. -
‘కోహ్లికి ఇబ్బందులు తప్పవు’
చెన్నై: ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇబ్బందులు తప్పవని ఆసీస్ దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ అభిప్రాయపడ్డాడు. పరుగుల యంత్రం కోహ్లి విశేష అనుభవం ఉన్న ఆటగాడైనప్పటికీ ఇంగ్లండ్ గడ్డపై అండర్సన్ నుంచి ముప్పు పొంచి వుందన్నాడు. ప్రస్తుతం సొంత గడ్డపై సత్తాచాటుతున్న అండర్సన్.. కోహ్లిపై పైచేయి సాధించడం ఖాయమని జోస్యం చెప్పాడు. ‘విరాట్ కోహ్లి అనుభవం ఉన్న ఆటగాడు. నాణ్యమైన ఆటగాడు కూడా. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ అక్కడ పరిస్థితులు మనకు అనుగుణంగా ఉండవు. ఆ జట్టు బౌలర్ అండర్సన్ ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తున్నాడు. అండర్సన్ బౌలింగ్‌ను ఎదుర్కొనే క్రమంలో కోహ్లి తడబడతాడనే అనుకుంటున్నా. చూద్దాం. ఏం జరుగుతుందో. ఇంగ్లిష్ పర్యటనలో జట్టంతా ఏ ఒక్క ఆటగాడిపైనో ఆధారపడటం సరికాదు. ఒకవేళ ఏదైనా మ్యాచ్‌లో అతడు ఫెయిలైనా మిగిలిన వారు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలి. భారత జట్టులో చతేశ్వర పుజారా కీలక ఆటగాడు. మరి ఈ పర్యటనలో ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. భారత బౌలర్లు భువనేశ్వర్, బుమ్రా చాలా బాగా బౌలింగ్ వేస్తున్నారు. వీరిద్దరూ ఇంగ్లండ్ పర్యటనలో విజయవంతం అవుతారనే అనుకుంటున్నా’ అని మెక్‌గ్రాత్ పేర్కొన్నాడు. -
ఉమెశ్ను ప్రశంసించిన దిగ్గజ క్రికెటర్
ముంబై: అంతర్జాతీయ క్రికెట్లో ఒత్తిడిని అధిగమించి రాణిస్తున్న భారత పేసర్ ఉమేశ్ యాదవ్‌ను ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ గ్లేన్ మెక్‌గ్రాత్ ప్రశంసించాడు. ముంబైలో ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువఆటగాళ్లకు రెండు రోజుల పాటు బౌలింగ్ శిక్షణ శిభిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ డైరెక్టర్‌గా మెక్ గ్రాత్ మీడియాతో మాట్లాడారు. ఉమేశ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని, ప్రతిమ్యాచ్‌కు అతని బౌలింగ్ మెరుగవుతుందని, అనుభవం గల బౌలర్‌గా మ్యాచ్‌కు ముందు ఎలా సిద్దమవ్వాలో అతనికి తెలుసుని మెక్ గ్రాత్ కొనియాడాడు. ఎంత కాలం బౌలింగ్ చేస్తామన్నది ముఖ్యం కాదని, ఎలా రాణించమన్నదే ముఖ్యం అని యువఆటగాళ్లకు సూచించాడు. పెస్ బౌలర్లకు గాయాల బెడద ఉంటుందని దానిని తట్టుకొని నిలబడడమే పెద్ద చాలెంజ్ అని మెక్ గ్రాత్ అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో ఉమేశ్‌ను మెచ్చుకొవచ్చని ఫిట్నెస్ కోల్పోకుండా కష్టపడుతున్నాడని ఈ దిగ్గజ బౌలర్ చెప్పుకొచ్చాడు. గాయాలకు దూరంగా ఉండాలంటే ఫిట్నెస్ అవసరమని యువ క్రికెటర్లకు సూచించాడు. ప్రతి ఒక్కరు వేగంగా బౌలింగ్ చేయాలనుకుంటారు..కానీ వైవిధ్యంగా బౌలింగ్ చేయడం కొంత మందికే తెలుస్తుందని.. అది శిక్షణలో రాదని అది ఎవరికి వారు తెచ్చుకోవాల్సిందేనని తెలిపాడు. 1970 నుంచి బేసిక్ బౌలింగ్‌లో ఎలాంటి మార్పు జరగలేదని మెక్ గ్రాత్ అభిప్రాయపడ్డాడు. -
నేను చూసిన గ్రేటెస్ట్ బౌలర్ అతనే: ద్రవిడ్
ముంబై:తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో అత్యంత కఠినమైన బౌలర్ ఎవరైనా ఉన్నారంటే అది ఒక గ్లెన్ మెక్ గ్రాత్ అని భారత దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. అతను కేవలం ఆస్ట్రేలియన్ గ్రేటెస్ట్ బౌలరే కాదు.. గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలర్ అంటూ ద వాల్ కొనియాడాడు. ఆస్ట్రేలియాతో తాను ఆడిన మ్యాచ్‌ల్లో సెంచరీలు నమోదు చేసినా, మెక్ గ్రాత్‌ను ఎదుర్కోవడం కత్తిమీద సాములా ఉండేదన్నాడు. 'నా క్రికెట్ జనరేషనల్‌లో ఆస్ట్రేలియా అత్యుత్తమ క్రికెట్ జట్టు. అప్పటి జట్టు చాలా బలంగా ఉండేది. ఆ సమయంలోనే ఒక గ్రేటెస్ట్ బౌలర్ నాకు తారస పడ్డాడు. అతనే మెక్ గ్రాత్. అతనొక ఆస్ట్రేలియా గ్రేటెస్ట్ బౌలరే కాదు.. నేను ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలర్' అని ద్రవిడ్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో మెక్ గ్రాత్ అసాధారణ నైపుణ్యమున్న బౌలర్ అని ద్రవిడ్ ప్రశంసించాడు. ఏ బౌలర్ కూడా తనకు ఆఫ్ స్టంప్ బంతులను వేసే సాహసం చేయకపోయినా, మెక్ గ్రాత్ మాత్రం ఆఫ్ స్టంప్ బంతులు వేసి బోల్తా కొట్టించేవాడని ద్రవిడ్ గుర్తు చేసుకున్నాడు. అతని చేతికి బంతి ఇచ్చిన మరుక్షణం ఎటువంటి నిర్దయ లేకుండా ప్రత్యర్థి ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టించేవాడన్నాడు. అది ఉదయం పూట కానీ, సాయంత్ర వేళ కానీ మెక్ గ్రాత్ రిథమ్‌లో ఎటువంటి తేడా ఉండేది కాదని ఆనాటి జ్ఞాపకాలను ద్రవిడ్ నెమరువేసుకున్నాడు. -
అతనికి కెప్టెన్సీ చేయడం చాలా కష్టం:పాంటింగ్
పెర్త్:ఆస్ట్రేలియా క్రికెట్లో రికీ పాంటింగ్, మెక్ గ్రాత్ల హవా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు ఆస్ట్రేలియా జట్టుకు అనేక చిరస్మరణీయమైన విజయాలను అందించారు. అదే క్రమంలో టెస్టుల్లో ఆస్ట్రేలియా తరపున పాంటింగ్(13,378) అత్యధిక పరుగులను నమోదు చేస్తే.. మెక్ గ్రాత్(563) అత్యధిక టెస్టు వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్‌గా ఘనత సాధించాడు. మరోవైపు రెండు వరుస వన్డే వరల్డ్ కప్‌లు పాంటింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా సాధిస్తే, వరుస మూడు వరల్డ్ కప్‌లను సాధించిన జట్టులో మెక్ గ్రాత్ సభ్యుడిగా ఉన్నాడు. అయితే మెక్ గ్రాత్‌కు కెప్టెన్సీ చేయడం చాలా కష్టమని అంటున్నాడు రికీ పాంటింగ్. ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికాల తొలి టెస్టు ఆరంభంలో భాగంగా రికీ పలు విషయాలను వెల్లడించాడు. మీ కెప్టెన్సీలో మీరు చూసిన అత్యంత కఠినమైన ఆటగాడు ఎవరు?అన్న దానికి రికీ తనదైన శైలిలో స్పందించాడు. 'మెక్ గ్రాత్‌కు కెప్టెన్సీ చేయడం చాలా కష్టంగా అనిపించేది. ప్రతీ ఒక్కరూ మెక్ గ్రాత్ ను నడిపించడం చాలా సులువని అనుకుంటారు. అది కొంతవరకూ నిజమే. అతనికి బంతినిచ్చిన మరుక్షణంలో మెక్ గ్రాత్ తన పని సమర్ధవంతంగా నిర్వర్తించేవాడు. అంతవరకూ ఓకే. కాకపోతే కొన్ని సందర్భాల్లో మెక్ గ్రాత్ కు బంతి ఇవ్వన్నప్పుడు కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యేవి. బంతి ఇవ్వడానికి వేరే క్రికెటర్ ని పిలిచినా, అతన్నే పిలుస్తున్నట్లు భావించేవాడు. అతన్ని ప్రత్యేకంగా సముదాయించాల్సి వచ్చింది. మిత్రమా.. పది నుంచి పది హేను నిమిషాలు విశ్రాంతి తీసుకో అని చెప్పాల్సివచ్చిది. నా నాయకత్వంలో అతనే నాకు ఎదురైన అత్యంత కఠినమైన ఆటగాడు' అని పాంటింగ్ సరదాగా తన పాత జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నాడు. -
టీ20లపై బౌలింగ్ దిగ్గజం ఆందోళన
తక్కువ సమయంలో ఎక్కువ మొత్తాల్లో డబ్బులు ఆటగాళ్లకు అందడంతో యువ క్రికెటర్లకు ఆటపై ఆసక్తి తగ్గిపోతుందని ఆస్ట్రేలియా మాజీ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ అభిప్రాయపడ్డాడు. ఇక్కడి పీసీఏ స్టేడియంతో ట్రైనింగ్ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. పొట్టి ఫార్మాట్ క్రికెట్, టీ20 లాంటి లీగ్ ల వల్ల ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు దెబ్బతింటున్నారని పేర్కొన్నాడు. ఇది ఒక్క భారత్‌కు మాత్రమే పరిమితమైన సమస్య కాదని, ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆడే అన్ని దేశాలలో ఇలాంటి ధోరణి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తంచేశాడు. టెస్టు క్రికెట్ అయితే పేస్ బౌలర్లకు స్వర్గధామమని, తమ సత్తా నిరూపించుకునేందుకు పొట్టి ఫార్మాట్లో ఇలాంటి చాన్స్ ఉండదన్నాడు. ఒకసారి అవకాశం వచ్చిన తర్వాత లీగ్స్ ఆడి తక్కువ సమయంలో ఎక్కువ ఆర్జిస్తున్నందున మరింత రాటుదేలేందుకు బౌలర్లు కృషి చేయడం లేదన్న అంశాన్ని గుర్తించినట్లు చెప్పారు. మంచి క్రికెట్ ఆడి దేశానికి మరింత గౌరవం తీసుకురావాలని యువ క్రికెటర్లకు పిలుపునిచ్చాడు. 'భారత్ త్వరలో నిర్వహించబోయే దులీప్ ట్రోఫీలో పింక్ బాల్ వాడకం మంచి పరిణామమే. ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లలో ఫ్లడ్ లైట్స్ వెలుగులలో పింక్ బాల్ వాడకం విజయమంతమైంది' అని మెక్ గ్రాత్ వివరించాడు. -
ఆ ఇద్దరికి భయపడేవాణ్ని: ద్రవిడ్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ లో మిస్టర్ డిపెండబుల్ గా పేరు గాంచిన రాహుల్ ద్రవిడ్ ప్రధానంగా ఇద్దరు బౌలర్లు అంటే భయపడేవాడట. తన 16 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో ఆసీస్ మాజీ దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ బౌలింగ్ అత్యంత క్లిష్టంగా ఉండేదని ద్రవిడ్ తాజాగా స్పష్టం చేశాడు. ప్రత్యేకంగా మెక్ గ్రాత్ ఆఫ్ స్టంప్ వేసే బంతుల్ని అంచనా వేయడం చాలా కఠినంగా ఉండేదన్నాడు. తనకు ఎదురైన ఫాస్ట్ బౌలర్లలో అతనే అత్యంత ప్రమాదకారి బౌలర్ గా ద్రవిడ్ పేర్కొన్నాడు. అయితే స్పిన్ బౌలర్ల విషయానికొస్తే శ్రీలంక మాజీ ఆటగాడు ముత్తయ్య మురళీ ధరన్ బౌలింగ్ చాలా బిగుతుగా ఉండేదన్నాడు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ లో అభిమానులతో ముచ్చటించిన ద్రవిడ్ తన క్రికెట్ కెరీర్ కు సంబంధించి పలు విషయాలను పంచుకున్నాడు. 'మెక్ గ్రాత్ నిజంగా ఒక గొప్ప బౌలర్. నేను ఎదుర్కొన్న ఫాస్ట్ బౌలర్లలో అతను అత్యంత క్లిష్టమైన బౌలర్. మెక్ గ్రాత్ ఆఫ్ స్టంప్ అవతల వేసే బంతులు ఎలా వస్తున్నాయో తెలిసేది కాదు. అతను తొలి ఓవర్ మొదలుకొని ఎప్పుడూ బౌలింగ్ వేసినా ఒకేరకమైన దూకుడు ఉండేది. స్లో బౌలర్లలో మురళీ ధరన్ బౌలింగ్ ను అర్ధం చేసుకోవడం చాలా కష్టం. అతను వేసే దూస్రాలను ఆడటం ఒక సవాల్. మురళీ రెండు వైపుల బంతిని బాగా స్పిన్ చేసే వాడు. గింగిరాలు తిరుగుతూ వచ్చే అతని బంతులు అఅంచనా వేయడం నాకు కత్తిమీద సాము మాదిరిగా ఉండేది. ఎప్పుడూ నిలకడగా బౌలింగ్ చేసే మురళీని ఎదుర్కొవడానికి చాలా శ్రమించేవాడిని' అని ది వాల్ ద్రవిడ్ తెలిపాడు. -
స్టీవెన్ స్మిత్ కు ఆస్టేలియా క్రికెట్ పగ్గాలు?
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ మొదటి టెస్టులో మైఖేల్ క్లార్క్ ఆడడం అనుమానంగా మారడంతో ఆస్ట్రేలియా జట్టుకు యువ ఆటగాడు స్టీవెన్ స్మిత్ నాయకత్వం వహించే అవకాశాలు కన్పిస్తున్నాయి. రెగ్యులర్ కెప్టెన్ క్లార్క్ ఆడకపోతే వైస్ కెప్టెన్ బ్రాడ్ హాడిన్ ఛాన్సు దక్కుతుందని భావించినప్పటికీ అనూహ్యంగా స్మిత్ పేరు తెరపైకి వచ్చింది. క్లార్క్ వారసుడిగా స్మిత్ పనికొస్తాడో, లేదో తేల్చడానికి ఇదే సరైన సమయమని మాజీ క్రికెటర్లు అంటున్నారు. భారత్ తో జరగనున్న మొదటి టెస్టుకు క్లార్క్ దూరమైతే స్మిత్ కు జట్టు పగ్గాలు అప్పగించాలని క్రికెట్ ఆస్ట్రేలియాకు మాజీ కెప్టెన్ కిమ్ హగీస్ సూచించారు. ఆసీస్ క్రికెట్ దిగ్గజం మెక్ గ్రాత్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మొదటి టెస్టు డిసెంబర్ 4న బ్రిస్బేన్ లో ప్రారంభంకానుంది. -
ఆస్ట్రేలియాలో భారత్ కు గడ్డుకాలమే: మెక్ గ్రాత్
న్యూఢిల్లీ: భారత జట్టుకు ఆస్ట్రేలియా పర్యటన కఠిన పరీక్షేనని ఫాస్ట్ బౌలర్, మాజీ క్రికెటర్ మెక్ గ్రాత్ అన్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో దారుణ ఓటమి తర్వాత..ఈ సంవత్సరాంతంలో ఆస్ట్రేలియాలో భారత జట్టు గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని మెక్ గ్రాత్ జోస్యం చెప్పారు. క్యాచ్ లు వదిలేయడం ద్వారా భారత్ పై విపరీతమైన ఒత్తిడి పెరిగిందన్నారు. గతంలో ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు 0-4 తేడాతో ఓటమి పాలైన సంగతిని ఆయన గుర్తు చేశారు. గత యాషెస్ సిరీస్ లో భారత్ ను ఓడించిన ఇంగ్లాండ్ ను 5-0 తేడాతో ఆస్ట్రేలియా ఓడించిందని మెక్ గ్రాత్ అన్నారు. ఆస్ట్రేలియాను ఎదుర్కొనేందుకు భారత జట్టు చెమటోడ్చాల్సిందేనని మెక్ గ్రాత్ తెలిపారు.