ICC Women's T20I Rankings: Tahlia McGrath becomes No.1 Player - Sakshi
Sakshi News home page

ICC T20 Rankings: అదరగొట్టిన ఆసీస్‌ బ్యాటర్‌.. టీ20ల్లో వరల్డ్‌ నెం.1 ర్యాంక్‌

Published Tue, Dec 13 2022 4:28 PM | Last Updated on Tue, Dec 13 2022 5:25 PM

Tahlia McGrath becomes No.1 in Womens T20I Player Rankings - Sakshi

భారత మహిళలతో టీ20 సిరీస్‌లో అదరగొడుతున్న ఆస్ట్రేలియా బ్యాటర్‌ తహీలా మెక్‌గ్రాత్‌.. ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. ముంబై వేదికగా జరిగిన తొలి రెండు టీ20ల్లో మెక్‌గ్రాత్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. రెండు మ్యాచ్‌లు కలిపి మెక్‌గ్రాత్‌ 110 పరుగులు సాధించింది.

ఈ క్రమంలో తన సహచర క్రికెటర్లు , బెత్‌ మూనీ, మెగ్‌ లానింగ్‌, భారత స్టార్‌ ఓపెనర్‌  స్మృతి మంధానలను అధిగమించి మెక్‌గ్రాత్‌ టాప్‌ ర్యాంక్‌కు చేరుకుంది. కాగా ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు తొలి స్థానంలో మూనీ కొనసాగింది.

ఇక ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో నెం1 ర్యాంక్‌ సాధించిన 12 ఆస్ట్రేలియా బ్యాటర్‌గా మెక్‌గ్రాత్‌ నిలిచింది.మెక్‌గ్రాత్‌ తన కెరీర్‌లో కేవలం 16 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడి నెం1 ర్యాంక్‌ను తన ఖతాలో వేసుకుంది. కాగా ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌ టాప్‌-10లో భారత నుంచి ముగ్గురు బ్యాటర్లు ఉన్నారు. మూడో స్థానంలో భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన, ఆరు, తొమ్మిది ర్యాంక్‌లలో షషాలీ వర్మ, రోడ్రిగ్స్‌ కొనసాగుతున్నారు.
చదవండి: IND vs BAN 1st Test: కోహ్లి, పంత్‌ 125 పరుగులు చేస్తారు! వారిద్దరూ 20 వికెట్లు తీస్తారు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement