అడిలైడ్: పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజమ్‌పై ఆస్ట్రేలియా మాజీ సారథి మైకేల్ క్లార్క్ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రపంచకప్‌లో పాక్‌కు అతడే కీలకమవుతాడని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. మంచి క్లాసిక్ ప్లేయర్ అని కొనియాడిన క్లార్క్.. అతడు పాక్ కోహ్లి అంటూ కితాబిచ్చాడు. బాబర్ ఆజాం బ్యాటింగ్ శైలి కూడా అచ్చం కోహ్లిలానే ఉంటుందన్నాడు. ఇక ప్రపంచకప్‌లో పాక్ గెలవాలంటే ఈ ఆటగాడిపై ఆధారపడాల్సిందేనని పేర్కొన్నాడు. అతితక్కువ కాలంలోనే బాబర్ తన ఖాతాలో అరుదైన రికార్డులను నమోదు చేశాడని క్లార్క్ కొనియాడాడు.
వార్మప్ మ్యాచ్‌లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ బాబర్ శతకంతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో బాబర్ 108 బంతుల్లో 112 పరుగులు సాధించగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. దీంతో 262 పరుగులకే పాక్ ఆలౌటైంది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన అఫ్గాన్ హాష్మతుల్లా షాహిది(74 నాటౌట్), హజ్రతుల్లా జజాయి(49) బాధ్యతాయుతంగా ఆడి మ్యాచ్‌ను గెలిపించారు. ప్రపంచకప్‌లో భాగంగా మే31న పాక్ తన తొలిపోరులో మాజీ చాంపియన్ వెస్టిండీస్‌తో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment