MRF foundation
-
McGrath: ఆ ఇద్దరు టీమిండియాకు ఆడుతుంటే గర్వంగా ఉంది..!
ఆసీస్ పేస్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ టీమిండియా యువ పేసర్లు ప్రసిధ్ కృష్ణ, అవేశ్ ఖాన్‌లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఇద్దరు టీమిండియాకు ఆడుతుంటే గర్వంగా ఉందని అన్నాడు. ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ చీఫ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి పదేళ్లు పూర్తైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. ప్రసిధ్ కృష్ణ, అవేశ్ ఖాన్లు చెన్నైలోని ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్‌లో శిక్షణ తీసుకున్న నేపథ్యంలో మెక్‌గ్రాత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరితో పాటు మరో 27 మంది ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్‌లో మెళకువలు నేర్చుకున్న బౌలర్లు ఇటీవల ముగిసిన ఐపీఎల్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ఇదే సందర్భంగా వన్డే క్రికెట్ మనుగడపై ప్రస్తుతం నడుస్తున్న చర్చపై కూడా మెక్‌గ్రాత్ స్పందించాడు. బ్యాటర్లు పరుగులు చేస్తున్నంత కాలం వన్డే ఫార్మాట్‌కు ఢోకా లేదని అభిప్రాయపడ్డాడు. డబ్బు, శారీరక ఒత్తిడి కారణంగా ఆటగాళ్లు వన్డేలపై అనాసక్తి ప్రదర్శిస్తున్నారని అనుకోవట్లేదని అన్నాడు. తన మట్టుకు సంప్రదాయ టెస్ట్ క్రికెటే అత్యుత్తమమని చెప్పుకొచ్చాడు. టెస్ట్‌ల తర్వాత ఆటగాళ్ల సత్తా బయటపడేది వన్డే క్రికెట్లోనేనని తెలిపాడు. సుదీర్ఘ ఫార్మాట్లోనే ఆటగాళ్లకు సరైన పరీక్ష ఎదురవుతుందని అన్నాడు. చదవండి: ఆసియా కప్ షెడ్యూల్ విడుదల.. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే..? -
ఉమెశ్ను ప్రశంసించిన దిగ్గజ క్రికెటర్
ముంబై: అంతర్జాతీయ క్రికెట్లో ఒత్తిడిని అధిగమించి రాణిస్తున్న భారత పేసర్ ఉమేశ్ యాదవ్‌ను ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ గ్లేన్ మెక్‌గ్రాత్ ప్రశంసించాడు. ముంబైలో ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువఆటగాళ్లకు రెండు రోజుల పాటు బౌలింగ్ శిక్షణ శిభిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ డైరెక్టర్‌గా మెక్ గ్రాత్ మీడియాతో మాట్లాడారు. ఉమేశ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని, ప్రతిమ్యాచ్‌కు అతని బౌలింగ్ మెరుగవుతుందని, అనుభవం గల బౌలర్‌గా మ్యాచ్‌కు ముందు ఎలా సిద్దమవ్వాలో అతనికి తెలుసుని మెక్ గ్రాత్ కొనియాడాడు. ఎంత కాలం బౌలింగ్ చేస్తామన్నది ముఖ్యం కాదని, ఎలా రాణించమన్నదే ముఖ్యం అని యువఆటగాళ్లకు సూచించాడు. పెస్ బౌలర్లకు గాయాల బెడద ఉంటుందని దానిని తట్టుకొని నిలబడడమే పెద్ద చాలెంజ్ అని మెక్ గ్రాత్ అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో ఉమేశ్‌ను మెచ్చుకొవచ్చని ఫిట్నెస్ కోల్పోకుండా కష్టపడుతున్నాడని ఈ దిగ్గజ బౌలర్ చెప్పుకొచ్చాడు. గాయాలకు దూరంగా ఉండాలంటే ఫిట్నెస్ అవసరమని యువ క్రికెటర్లకు సూచించాడు. ప్రతి ఒక్కరు వేగంగా బౌలింగ్ చేయాలనుకుంటారు..కానీ వైవిధ్యంగా బౌలింగ్ చేయడం కొంత మందికే తెలుస్తుందని.. అది శిక్షణలో రాదని అది ఎవరికి వారు తెచ్చుకోవాల్సిందేనని తెలిపాడు. 1970 నుంచి బేసిక్ బౌలింగ్‌లో ఎలాంటి మార్పు జరగలేదని మెక్ గ్రాత్ అభిప్రాయపడ్డాడు.