కామెరాన్ బాన్‌క్రాప్ట్, మైఖెల్ క్లార్క్ (ఫైల్ ఫొటో)
మెల్‌బోర్న్ : ట్యాంపరింగ్ వివాదంతో ఆటకు దూరమైన ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌లపై ఆ దేశ మాజీ క్రికెటర్ మైఖెల్ క్లార్క్ మండిపడ్డాడు. ఇటీవల ఫాక్స్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లు మాట్లాడింది సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం పునరాగమనంపై దృష్టి పెట్టాలని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిదికాదని హితవు పలికాడు. క్రికెట్ ఆస్ట్రేలియా అప్పటి సీఈఓ జేమ్స్ సథర్‌ల్యాండ్, ఫర్ఫామెన్స్ కోచ్ ప్యాట్ హోవర్డ్‌లను విమర్శించడం, నిందించడంపై కూడా మండిపడ్డాడు. ట్యాంపరింగ్ ఘటనలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకలేదని, అనవసరంగా మాట్లాడుతూ రచ్చచేసుకోవద్దని సూచించాడు. సరైన సమాధానాలు రాబట్టలేనప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూలు చేయవద్దని పరోక్షంగా వీరిని ఇంటర్వ్యూ చేసిన ఆడమ్ గిల్‌క్రిస్ట్‌కు చురకలంటించాడు. అలాగే తప్పంతా వార్నర్‌పైనే నెట్టేయడం ఏంటని మండిపడ్డాడు.
ఇద్దరు ఆటగాళ్లు ట్యాంపరింగ్ సూత్రదారి వార్నర్ అని చెప్పడంతో అతని పునరాగమనంపై సందేహాలు నెలకొన్నాయి. అయితే సీఏ సీఈవో కెవిన్ రాబర్ట్స్ మాత్రం.. స్మిత్, బాన్‌క్రాప్ట్‌ల వ్యాఖ్యలు వార్నర్ అడ్డుకుంటాయని అనుకోవడం లేదని స్పష్టం చేశాడు. ఎంపికకు అర్హత సాధించగానే జట్టు ప్రణాళికలో భాగమవ్వడం గురించి అడితో చర్చినట్లు స్పష్టం చేశాడు. ఇక ఇంటర్వ్యూల్లో స్మిత్, బాన్‌క్రాప్ట్‌లు మాట్లాడుతూ.. వార్నర్ ప్రోద్భలంతోనే ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు చెప్పడమే కాకుండా.. గతంలో జట్టు వరుస ఓటములు ఎదుర్కొన్నప్పుడు సథర్ ల్యాండ్, హై ఫర్ఫామెన్స్ కోచ్ ప్యాట్ హోవర్డ్ గెలిచేందుకు డబ్బులిస్తున్నామని, ఆడేందుకు కాదు అని అన్నారని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై మాజీ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment