ఉమెశ్‌ను ప్రశంసించిన దిగ్గజ క్రికెటర్
ఉమెశ్‌ను ప్రశంసించిన దిగ్గజ క్రికెటర్
Published Wed, Jul 26 2017 11:39 AM | Last Updated on Tue, Sep 5 2017 4:56 PM
ముంబై: అంతర్జాతీయ క్రికెట్‌లో ఒత్తిడిని అధిగమించి రాణిస్తున్న భారత పేసర్ ఉమేశ్ యాదవ్‌ను ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ గ్లేన్ మెక్‌గ్రాత్ ప్రశంసించాడు. ముంబైలో ఎంఆర్‌ఎఫ్ పేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువఆటగాళ్లకు రెండు రోజుల పాటు బౌలింగ్ శిక్షణ శిభిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ డైరెక్టర్‌గా మెక్ గ్రాత్ మీడియాతో మాట్లాడారు.
ఉమేశ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని, ప్రతిమ్యాచ్‌కు అతని బౌలింగ్ మెరుగవుతుందని, అనుభవం గల బౌలర్‌గా మ్యాచ్‌కు ముందు ఎలా సిద్దమవ్వాలో అతనికి తెలుసుని మెక్ గ్రాత్ కొనియాడాడు. ఎంత కాలం బౌలింగ్ చేస్తామన్నది ముఖ్యం కాదని, ఎలా రాణించమన్నదే ముఖ్యం అని యువఆటగాళ్లకు సూచించాడు. పెస్ బౌలర్లకు గాయాల బెడద ఉంటుందని దానిని తట్టుకొని నిలబడడమే పెద్ద చాలెంజ్ అని మెక్ గ్రాత్ అభిప్రాయపడ్డాడు.
ఈ విషయంలో ఉమేశ్‌ను మెచ్చుకొవచ్చని ఫిట్‌నెస్ కోల్పోకుండా కష్టపడుతున్నాడని ఈ దిగ్గజ బౌలర్ చెప్పుకొచ్చాడు. గాయాలకు దూరంగా ఉండాలంటే ఫిట్‌నెస్ అవసరమని యువ క్రికెటర్లకు సూచించాడు. ప్రతి ఒక్కరు వేగంగా బౌలింగ్ చేయాలనుకుంటారు..కానీ వైవిధ్యంగా బౌలింగ్ చేయడం కొంత మందికే తెలుస్తుందని.. అది శిక్షణలో రాదని అది ఎవరికి వారు తెచ్చుకోవాల్సిందేనని తెలిపాడు. 1970 నుంచి బేసిక్ బౌలింగ్‌లో ఎలాంటి మార్పు జరగలేదని మెక్ గ్రాత్ అభిప్రాయపడ్డాడు.
Advertisement