ఆసీస్ బౌలర్లకు మెక్‌గ్రాత్ సూచన
మెల్‌బోర్న్: ఆ్రస్టేలియా గడ్డపై విరాట్ కోహ్లి ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడ ఆడిన 13 టెస్టుల్లో ఏకంగా 54.08 సగటుతో 1352 పరుగులు చేసిన కోహ్లి ఖాతాలో 6 సెంచరీలు ఉన్నాయి. కెపె్టన్‌గా 2018–19లో తొలిసారి భారత జట్టుకు ఆ్రస్టేలియా గడ్డపై సిరీస్ అందించిన ఘనత అతని సొంతం. అందుకే ఇటీవల కోహ్లి గొప్ప ఫామ్‌లో లేకపోయినా...ఆసీస్ దృష్టిలో అతనే ప్రధాన బ్యాటర్. కోహ్లిని నిలువరిస్తే భారత్‌ను అడ్డుకున్నట్లే అని అక్కడి మాజీ ఆటగాళ్లకూ తెలుసు. అందుకే కోహ్లిపై ఒత్తిడి పెంచాలని, అతడి భావోద్వేగాలతో ఆడుకోవాలని దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ తమ బౌలర్లకు చెబుతున్నాడు.
ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో చిత్తయిన విషయం వారి మనసుల్లో ఇంకా ఉంటుందని...దానిని కొనసాగించాలని అతను అన్నాడు. ‘ఒక జట్టు సొంతగడ్డపై 0–3తో ఓడి వస్తుందంటే కచ్చితంగా మనమే పైచేయి సాధించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి భారత్‌పై ఒత్తిడి కొనసాగించాలి. వారు సిద్ధంగా ఉన్నారో లేదో తెలుస్తుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లిపై కూడా ఇదే పద్ధతిని అనుసరించాలి’ అని మెక్‌గ్రాత్ చెప్పాడు.
అయితే కొన్ని సార్లు ఇలా రెచ్చగొడితే కోహ్లి మరింత దూకుడుగా చెలరేగిపోయే ప్రమాదం కూడా ఉంటుందని ఆసీస్ మాజీ పేసర్ చిన్న హెచ్చరిక కూడా జారీ చేశాడు. ‘కోహ్లిని లక్ష్యంగా చేసుకొని ఆ్రస్టేలియా బౌలర్లు పదేపదే తలపడితే అతనూ సిద్ధమైపోతాడు. అది అతడి అత్యుత్తమ ఆటను కూడా బయటకు తీయవచ్చు. సిరీస్ ఆరంభంలోనే తక్కువ స్కోర్లకు కట్టడి చేయగలిగితే కోహ్లి కూడా కోలుకోవడం కష్టమవుతుంది. నా దృష్టిలో కోహ్లితో భావోద్వేగాలపాలు ఎక్కువ. బాగా ఆడటం మొదలు పెడితే అస్సలు ఆగిపోడు. ఒక వేళ విఫలమైతే మాత్రం అదే కొనసాగుతుంది’ అని మెక్‌గ్రాత్ అభిప్రాయ పడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment