'అలా చేస్తే చూడాలనుకుంటున్నా' | Warner hails England 'respect' after Clarke honour guard | Sakshi
Sakshi News home page

'అలా చేస్తే చూడాలనుకుంటున్నా'

Published Fri, Aug 21 2015 11:05 AM | Last Updated on Sun, Sep 3 2017 7:52 AM

క్లార్క్ కు చప్పట్లతో ఇంగ్లండ్ ఆటగాళ్ల స్వాగతం

క్లార్క్ కు చప్పట్లతో ఇంగ్లండ్ ఆటగాళ్ల స్వాగతం

లండన్: చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న మైఖేల్ క్లార్క్ కు 'గార్డ్ ఆఫ్ హానర్' తెలిపిన ఇంగ్లండ్ ఆటగాళ్లను ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రశంసించాడు. కొలంబో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న శ్రీలంక దిగ్గజ బ్యాట్స్ మన్ కుమార సంగక్కరకు భారత ఆటగాళ్లు ఇలాగే గౌరవించాలన్న ఆకాంక్షను వెలిబుచ్చాడు.

ఓవల్ టెస్టుతో కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్న క్లార్క్‌కు ఇంగ్లండ్ ఆటగాళ్లు గురువారం ఊహించని విధంగా స్వాగతం పలికారు. అతను క్రీజ్‌లోకి వచ్చిన సమయంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇరు వైపులా నిలబడి చప్పట్లతో అభినందలు తెలిపారు.

ఈ గౌరవానికి క్లార్క్ అన్నివిధాలా అర్హుడని వార్నర్ అన్నాడు. క్లార్క్ గొప్ప కెప్టెన్, నాయకుడు, జట్టు సభ్యుడని ప్రశంసించాడు. గత కొన్నేళ్లుగా క్లార్క్  క్రీడాజీవితంలో కెరీర్ లో భాగస్వామిని అయినందుకు గర్వపడుతున్నానని చెప్పాడు. సంగక్కరకు టీమిండియా ప్లేయర్స్ 'గార్డ్ ఆఫ్ హానర్' తెలిపితే చూడాలనుకుంటున్నామని వార్నర్ చెప్పాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement