Cameron Bancroft
-
బాల్ టాంపరింగ్: ఇక్కడితో ఆగిపోయేలా లేదు
సిడ్నీ: 2018లో ఆసీస్ క్రికెటర్లు చేసిన బాల్ టాంపరింగ్ క్రికెట్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌లో బాన్‌క్రాఫ్ట్ బంతికి స్యాండ్ పేపర్‌ను రుద్దుతూ కెమెరాలకు చిక్కాడు. దాంతో ఆగ్రహించిన క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)... బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలలు... కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ వార్నర్‌లపై ఏడాది పాటు నిషేధం విధించింది. తాజాగా బాన్‌క్రాఫ్ట్.. బాల్ టాంపరింగ్ విషయం స్మిత్, వార్నర్‌లతో పాటు మిగతా బౌలర్లకు కూడా తెలుసంటూ పెద్ద బాంబు పేల్చాడు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) బాన్‌క్రాఫ్ట్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని మరోసారి విచారణకు సిద్ధమైంది. బాన్‌క్రాఫ్ట్ చెప్పినట్లు ఇతర బౌలర్లకు కూడా ఈ విషయం ముందుగానే తెలుసా అనే కోణంలో విచారణను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో బాల్ టాంపరింగ్ వివాదం ఇంకా ముగిసిపోలేదని..అది బాన్‌క్రాఫ్ట్‌తో ఆగిపోదని.. ఇంకా ముందుకు సాగుతుందని ఆసీస్ మాజీ బౌలింగ్ కోచ్ డేవిడ్ సాకర్ పేర్కొన్నాడు. ఆసీస్ ప్లేయర్లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సమయంలో ఆసీస్ బౌలింగ్ కోచ్‌గా డేవిడ్ సాకర్ ఉండడం విశేషం. డేవిడ్ సాకర్ స్పందిస్తూ.. ''ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఈ వివాదం చాలా మందిని ఇరుకున పెట్టే అవకాశం ఉంది. అది నేనైనా కావొచ్చు లేదా ఇంకెవరో కావొచ్చు. బాన్‌క్రాఫ్ట్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని సీఏ విచారణ చేపట్టడం మంచిదే కావొచ్చు.. కానీ తప్పు చేయనివాళ్లు కూడా ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విచారణలో భాగంగా రేపు నన్ను పాయింట్ అవుట్ చేయొచ్చు.. లేదంటే ఆ సమయంలో కోచ్‌గా ఉన్న డారెన్ లీమన్వైపు కూడా వెళ్లొచ్చు. ఈ విచారణతో వాళ్లు(సీఏ) ఎక్కడిదాకా వెళతారో నాకు తెలియదు.. ఒక్కటి మాత్రం చెప్పగలను.. ఇది బాన్‌క్రాఫ్ట్‌తో ముగిసిపోలేదు.. ఇది ఎప్పటికి ఆగిపోదు.. ముందుకు సాగుతూనే ఉంటుంది.'' అని చెప్పుకొచ్చాడు. చదవండి: బాల్ ట్యాంపరింగ్ చేస్తున్నానని వారికీ తెలుసు అతనికి బౌలింగ్ చేస్తే.. అమ్మాయిని ఇంప్రెస్ చేసినట్లే -
బాల్ ట్యాంపరింగ్ చేస్తున్నానని వారికీ తెలుసు: బాన్‌క్రాఫ్ట్
లండన్: క్రికెట్లో పెను దుమారానికి కారణమైన 2018 బాల్ ట్యాంపరింగ్ వివాదంపై ఆ ఘటన ప్రధాన సూత్రధారి ఆస్ట్రేలియా క్రికెటర్ కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను ఉద్దేశపూర్వకంగా బంతి ఆకారాన్ని మార్చేందుకు (బాల్ ట్యాంపరింగ్) ప్రయత్నిస్తున్నాననే విషయం అప్పటి సారథి స్మిత్, వార్నర్‌లతోపాటు ఇతర బౌలర్లకు కూడా తెలుసు. ఎందుకంటే నేను చేసే పని వల్ల వారికే లాభం ఎక్కువగా ఉంటుంది. జట్టులో గుర్తింపు తెచ్చుకోవడం కోసం నేను ట్యాంపరింగ్‌కు పూనుకున్నాను. ఆ సమయంలో నైతిక విలువలను నేను పూర్తిగా మరిచిపోయాను. ఆ తర్వాతే నాకు తెలిసింది నేను ఎంత పెద్ద తప్పు చేశానో’ అని ఇంగ్లండ్‌కు చెందిన ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాన్‌క్రాఫ్ట్ పేర్కొన్నాడు. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌లో బాన్‌క్రాఫ్ట్ బంతికి స్యాండ్ పేపర్‌ను రుద్దుతూ కెమెరాలకు చిక్కాడు. దాంతో ఆగ్రహించిన క్రికెట్ ఆస్ట్రేలియా... బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలలు... స్మిత్, వార్నర్‌లపై ఏడాది పాటు నిషేధం విధించింది. బాన్‌క్రాఫ్ట్ ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్ షిప్లో డర్హామ్ జట్టుకు ఆడుతున్నాడు. విచారణకు సిద్ధమైన సీఏ బాల్ ట్యాంపరింగ్‌పై బాన్‌క్రాఫ్ట్ చేసిన తాజా వ్యాఖ్యలపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) విచారణకు సిద్ధమైంది. బాన్‌క్రాఫ్ట్ చెప్పినట్లు ఇతర బౌలర్లకు కూడా ఈ విషయం ముందుగానే తెలుసా అనే కోణంలో విచారణ ఉంటుందని సీఏ పేర్కొంది. -
నిషేధం తర్వాత తొలిసారి జట్టులోకి..
సిడ్నీ : యావత్ క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన బాల్ ట్యాంపరింగ్ వివాదంతో నిషేధం ఎదుర్కొని జట్టుకు దూరమైన ఆస్ట్రేలియా యువ ఆటగాడు కామెరూన్ బెన్‌క్రాఫ్ట్ ఎట్టకేలకు పిలుపునందుకున్నాడు. ప్రతిష్టాత్మక యాషేస్ సిరీస్ కోసం ఎంపిక చేసిన 17 మంది సభ్యులు గల జట్టులో చోటుదక్కించుకున్నాడు. బెన్‌క్రాఫ్ట్‌తో ఆసీస్ సీనియర్ ఆటగాళ్లు ఓపెనర్ డెవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లు సైతం శిక్షను అనుభవించినప్పటికీ.. ప్రపంచకప్ టోర్నీతో వారిద్దరు అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేశారు. బెన్‌క్రాఫ్ట్ నిషేధం 9 నెలల్లోనే ముగిసినప్పటికీ ఆసీస్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. యాషెస్ సిరీస్ కోసం టిమ్ పెయిన్ నేతృత్వంలోని 17 మంది సభ్యుల గల జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం ప్రకటించింది. ఈ జట్టులో మిచెల్ నెసెర్ అనే అన్క్యాప్డ్ ప్లేయర్ చోటు దక్కించుకున్నాడు. ‘25 మంది ఆటగాళ్ల జాబితాను 17 మందికి కుదించడం చాలా కష్టమైన పని. ఈ సిరీస్ కోసం అద్భుతంగా సాధన చేశాం. ఇందులో 8 మంది ఆటగాళ్లు ఆస్ట్రేలియా-ఏ తరఫున గత నెలరోజులుగా ఇంగ్లండ్‌లో ఆడుతున్నారు. ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలో ఆడిన ఆరుగురిని తీసుకున్నాం. కౌంటీ క్రికెట్ ఆడిన మరో ముగ్గురిని ఎంపిక చేశాం. తొలి టెస్ట్‌కు సిద్ధంగా ఉండేలా చూసుకున్నాం’ అని ఆసీస్ జాతీయ సెలక్టర్ ట్రెవర్ హోన్స్ తెలిపారు. ఇక 2018లో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న బాల్ ట్యాంపరింగ్ వివాదం ఆసీస్ జట్టును ప్రపంచం ముందు దోషులగా నిలబెట్టింది. దీంతో ఆటగాళ్లపై క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన శిక్షలు విధించడం.. శిక్షణ కాలం ముగిసి పునరాగమనం చేయడం తెలిసిందే. -
ఓవర్లో ఏడో బంతికి బ్యాట్స్‌మన్ ఔట్!
పెర్త్: బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో ఓ బ్యాట్స్‌మన్ ఔటైన తీరు వివాదాస్పదమైంది. సాధారణంగా ఓవర్‌కు ఆరు స్ట్రైయిట్ బంతులు మాత్రమే పడాల్సిన ఉన్నా అంపైర్ ఏడో బాల్ వేయించడంతో పాటు ఆ బంతికి బ్యాట్స్‌మన్ ఔట్ కావడం వివాదానికి దారి తీసింది. ఆస్ట్రేలియా వేదిక జరుగుతున్న బీబీఎల్‌లో భాగంగా ఆదివారం పెర్త్ స్కార్చర్స్-సిడ్నీ సిక్సర్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ జట్టు 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెండో ఓవర్లో ఓపెనర్ మైకేల్ క్లింగర్ ఏడో బంతికి ఔటయ్యాడు. ఓవర్‌కు వేసే బంతుల్ని లెక్కించే క్రమంలో అంపైర్ ఒక్క బంతి ఎక్కువగా వేయించాడు. ఆ బంతికి క్లింగర్ ఔట్ కావడం చర్చకు దారి తీసింది. డ్వార్షూయిస్ వేసిన సదరు ఓవర్ తొలి రెండు బంతుల్ని మరో ఓపెనర్ బెన్‌క్రాఫ్ట్ ఆడి ఒక లెగ్ బై ద్వారా పరుగు తీశాడు. ఆపై మూడో బంతిని క్లింగర్ ఆడి బై ద్వారా రెండు పరుగులు సాధించగా, నాల్గో బంతికి క్లింగర్ పరుగు తీశాడు. ఇక ఐదో బంతికి బెన్ క్రాఫ్ ఆడి రెండు పరుగులు తీయగా, ఆరు బంతికి పరుగు తీశాడు. దాంతో ఓవర్ పూర్తయ్యింది. అయితే మరొక బంతిని అంపైర్ వేయించడంతో క్లింగర్ ఔటయ్యాడు. ఫీల్డ్ అంపైర్ చేసిన తప్పిదాన్ని మ్యాచ్ అధికారులు సైతం గుర్తించకపోవడంతో క్లింగర్ 2 పరుగులకే పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కామెరూన్ బెన్‌క్రాఫ్ట్ 61 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో అజేయంగా 87 పరుగులు సాధించడంతో పెర్త్ స్కార్చర్స్ 18.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి గెలుపును అందుకుంది. బాల్ ట్యాంపరింగ్‌తో నిషేధానికి గురై ఇటీవల ప్రొఫెషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టిన బెన్‌క్రాఫ్ట్ బ్యాట్‌తో మెరవడం పెర్త్ స్కార్చర్స్ అభిమానుల్ని అలరించింది. -
ఇప్పుడిది అవసరమా : ఆసీస్ మాజీ క్రికెటర్
మెల్బోర్న్ : ట్యాంపరింగ్ వివాదంతో ఆటకు దూరమైన ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌లపై ఆ దేశ మాజీ క్రికెటర్ మైఖెల్ క్లార్క్ మండిపడ్డాడు. ఇటీవల ఫాక్స్స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లు మాట్లాడింది సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం పునరాగమనంపై దృష్టి పెట్టాలని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిదికాదని హితవు పలికాడు. క్రికెట్ ఆస్ట్రేలియా అప్పటి సీఈఓ జేమ్స్ సథర్‌ల్యాండ్, ఫర్ఫామెన్స్ కోచ్ ప్యాట్ హోవర్డ్లను విమర్శించడం, నిందించడంపై కూడా మండిపడ్డాడు. ట్యాంపరింగ్ ఘటనలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకలేదని, అనవసరంగా మాట్లాడుతూ రచ్చచేసుకోవద్దని సూచించాడు. సరైన సమాధానాలు రాబట్టలేనప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూలు చేయవద్దని పరోక్షంగా వీరిని ఇంటర్వ్యూ చేసిన ఆడమ్ గిల్‌క్రిస్ట్‌కు చురకలంటించాడు. అలాగే తప్పంతా వార్నర్‌పైనే నెట్టేయడం ఏంటని మండిపడ్డాడు. ఇద్దరు ఆటగాళ్లు ట్యాంపరింగ్ సూత్రదారి వార్నర్ అని చెప్పడంతో అతని పునరాగమనంపై సందేహాలు నెలకొన్నాయి. అయితే సీఏ సీఈవో కెవిన్ రాబర్ట్స్ మాత్రం.. స్మిత్, బాన్క్రాప్ట్ల వ్యాఖ్యలు వార్నర్ అడ్డుకుంటాయని అనుకోవడం లేదని స్పష్టం చేశాడు. ఎంపికకు అర్హత సాధించగానే జట్టు ప్రణాళికలో భాగమవ్వడం గురించి అడితో చర్చినట్లు స్పష్టం చేశాడు. ఇక ఇంటర్వ్యూల్లో స్మిత్, బాన్‌క్రాప్ట్‌లు మాట్లాడుతూ.. వార్నర్ ప్రోద్భలంతోనే ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు చెప్పడమే కాకుండా.. గతంలో జట్టు వరుస ఓటములు ఎదుర్కొన్నప్పుడు సథర్ ల్యాండ్, హై ఫర్ఫామెన్స్ కోచ్ ప్యాట్ హోవర్డ్ గెలిచేందుకు డబ్బులిస్తున్నామని, ఆడేందుకు కాదు అని అన్నారని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై మాజీ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వార్నర్ సూచనతోనే: బాన్‌క్రాఫ్ట్
మెల్బోర్న్: కేప్‌టౌన్ టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినందుకు 9 నెలల నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా క్రికెటర్ బాన్‌క్రాఫ్ట్ అప్పటి నిర్వాకానికి గల కారణాలు తాజాగా వెల్లడించాడు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రోద్బలంతోనే బంతి ఆకారం మార్చేందుకు యత్నించామని తెలిపాడు. మాజీ వికెట్ కీపర్ గిల్‌క్రిస్ట్ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ ‘ట్యాంపరింగ్ చేయమని వార్నర్ సూచించాడు. నేను గుడ్డిగా అతను చెప్పినట్లే చేశాను. అయితే ఇదంతా నా తప్పిదమే. ఈ ఉదంతంలో ఎవరినీ బాధ్యుల్ని చేయాలనుకోవడం లేదు. నేను బాధితుడ్ని కాను. ఇది నా పొరపాటే. నేనే ఇదంతా చేశాను. ఏమాత్రం ముందువెనుక ఆలోచించకుండా పెద్ద తప్పే చేశాను’ అని అన్నాడు. అతనిపై విధించిన 9 నెలల నిషేధం ఈ నెలాఖరుతో ముగియనుంది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఉన్నతాధికారులు సదర్లాండ్, హోవర్డ్లు తమ జట్టు ఈ టెస్టులో తప్పక గెలవాల్సిందేనని ఒత్తిడి తేవడం వల్లే బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డామని మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్మిత్, వార్నర్లిద్దరూ ఏడాది నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. గిల్‌క్రిస్ట్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఇంటర్వ్యూలో స్మిత్ మాట్లాడుతూ ‘కేవలం ఆడేందుకు మీకు డబ్బులివ్వట్లేదు. గెలవాలనే ఇస్తున్నాం అని మాతో సదర్లాండ్ చెప్పిన మాటలు ఎలాగైనా... ఏం చేసైనా టెస్టు గెలవాలనే కసిని పెంచాయి. అందుకే బంతి ఆకారం మార్చేందుకు యత్నించాం’ అని స్మిత్ తెలిపాడు. -
అతను చెప్పడంతోనే ట్యాంపరింగ్ చేశా : బాన్‌క్రాఫ్ట్
సిడ్నీ : ట్యాంపరింగ్ వివాదంతో క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. ప్రపంచ క్రికెట్ ముందు ఆస్ట్రేలియా ఆటగాళ్లను దోషులుగా నిలబెట్టింది. ఈ ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికా పర్యటనలో చోటుచేసుకున్న ఈ వివాదం ఆస్ట్రేలియా జట్టును కుదిపేసింది. ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లను ఏడాది పాటు ఆటకు దూరం చేయగా.. యువ ఆటగాడు కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌ను 9 నెలలు దూరం చేసింది. అయితే ఈ ఘటన సూత్రదారి డేవిడ్ వార్నరేనని అప్పట్లో విచారణ జరిపిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) దర్యాప్తు బృందం తేల్చిచెప్పింది. కానీ ఇప్పటి వరకు వార్నర్ పాత్రపై ఈ ఆటగాళ్లు నోరు విప్పలేదు. తాజాగా వార్నర్ ప్రోద్భలంతోనే తాను బాల్ ట్యాంపరింగ్‌కు యత్నించినట్లు ఈ వివాద పాత్రదారి, యువ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్ తొలిసారి మీడియా వేదికగా అంగీకరించాడు. మరో నాలుగు రోజుల్లో బాన్‌క్రాఫ్ట్ తన నిషేధ కాలాన్ని పూర్తి చేసుకోనున్నాడు. డిసెంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న బిగ్ బాష్ టి20 లీగ్‌తో క్రికెట్లోకి పునఃప్రవేశం చేయనున్నాడు. ఈ నేపథ్యంలో మీడియాతో బాన్‌క్రాఫ్ట్ ముచ్చటించాడు. ‘ఆ మ్యాచ్ పరిస్థితుల దృష్ట్యా బంతి ఆకారం దెబ్బతీయమని వార్నర్ నాకు సూచించాడు. అయితే అది మంచి పనా? కాదా? అనే విషయాన్ని గ్రహించలేకపోయాను. ఆ పరిస్థితుల్లో అలా చేయడం సరైందేననిపించింది. కానీ నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన ఈ పని జట్టుపై చాలా ప్రభావం చూపింది.’ అని చెప్పుకొచ్చాడు. తనపై బహిష్కరణ వేటు పడ్డాక తన దృక్పథం పూర్తిగా మారిపోయిందని... ఒక దశలో క్రికెట్ వదిలేసి యోగా టీచర్‌గా మారిపోదామని అనుకున్నానని ఇటీవల బాన్‌క్రాఫ్ట్ తెలిపిన విషయం తెలిసిందే. ఇక స్టీవ్ స్మిత్సైతం ట్యాంపరింగ్‌ను అడ్డుకోకపోవడం కెప్టెన్‌గా తన వైఫల్యమేనని ఇటీవల మీడియా ముందు అంగీకరించాడు. -
క్రికెట్‌ను వదిలేసి... యోగా టీచర్ అవుదామనుకున్నా
బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో తొమ్మిది నెలల పాటు ఆటకు దూరమైన సమయంలో యోగా తన జీవితంలో కీలక పాత్ర పోషించిందని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ అన్నాడు. బహిష్కరణ వేటు పడ్డాక తన దృక్పథం పూర్తిగా మారిపోయిందని... ఒక దశలో క్రికెట్ వదిలేసి యోగా టీచర్‌గా మారిపోదామని అనుకున్నానని తెలిపాడు. తాను క్రికెటర్‌ననే భావన నుంచి బయటకు వచ్చి కొత్తగా ఆలోచించే విషయంలో యోగా మరచిపోలేని అనుభవాన్నిచ్చిందని అతను చెప్పుకొచ్చాడు. డిసెంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న బిగ్ బాష్ టి20 లీగ్‌తో బాన్‌క్రాఫ్ట్ క్రికెట్లోకి పునఃప్రవేశం చేయనున్నాడు. -
ట్యాంపరింగ్‌తో సంబంధం లేదు: ఆసీస్ ఆటగాడు
సిడ్నీ : దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్సందర్భంగా చోటుచేసుకున్న బాల్ ట్యాంపరింగ్ వివాదం యావత్ క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నాడు ఆస్ట్రేలియా ఆటగాడు పీటర్ హ్యాండ్స్కాంబ్. గత మార్చిలో సఫారీతో మూడో టెస్టు సందర్భంగా ఆసీస్ యువ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్ సాండ్ పేపర్‌తో బంతి ఆకారాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసి కెమెరాలకు చిక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో హ్యాండ్స్‌కాంబ్‌కు సంబంధం ఉందని ప్రచారం జరిగింది. అప్పటి కోచ్ డారెన్ లీమన్ సూచనల మేరకు హ్యాండ్స్కాంబ్ బాన్‌క్రాఫ్ట్‌ను అప్రమత్తం చేశాడని ఓ వీడియో నెట్టింట్లో హల్చల్ చేసింది. తాజాగా ఈ ఆరోపణలను హ్యాండ్స్కాంబ్ ఖండించాడు. ఆ వీడియో ఎడిట్ చేసిందని, ఆ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నాడు. ఆ వీడియోలో ఏముందంటే.. బాన్‌క్రాఫ్ట్ సాండ్ పేపర్‌తో బంతి ఆకారాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుండగా.. అది కెమెరాల్లో స్పష్టమైంది. దీన్నిగమనించిన కోచ్ లీమన్ వాకీటాకీ ద్వారా హ్యాండ్స్‌కాంబ్‌కు తెలియజేశాడు. దీంతో అతను నవ్వుతూ.. ఎదో మాట్లాడుతున్నట్లు చేస్తూ బాన్‌క్రాఫ్ట్‌ను హెచ్చరించగా.. అతను సాండ్‌పేపర్‌ను లోదుస్తుల్లో దాచాడు. అయితే తను ఎలాంటి హెచ్చరికలు చేయలేదని, అతన్ని అప్రమత్తం కూడాచేయలేదని, ఓ జోక్ వేసనంతేనని హ్యాండ్స్కాంబ్ స్పష్టం చేశాడు. ఇక ఈ వివాదంతో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డెవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది నిషేదం విధించగా.. బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించిన విషయం తెలిసిందే. -
‘అతని స్థానంలో నేనున్నా మోసం చేసేవాడిని’
సిడ్నీ: ఇటీవలే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కొత్త కోచ్‌గా నియమితులైన జస్టిన్ లాంగర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆసీస్ క్రికెటర్ బాన్ క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్ వివాదాన్ని ప్రస్తావిస్తూ.. అతని స్థానంలో తానున్నా కచ్చితంగా మోసం చేసేవాడినన్నాడు. తాను ఆడే సమయంలో సీనియర్ క్రికెటర్లు మోసం చేయమని ఆదేశిస్తే అది తప్పకుండా చేసే వాడినని చెప్పాడు. దీనిలో భాగంగా అలెన్ బోర్డర్, స్టీవ్ వా, డేవిడ్ బూన్, ఇయాన్ హేలీ, బాబీ సింప్సన్ తదితరులతో డ్రెసింగ్ రూమ్ విషయాలని లాంగర్ షేర్ చేసుకున్నాడు. అలెన్ బోర్డర్ వంటి సీనియర్ ఆటగాళ్లు తనను కనుక బంతిని ట్యాంపరింగ్ చేయమని అడిగి ఉంటే యువ ఆటగాడిగా తాను ఆ పని చేసి ఉండేవాడినని పేర్కొన్నాడు. అయితే ట్యాంపరింగ్ అంటే బోర్డర్‌కు కూడా భయమేనని, అలా చేయడానికి ఆయన ఎప్పుడూ ఇష్టపడలేదన్నాడు. ఇక ట్యాంపరింగ్ పాల్పడిన ఏ ఆటగాడ్ని క్షమించే గుణం బాబీ సింప్సన్‌కు లేదన్నారు. కొన్ని నెలల క్రితం దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో బాల్ ట్యాంపరింగ్ ఘటనలో డేవిడ్ వార్నర్ అడగడంతో బాన్ క్రాఫ్ట్ బంతిని ట్యాంపర్ చేసిన సంగతి తెలిసిందే. నూతన కోచ్ లాంగర్ చేసిన వ్యాఖ్యలు.. వార్నర్, స్మిత్‌ల వ్యవహార శైలిని పరోక్షంగా తప్పుబడుతున్నట్లు ఉండగా, క్రాఫ్ట్‌కు మద్దతుగా ఉన్నాయి. -
స్మిత్ మళ్లీ కెప్టెన్ అవుతాడు: లీమన్
సిడ్నీ: బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా ఆస్ట్రేలియా క్రికెట్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న డారెన్ లీమన్‌కు తాజాగా కోచింగ్ బాధ్యతలు అప్పగించారు. ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఆటగాళ్లను సిద్ధం చేసే నేషనల్ ఫర్మార్మెన్స్ స్క్వాడ్ (ఎన్పీఎస్)కు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అయితే బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు క్రికెట్‌కు దూరమైన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌తో పాటు 9నెలల పాటు నిషేధం ఉన్న బాన్‌క్రాఫ్ట్ చాలా మంచివాళ్లని చెప్పాడు లీమన్. స్థానిక రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్యాంపరింగ్ వివాదంపై మరోసారి లీమన్ స్పందించారు. ‘స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లు చాలా మంచివాళ్లు. పొరపాటున తప్పు చేశారు. వారిపై నిషేధం పూర్తయ్యాక మళ్లీ జాతీయ జట్టులో ఆడతారని నమ్మకం ఉంది. వారిపై నిషేధం ముగిసేవరకు రోజూ బాధపడతాను. వాళ్లు ఆసీస్‌కు మళ్లీ ఆడి దేశ ప్రతిష్టను రెట్టింపు చేస్తారు. స్మిత్ మళ్లీ కెప్టెన్ అవుతాడు. అదృష్టవశాత్తూ అందరూ వారి తప్పుల్ని క్షమించేశారని’ లీమన్ వివరించాడు. నేషనల్ ఫర్మార్మెన్స్ స్క్వాడ్‌కు ట్రాయ్ కూలీ, ర్యాన్ హ్యారిస్, క్రిస్ రోజర్స్లతో కలిసి లీమన్ సేవలందించనున్నాడు. -
స్మిత్ బాటలోనే వార్నర్..
సిడ్నీ: బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు నిషేధానికి గురైన ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం తన సహచర ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, బాన్ క్రాఫ్ట్ బాటలోనే నడుస్తానని అంటున్నాడు. తనపై విధించిన నిషేధాన్ని సవాల్ చేయబోనని వార్నర్ స్పష్టం చేశాడు. అసలు క్రికెట్ ఆస్ట్రేలియా తరపున ఇక క్రికెట్ ఆడలేనేమోనంటూ ఇటీవల పేర్కొన్న వార్నర్.. తనపై విధించిన శిక్షా కాలాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. ‘నాపై క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన శిక్ష సరైనదే అనుకుంటున్నా. దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఆ క్రమంలో నిషేధంపై అప్పీల్ చేసుకుని అవకాశం సీఏ ఇచ్చిన అందుకు ముందుకు వెళ్లాలని అనుకోవడం లేదు' అని వార్నర్ తెలిపాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఏడాది నిషేధం ఎదుర్కొంటున్న స్టీవ్ స్మిత్ , బాన్ క్రాఫ్ట్‌లు తమపై సీఏ విధించిన శిక్షను సవాలు చేయబోనని ప్రకటించిన విషయం తెలిసిందే. సీఏ శిక్షను సవాలు చేయడం లేదని ఈ నిషేద కాలాన్ని పూర్తిచేసుకోని ఆస్ట్రేలియా ప్రజల మనసు గెలుచుకున్న తర్వాతే మైదానంలో అడుగుపెడుతామన్నారు. -
అప్పుడే మైదానంలో అడుగుపెడుతా : ఆసీస్ ఆటగాడు
సిడ్నీ : బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఏడాది నిషేధం ఎదుర్కొంటున్నఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) విధించిన శిక్షను సవాలు చేయబోనని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదంతో నిషేదానికి గురైన మరో ఆసీస్ ఆటగాడు కామెరాన్ బెన్‌క్రాఫ్ట్ సైతం స్మిత్ బాటలోనే నడుస్తానని తెలిపాడు. తాను సైతం సీఏ శిక్షను సవాలు చేయడం లేదని ఈ నిషేద కాలాన్ని పూర్తిచేసుకోని ఆస్ట్రేలియా ప్రజల మనసు గెలుచుకున్న తర్వాతే మైదానంలో అడుగుపెడుతానని స్పష్టం చేశాడు. కెప్టౌన్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు సందర్భంగా ఈ యువ ఆటగాడు ఉప్పుకాగితంతో బాల్ ట్యాంపరింగ్‌కు యత్నిస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో తీవ్ర దుమారం చెలరేగగా క్రికెట్ ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తోపాటు వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లపై ఏడాది, బెన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేదం విధించింది. ఈ నిషేదాన్ని సవాలు చేసే అవకాశం కూడా కల్పించింది. అయితే తాము చేసిన తప్పుకు సరైన శిక్షే అని భావించిన స్మిత్, బెన్‌క్రాఫ్ట్‌లు సవాలు చేయడం లేదని ప్రకటించారు. ఈ వివాదంపై ఇప్పటికే పశ్చాతాపం వ్యక్తం చేసిన వార్నర్ సవాలు అంశంపై మాత్రం ఇంకా స్పందించలేదు. ఈ ముగ్గురు ఆటగాళ్లకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తీవ్ర శిక్షలు విధించిందని, వారికి విధించిన శిక్షలను తగ్గించాలని ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్ (ఏసీఏ) డిమాండ్ చేస్తూ మద్దతు తెలిపింది. -
స్మిత్, వార్నర్, బెన్‌క్రాఫ్ట్‌లకు శిక్ష తగ్గిస్తారా?
సిడ్నీ: బాల్ ట్యాంపరింగ్ కుంభకోణంలో శిక్ష పడిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బెన్‌క్రాఫ్ట్‌కు మద్దతు పెరుగుతోంది. ఈ ముగ్గురు ఆటగాళ్లకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తీవ్ర శిక్షలు విధించిందని, వారికి విధించిన శిక్షలను తగ్గించాలని ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్ (ఏసీఏ) డిమాండ్ చేసింది. స్మిత్, వార్నర్‌లపై ఏడాది నిషేధం, బెన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం సరికాదని, గతంలో ఎన్నడూ ఇంతటి తీవ్రమైన పెనాలిటీ చర్యలను చేపట్టలేదని పేర్కొంది. ‘ఆటగాళ్లపై తీసుకున్న చర్యలపై పునరాలోచన చేయాలని కోరుతున్నాం. క్రికెట్ నుంచి బహిష్కరణ, ఆంక్షలు వంటి చర్యలను తగ్గించాలని అడుగుతున్నాం. కనీసం శిక్షాకాలం ముగియడానికి ముందే దేశీయ క్రికెట్లో ఆడేందుకు అనుమతించాలి. ఇది వారికి రిహాబిలిటేషన్గా ఉంటుంది’ అని ఏసీఏ అధ్యక్షుడు గ్రెగ్ డ్యెర్ తెలిపారు. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా బెన్‌క్రాఫ్ట్ సాండ్‌పేపర్‌తో బాల్ ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించి.. దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉండటంతో స్మిత్, వార్నర్‌లపై ఏడాదిపాటు సీఏ నిషేధం విధించింది. బెన్క్రాఫ్ట్ను తొమ్మిది నెలలు నిషేధించింది. ఈ శిక్షలపై అప్పీల్ చేసుకునేందుకు గురువారం వరకు సమయం ఉంది. అయితే, గురువారంలోగా శిక్షలపై అప్పీల్ చేసుకోవాలా? లేదా? అన్నది క్రికెటర్ల వ్యక్తిగత అంశమని, ఈ విషయంలో తాము ఏమీ చెప్పలేమని తెలిపారు. తమకు విధించిన శిక్షలపై స్మిత్, వార్నర్, బెన్‌క్రాఫ్ట్ అప్పీల్‌కు వెళ్లే అవకాశముందని తెలుస్తోంది. -
సానుభూతి!
స్టీవ్ స్మిత్ మీడియా సమావేశంలో కళ్ళనీళ్లు పెట్టుకొని భావోద్వేగంగా మాట్లాడిన తర్వాత అతనిపై క్రికెట్ ప్రపంచం నుంచి సానుభూతి కురుస్తోంది. శిక్షల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉందని వారు అభిప్రాయ పడుతున్నారు. వీరిలో స్మిత్‌తో తలపడిన ప్రత్యర్థులు కూడా ఉండటం విశేషం. విమానాశ్రయంలో స్మిత్‌ను తీసుకొస్తున్న దృశ్యం, అతని మీడియా సమావేశం నన్ను వెంటాడుతున్నాయి. వారు తప్పు చేశారనేది వాస్తవం. కానీ దానిని అంగీకరించారు. వారిద్దరు గొప్ప ఆటగాళ్లు. ఈ ఘటనను బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం తప్పు. –రోహిత్ శర్మ క్రికెట్‌ను అవినీతి రహితంగా ఉంచాల్సిందే. కానీ స్మిత్, వార్నర్‌లకు వేసిన శిక్ష చాలా పెద్దది. గతంలో జీతాల పెంపు కోసం వీరిద్దరు పోరాడటం వల్లే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారేమో! ఆటగాళ్ల తరఫున నిలబడిన వారిని పరిపాలకులు అణచివేసిన చరిత్ర ఉంది. నాకు స్మిత్‌లో మోసగాడు కనిపించడం లేదు. తన దేశం కోసం గెలిచేందుకు ప్రయత్నించి నాయకుడే కనిపిస్తున్నాడు. అతను ఎంచుకున్న పద్ధతి తప్పు కావచ్చు కానీ అతడిని అవినీతిపరుడిగా ముద్ర వేయకండి. – గంభీర్ సీఏ విచారణ లోపభూయిష్టంగా జరిగింది. శిక్షలు తీవ్రంగా ఉన్నాయి. ఐసీసీ విధించిన శిక్షలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. గతంలో ఇదే నేరానికి విధించిన శిక్షకు, ఇప్పటిదానికి చాలా చాలా వ్యత్యాసం ఉంది. ముందూ వెనక ఆలోచించకుండా ఆటగాళ్లను ఘటన జరిగిన రోజు మీడియా ముందు ప్రవేశపెట్టడమే పెద్ద తప్పు. క్రికెటర్లకు మేం నైతిక మద్దతుతో పాటు న్యాయపరంగా కూడా సహకరిస్తాం. – ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్ వారు తాము చేసిన పనికి బాధపడటంతో పాటు పశ్చాత్తాపం చెందుతున్నారు. తమ చర్య ద్వారా జరగబోయే తదనంతర పరిణామాలను ఎదుర్కోక తప్పదు. ఇలాంటి సమయంలో వారి కుటుంబ సభ్యులు అండగా నిలవడం ఎంతో ముఖ్యం. ఇక మనం దాని గురించి చర్చించడం మాని పక్కకు తప్పుకొని వారికి కాస్త ఏకాంతం కల్పిస్తే బాగుంటుంది. – సచిన్ టెండూల్కర్ స్మిత్‌ను చూస్తే చాలా బాధగా ఉంది. అతడిని ఇలాంటి స్థితిలో చూడలేం. రాబోయే రోజులు చాలా కఠినంగా గడుస్తాయి. మానసికంగా దృఢంగా ఉండమని నేను మెసేజ్ పంపించాను కూడా. మా ఇద్దరికీ పరస్పర గౌరవం ఉంది. ఆస్ట్రేలియాకు అతను అత్యుత్తమ కెప్టెన్. – ఫాఫ్ డు ప్లెసిస్ వార్నర్ చెడ్డవాడు కాదు. నేను అతనికి ప్రత్యర్థిగా, ఐపీఎల్లో అతనితో కలిసి ఆడాను. ఘటన జరిగిన తర్వాత కూడా మేం టచ్‌లోనే ఉన్నాం. ప్రజల భావోద్వేగాల వల్లే భారీ శిక్ష పడింది తప్ప అతను తప్పుడు మనిషి మాత్రం కాదు. – కేన్ విలియమ్సన్ మంచివాళ్లు కూడా తప్పులు చేస్తారు – నాకు తెలిసి స్మిత్, బాన్‌క్రాఫ్ట్ కొద్ది క్షణాలు మతి తప్పారంతే. వారికి రెండో అవకాశం ఇవ్వాలి. చుట్టుపక్కల ఉన్నవారు అండగా నిలవాలి. – మైకేల్ వాన్ స్మిత్ ఒక మగాడిలా తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. కానీ అతని ఏడుపు, కొందరు అతనితో వ్యవహరిస్తున్న తీరు చూస్తే చాలా బాధేస్తోంది. – షోయబ్ అక్తర్ ఇప్పుడు జనం కళ్లు చల్లబడ్డాయా... స్మిత్ మాట్లాడుతుంటే చూడలేకపోతున్నాను. – ఆండ్రూ ఫ్లింటాఫ్ -
అభిమాన ఆటకు చేటు చేశామని వేదన..
బాల్ ట్యాంపరింగ్ ఘటనతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కుదుపునకు లోనైతే... అందుకు పాల్పడి శిక్షకు గురైన ఆటగాళ్లు తీవ్ర మనో వ్యథకు గురవుతున్నారు. తమది ఎంత పెద్ద తప్పో, తమను ఇంతవారిని చేసిన ఆటకు చేసిన చేటేమిటో తలచుకుని కుమిలిపోతున్నారు. సస్పెన్షన్ కారణంగా స్వదేశానికి తిరిగివచ్చిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌లు గురువారం మీడియాతో మాట్లాడారు. దక్షిణాఫ్రికా నుంచి సిడ్నీ చేరుకున్న స్మిత్ విమానాశ్రయంలోనే మీడియా సమావేశం నిర్వహించాడు. ఓ సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు కార్చాడు. అబద్ధమాడాను... ట్యాంపరింగ్‌కు వాడిన వస్తువు విషయంలో నేను అబద్ధమాడాను. ఆస్ట్రేలియన్లంతా తలదించుకునేలా ప్రవర్తించినందుకు క్షమాపణ కోరడం ఒక్కటే ఇప్పుడు చేయగలను. శాండ్ పేపర్‌తో బంతి ఆకారాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించాను. అయితే అంపైర్లు, మీడియాతో దానిని పసుపు రంగు టేపుగా చెప్పాను. విచారణ తర్వాత అసలు విషయం తేలింది. భవిష్యత్‌లోనూ నేను చింతించే అంశం ఇది. ఈ ఘటన నా హృదయాన్ని చాలా బాధించింది. జట్టులో స్థానాన్ని చేజేతులా పోగొట్టుకున్నా. గతంలో ఎన్నడూ ట్యాంపరింగ్‌కు పాల్పడలేదు. వ్యక్తిగా, ఆటగాడిగా నమ్మిన విలువల విషయంలో రాజీ పడ్డాను. అన్ని నిబంధనలు ఉల్లంఘిస్తూ, క్రీడా స్ఫూర్తిని దెబ్బతీస్తూ పాల్పడిన ఈ చర్య క్రికెట్ ఎలా ఆడకూడదో చెప్పేందుకు ఓ ఉదాహరణ. కోల్పోయిన ప్రతిష్ఠను తిరిగి పొందడం కష్టమే అయినా అది నాకు చాలా ముఖ్యం. నిషేధంలో భాగమైన స్వచ్ఛంద సేవ ద్వారా సమాజానికి ఎంతో కొంత చేస్తాను. నేను కూడా... ► రాజీనామా ప్రకటించిన లీమన్ ► స్మిత్ భావోద్వేగ ప్రసంగమే కారణం ► హెడ్ కోచ్ పదవికి గుడ్‌బై జొహన్నెస్‌బర్గ్: బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఆటగాళ్ల నిషేధం తర్వాత ఇప్పుడు కోచ్ వంతు! క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నివేదిక ప్రకారం తన తప్పేమీ లేదని తేలినా... జట్టు హెడ్ కోచ్ డారెన్ లీమన్ తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. కోచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు గురువారం లీమన్ ప్రకటించాడు. నేటి నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే చివరి టెస్టు కోచ్‌గా తనకు చివరిదని అతను వెల్లడించాడు. వివాదంలో తన గురించి వినిపించిన వ్యాఖ్యలతో తీవ్రంగా కలత చెందానన్న లీమన్... ఉదయం స్మిత్ భావోద్వేగ ప్రసంగం కూడా తన రాజీనామాకు కారణమని వెల్లడించాడు. ‘గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు, తీవ్రమైన పదజాలంతో మమ్మల్ని ద్వేషిస్తున్న తీరును బట్టి చూస్తే ఇక కొనసాగడం కష్టమనిపించింది. నేను, నా వాళ్లు ఎంతో భరించాం. వివాదంలో నాకు భాగం లేదని మరోసారి చెబుతున్నాను. సంవత్సరంలో నేను 300 రోజులు కుటుంబానికి దూరంగా ఉంటున్నాను. ఇప్పుడు నా వాళ్లతో సమయం గడిపేందుకు కూడా ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. గత ఐదు రోజులుగా మేమెవ్వరం సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదు. ఇలాంటి పరిస్థితిలో, మనసులో ఎంతో సంఘర్షణతో ఆటతో అనుబంధం కొనసాగించలేం’ అని లీమన్ వ్యాఖ్యానించాడు. తన నిర్ణయం జట్టుకు కూడా ఉపయోగపడుతుందని, అన్నీ మరచి కొత్త ఆరంభంతో ముందుకు వెళ్లేందుకు అది అవసరమని లీమన్ ఉద్వేగంగా చెప్పాడు. ‘ఇద్దరు యువ ఆటగాళ్లు ఈ రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన తీరు అసాధారణం. స్మిత్ ఏడవడం చూస్తే నాకు చాలా బాధ వేసింది. మంచివాళ్లు కూడా తప్పులు చేస్తారు’ అని లీమన్ అన్నాడు. తాను రాజీనామా చేయడం లేదని ఇంతకు ముందే ప్రకటించినా... స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లను చూసిన తర్వాత తన నిర్ణయం మార్చుకున్నట్లు అతను స్పష్టం చేశాడు. ఐదేళ్ల క్రితం ఆస్ట్రేలియా కోచ్‌గా లీమన్ బాధ్యతలు చేపట్టాడు. మళ్లీ మాట్లాడతా... చిన్నతనం నుంచి నేను అభిమానించిన క్రీడపై మచ్చపడేలా చేసినందుకు దేశంలోని, ప్రపంచంలోని క్రికెట్ అభిమానులందరికి క్షమాపణలు కోరుతున్నాను. ఇది నా భార్య, పిల్లలకు తీవ్ర భావోద్వేగ సమయం. ఇప్పుడు నా ప్రాధాన్యం నా పిల్లలను నిద్ర పుచ్చడమే. మనసు కొంత స్థిమితపడ్డాక రెండు రోజుల్లో మళ్లీ మాట్లాడతాను. ఏడాది నిషేధ సమయాన్ని కుటుంబం, స్నేహితులు, సన్నిహితులతో గడపాలని అనుకుంటున్నా. కుటుంబంతో వార్నర్ పూర్తి బాధ్యత నాదే... ట్యాంపరింగ్ ఘటన నా నాయకత్వ వైఫల్యమే. అందుకు ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను. ఇతరులెవరినీ నిందించలేను. చేసిన తప్పునకు పర్యవసానాలను ఎదుర్కొంటున్నాను. గొప్ప వ్యక్తులు కూడా తప్పులు చేస్తారు. ఇలా చేసేందుకు అనుమతించడం నా నిర్ణయ లోపం. ఇందుకు క్షమాపణలు కోరుతున్నాను. భవిష్యత్‌లో జరగదని హామీ ఇస్తున్నాను. ఇది జీవితాంతం చింతించాల్సిన విషయం. అందరికీ పాఠం. కానీ నష్టం భర్తీకి చేయగలిగినంత చేస్తా. ఓ మార్పునకు నేనో కారణం కావొచ్చు. కాలంపై ఆశగా ఉన్నా. కోల్పోయిన ప్రతిష్టను తిరిగి పొందగలనన్న నమ్మకం ఉంది. ప్రపంచంలోనే క్రికెట్ గొప్ప క్రీడ. ఇది నా జీవితం. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా ఉన్నత స్థితి, గౌరవం పొందా. భవిష్యత్‌లో కూడా ఇలాగే ఉంటుందని అనుకుంటున్నా. ఓ నిర్ణయం తీసుకునేటపుడు దాని ప్రభావం ఎవరిపై ఉంటుందో ఆలోచించాలి. అది తల్లిదండ్రులనూ ఇబ్బంది పెట్టొచ్చు. వృద్ధాప్యంలోని నా తండ్రి బాధను చూడండి. నా చర్యతో అమ్మ కూడా బాధపడుతోంది. అందరి మనసులను తీవ్రంగా గాయపర్చినందుకు ఆస్ట్రేలియా ప్రజలకు క్షమాపణ చెబుతున్నాను. -
భయపడి అబద్ధం చెప్పాను.. సారీ!
పెర్త్: బాల్ ట్యాంపరింగ్ వివాదంలో తొమ్మిది నెలలపాటు నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా టెస్టు ఓపెనర్ కామెరాన్ బెన్‌క్రాఫ్ట్.. తాను తప్పు చేసినట్టు అంగీకరించాడు. బాల్ ట్యాంపరింగ్ చేసేందుకు ప్రయత్నించిన మాట వాస్తవమేనని, కానీ భయపడి.. ఆ విషయంలో అబద్ధం చెప్పానని తెలిపాడు. తాను అలా చేసి ఉండాల్సింది కాదని, ఈ తప్పు తనను జీవితాంతం వెంటాడుతుందని అతను కన్నీటి పర్యంతమవుతూ చెప్పాడు. కెప్టౌన్లో దక్షిణాఫ్రికాతో మూడోటెస్టు సందర్భంగా సాండ్ పేపర్‌తో బాల్ ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించి.. బెన్‌క్రాఫ్ట్ అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తోపాటు బెన్క్రాఫ్ట్పైనా క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలు తీసుకుంది. బెన్క్రాఫ్ట్ను 9 నెలలపాటు దేశీయ, అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధించింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధంతరంగా స్వదేశం తిరిగొచ్చిన బెన్‌క్రాఫ్ట్ పెర్త్‌లో మీడియాతో మాట్లాడాడు. బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినందుకు దేశ ప్రజలకు, క్రికెట్ అభిమానులకు బెన్‌క్రాఫ్ట్ క్షమాపణలు చెప్పాడు. జరిగిన తప్పు పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. క్రికెట్ అంటే తనకు ఎంతో ఇష్టమని, దేశం తరఫున, తన రాష్ట్రం తరఫున ఆడటం కన్నా గొప్ప గౌరవం తనకు మరోటి లేదని చెప్పాడు. గత ఐదురోజులుగా జరిగిన పరిణామాలు వివరిస్తూ.. బెన్‌క్రాఫ్ట్ కన్నీటిపర్యంతమయ్యాడు. తాను చేసిన తప్పు దేశ ప్రజలను, క్రికెట్ కమ్యూనిటీ తలదించుకునేలా చేసిందని, ఈ తప్పు తనను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందని తెలిపాడు. -
ఆ ముగ్గురికి రెండో అవకాశం ఇవ్వండి...
ఎంతోమంది అభిమానుల నమ్మకాన్ని వమ్ము చేశాం. నా మనసు లోతుల్లోంచి వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను. నేను ఆ ముగ్గురి మానసిక పరిస్థితి గురించే (స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్) ఆందోళన చెందుతున్నాను. ప్రస్తుతం మేము ఆడుతున్న తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మళ్లీ అభిమానుల మద్దతు, అభిమానం సంపాదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ తీవ్రమైన తప్పిదమే చేశారు. అయితే వాళ్లు చెడ్డవాళ్లు మాత్రం కాదు. అభిమానులు వారికి రెండో అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. -
కోట్లు పోతున్నాయి
ట్యాంపరింగ్‌తో పరువు ఎలాగూ పోయింది...ఏడాది పాటు బ్యాట్‌ను ఇంట్లో మూలన పెట్టేయాల్సిందే... కానీ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లకు వీటితో పాటు ఆర్థికపరంగా కూడా భారీ స్థాయిలో నష్టం జరగనుంది. ఆటపరంగా, ఆర్జనపరంగాఆస్ట్రేలియా క్రికెట్లో తొలి రెండు స్థానాల్లో ఉన్నవీరిద్దరిపై తాజా పరిణామాలతో పెద్ద దెబ్బే పడబోతోంది. ఐపీఎల్‌కు దూరం కావడంతో పెద్ద మొత్తం కోల్పోయిన వీరిద్దరు సంవత్సరం పాటు ఇతర మ్యాచ్ ఫీజుల డబ్బులు కూడాపోగొట్టుకుంటారు. అన్నింటికి మించి వ్యక్తిగత స్పాన్సర్షిప్ ఒప్పందాలు దూరం కావడం వల్ల జరిగే నష్టం కూడా చాలా పెద్దది. సాక్షి క్రీడా విభాగం: ఆస్ట్రేలియా జట్టు రాబోయే షెడ్యూల్‌ను బట్టి చూస్తే సంవత్సర కాలంలో ఆ జట్టు 12 టెస్టులు, 26 వన్డేలు, 10 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడబోతోంది. కచ్చితంగా మూడు ఫార్మాట్లలో కూడా తుది జట్టులో ఉండగలిగే స్మిత్, వార్నర్ ఈ మ్యాచ్‌లు అన్నింటికీ దూరమవుతున్నారు. ఇంగ్లండ్ పర్యటన (ఐదు వన్డేలు, ఒక టి20), పాకిస్తాన్‌తో యూఈఏలో సిరీస్ (3 టెస్టులు), స్వదేశంలో దక్షిణాఫ్రికా (ఐదు వన్డేలు, 3 టి20లు), భారత్ (నాలుగు టెస్టులు) ఇందులో అతి ప్రధానమైనవి. ఇవి కాకుండా బంగ్లాదేశ్, శ్రీలంక, న్యూజిలాండ్‌లతో జరిగే సిరీస్‌లకు కూడా వీరిద్దరు దూరం కానున్నారు. ఐపీఎల్ దెబ్బ... స్మిత్‌ను రాజస్తాన్ రాయల్స్, వార్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలానికి ముందు తమతో అట్టి పెట్టుకున్నాయి. నిబంధనల ప్రకారం ఇద్దరిని చెరో రూ. 12 కోట్ల మొత్తానికి ఆయా ఫ్రాంచైజీలు ఉంచుకున్నాయి. స్మిత్ బ్యాటింగ్‌కంటే కూడా అతని నాయకత్వ ప్రతిభకారణంగానే రాయల్స్ ఎంచుకుందనేది వాస్తవం. 45 రోజుల వ్యవధిలో అతను ఇంత పెద్ద మొత్తం కోల్పోతున్నాడు. మరోవైపు 2016లో జట్టును చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌గా వార్నర్‌కు సన్‌రైజర్స్ ప్రత్యేక విలువ ఇచ్చింది. అందుకే కెప్టెన్‌గా తొలగించడంలో తొందర పడలేదు. బ్యాట్స్‌మన్‌గానైనా అతడిని ఆడించాలనే ఆలోచనే చివరి నిమిషం వరకు కూడా వారిలో కనిపించింది. అయితే నేరుగా బీసీసీఐ అడ్డు చెప్పడంతో మరో అవకాశం లేకుండా పోయింది. కాంట్రాక్ట్ మొత్తమూ... ప్రస్తుతం స్మిత్, వార్నర్ మ్యాచ్ ఫీజు రూపంలో ఆసీస్ బోర్డు నుంచి చెరో 5 లక్షల 80 వేల ఆస్ట్రేలియా డాలర్లు తీసుకుంటున్నారు. వార్షిక కాంట్రాక్ట్ రూపంలో స్మిత్‌కు 15 లక్షల డాలర్లు, వార్నర్‌కు 8 లక్షల 16 వేల డాలర్లు లభిస్తున్నాయి. ఐపీఎల్ మొత్తంతో పాటు దీనిని కలిపితే స్మిత్ ఏడాదికి 45 లక్షల 80 వేల ఆసీస్ డాలర్లు, వార్నర్ 38 లక్షల 96 వేల ఆసీస్ డాలర్లు పోగొట్టుకుంటారు. మన కరెన్సీలో చూస్తే స్మిత్‌కు రూ. 22 కోట్ల 90 లక్షలు... వార్నర్‌కు రూ. 19 కోట్ల 48 లక్షల నష్టం జరగనుంది. ఏ రకంగా చూసినా మైదానంలో ఆట ద్వారా దక్కే ఆర్జనను వీరు భారీగా కోల్పోయినట్లే లెక్క. స్పాన్సర్లూ వెనక్కి... ట్యాంపరింగ్‌తో దేశ ప్రజలందరి దృష్టిలో విలన్లుగా మారిన క్రికెటర్లతో అనుబంధం కొనసాగించడం ఏ సంస్థకైనా కష్టమే. బ్రాండ్ అంబాసిడర్లుగా తమ ఉత్పత్తుల స్థాయిని పెంచాల్సినవాళ్లు చేసిన పనితో తమ ప్రతిష్ట ఇంకా దెబ్బ తినవచ్చని వారు భయపడటం సహజం. అందుకే ఇప్పుడు వీరిద్దరి స్పాన్సర్లలో ఎంత మంది కొనసాగుతారో చెప్పడం కష్టం. వార్నర్‌తో ఒప్పందం పునరుద్ధరించుకోబోమని ఎల్జీ ఇప్పటికే ప్రకటించింది. అతనికి నెస్లే మైలో, టయోటా, అసిక్స్, గ్రే నికోల్స్‌తో ఒప్పందం ఉంది. స్మిత్‌కు న్యూ బ్యాలెన్స్ ప్రధాన స్పాన్సర్ కాగా...జిల్లెట్, ఫిట్‌బిట్, వీట్ బిక్స్ తదితర సంస్థలతో పెద్ద ఒప్పందాలు ఉన్నాయి. క్రికెట్‌పరంగా కోల్పోయే డబ్బుతో పాటు ఇవన్నీ కూడా జత కలిస్తే ట్యాంపరింగ్ వీరిద్దరిపై ఎంత ప్రభావం చూపించబోతోందో అర్థమవుతుంది. ఇందుకే వారికి శిక్ష తమ ప్రవర్తనా నియమావళిలోని 2.3.5 నిబంధనను ఉల్లంఘించినందుకే ముగ్గురు ఆటగాళ్లపై చర్యలు తీసుకున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ప్రధానంగా నాలుగు అంశాలను ఇందులో ప్రస్తావించింది. అవి 1) క్రీడా స్ఫూర్తిని దెబ్బతీయడం 2) స్థాయికి తగినట్లు ప్రవర్తించకపోవడం 3)క్రికెట్ ప్రయోజనాలకు హాని కలిగించడం 4) ఆటను వివాదాస్పదం చేయడం. వీటితోపాటు ఆటగాళ్లు వ్యక్తిగతంగా చేసిన తప్పులనూ పేర్కొంది. దాని ప్రకారం ఎవరెలా అంటే... స్టీవ్ స్మిత్: 1. బంతి ఆకారాన్ని కృత్రిమంగా మార్చే ఆలోచన గురించి ఇతడికి తెలుసు. 2. ట్యాంపరింగ్ ప్రణాళిక అమలు కాకుండా నిరోధించలేదు. 3. ట్యాంపరింగ్‌కు వాడిన వస్తువును మైదానంలో దాచి ఉంచేందుకు ప్రయత్నించడం. 4. బాన్‌క్రాఫ్ట్ ప్రయత్నాలపై మ్యాచ్ అఫీషియల్స్, ఇతరులను తప్పుదారి పట్టించడం. 5. పరిస్థితిపై తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలతో పాటు ప్లాన్‌ను పొడిగించి, అందులో అందరినీ భాగస్వాములుగా చేసేందుకు ప్రయత్నించడం. డేవిడ్ వార్నర్: 1. ట్యాంపరింగ్ ఆలోచనను రూపొందించడం. 2. బంతి ఆకారం దెబ్బతీసేలా జూనియర్ ఆటగాడికి సూచనలు చేయడం. 3. బంతి స్వరూపాన్ని ఎలా మార్చవచ్చో సలహాలివ్వడంతో పాటు వివరించి చూపడం. 4. ప్లాన్ అమలును నిరోధించడంలో విఫలమవడం. 5. తన పరిజ్ఞానంతో మ్యాచ్ అధికారులను తప్పుదోవ పట్టించడం, ట్యాంపరింగ్‌లో భాగం కావడం. 6. మ్యాచ్ అనంతరం కూడా తన ఆలోచనను స్వచ్ఛందంగా వెల్లడించకపోవడం. బాన్‌క్రాఫ్ట్: 1. శాండ్ పేపర్‌తో బంతి ఆకారాన్ని దెబ్బతీసే ఆలోచనలో నేరుగా పాల్గొనడం. 2. ట్యాంపరింగ్ ప్రయత్నాన్ని కొనసాగించడం 3. తన దగ్గర ఉన్న వస్తువును దాచి ఉంచేందుకు ప్రయత్నించడం. 4. మ్యాచ్ అధికారులు, ఇతరులను తప్పుదారి పట్టించడం. 5. పరిస్థితిపై తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం. -
నిజాయతీగా ఆడాలని నేను నమ్ముతాను..
అంతా ఊహించిందే జరిగింది. బాల్ ట్యాంపరింగ్ దుశ్చర్య స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరూన్ బాన్‌క్రాఫ్ట్‌ల కెరీర్‌కు చుట్టుకుంది. ఈ ఘటనలో వీరిని దోషులుగా తేల్చిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)... బుధవారం చర్యలను ప్రకటించింది. స్మిత్,వార్నర్‌లపై 12 నెలలు, బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధించింది. ఆ తర్వాత స్మిత్ మరో ఏడాది పాటు కెప్టెన్సీ చేపట్టేందుకూ వీల్లేకుండా,వార్నర్‌ను శాశ్వతంగా కెప్టెన్, వైస్ కెప్టెన్ పదవులకు అనర్హుడిగా పేర్కొంటూ ఆదేశాలిచ్చింది. స్మిత్ ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ సారథ్యం వదులుకోగా...సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ నుంచి వార్నర్ తప్పుకొన్నాడు. నిషేధంపై వీరు ముగ్గురు అప్పీల్ చేసుకునేందుకు వారం గడువు ఇచ్చారు. దక్షిణాఫ్రికాతో చివరిదైన నాలుగో టెస్టులో వీరి స్థానాలను ఓపెనర్లు జో బర్న్స్, మ్యాట్ రెన్షా, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మ్యాక్స్‌వెల్ భర్తీ చేయనున్నారు. వికెట్ కీపర్ టిమ్ పైన్ సారథ్యం వహించనున్నాడు. సిడ్నీ: తమ ప్రవర్తనా నియమావళిలోని 2.3.5 నిబంధనలను అతిక్రమించినందుకు ముగ్గురు ఆటగాళ్లపై తగిన చర్యలు తీసుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. దీనిప్రకారం స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఏడాది పాటు, బాన్‌క్రాఫ్ట్ 9 నెలలు అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించింది. దీంతోపాటు వంద గంటల పాటు స్వచ్ఛంద సేవ చేయాలని సూచించింది. అయితే... క్రికెట్‌తో సంబంధాలు పూర్తిగా తెగిపోకుండా వీరు క్లబ్ క్రికెట్ ఆడుకునేందుకు అనుమతించింది. నిషేధం ముగిసిన 12 నెలల అనంతరం కూడా స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లను కెప్టెన్సీకి పరిగణనలోకి తీసుకోమని సీఏ పేర్కొంది. ఆ తర్వాత బాధ్యతలు అప్పగించే విషయం ఇతర ఆటగాళ్లు, అభిమానుల అభిప్రాయాల మేరకు ఉంటుందని వివరించింది. వార్నర్‌కు భవిష్యత్‌లో ఎప్పటికీ సారథ్యం దక్కదని స్పష్టం చేసింది. అసలేం జరుగుతోంది? బాన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడుతుండటాన్ని తెరపై చూసిన కోచ్ డారెన్ లీమన్... వాకీటాకీలో హ్యాండ్స్కోంబ్తో ఏమని మాట్లాడాడో క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ జేమ్స్ సదర్లాండ్ వెల్లడించారు. ఆ సందర్భంగా లీమన్... ‘ఏం జరుగుతోంది అక్కడ?’ అంటూ హ్యాండ్స్‌కోంబ్‌ను ప్రశ్నించాడని సదర్లాండ్ తెలిపారు. టీ విరామంలో డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చిన ఆటగాళ్లనూ అతడు ఇదే ప్రశ్న అడిగాడని వివరించారు. విచారణ నివేదికలోనూ ఇదే విషయం ఉండటంతో ట్యాంపరింగ్‌లో లీమన్ పాత్ర ఏమీ లేదని స్పష్టమైంది. ఈ కారణంగానే అతడిపై చర్యలకు అవకాశం లేకుండా పోయింది. క్రికెట్‌కు జెంటిల్మన్ గేమ్‌గా గుర్తింపు ఉంది. నిజాయతీగా ఆడాలని నేను నమ్ముతాను. జరిగిన ఘటన దురదృష్టకరం. అయితే క్రికెట్ సమగ్రతను కాపాడేందుకు సరైన నిర్ణయమే తీసుకున్నారు. గెలవడం ముఖ్యమే కానీ ఎలా గెలిచారనేది కూడా అంతకంటే ముఖ్యం. –సచిన్ టెండూల్కర్ అన్ని కోణాల్లో విచారించాం. తప్పు చేసిన ఆటగాళ్లకు ఈ శిక్షలు సరైనవే. క్రికెట్ కీర్తి, స్ఫూర్తి నిలిపేందుకు తీసుకున్న ఈ చర్యలతో నేను సంతృప్తి చెందాను. దీని నుంచి అందరూ పాఠాలు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. మా పురుషుల జట్టులోని సంస్కృతి, ఆటగాళ్ల ప్రవర్తన స్వీయ సమీక్ష చేసుకుంటాం. – సీఏ సీఈవో జేమ్స్ సదర్లాండ్ భావోద్వేగాలను కాస్త పక్కనపెట్టి ఆలోచిద్దాం. అవసరం లేకపోయినా ఒకరిని నష్టపరచడం సరైంది కాదు. వారు చేసిన చర్యను సమర్థించుకోలేరు. కానీ ఏడాది నిషేధం అనేది సరైంది కాదు. నా దృష్టిలో ఒక టెస్టు నిషేధం, కెప్టెన్, వైస్ కెప్టెన్ పదవులనుంచి ఉద్వాసన, భారీ జరిమానాలే సరైన శిక్ష. ఆ తర్వాత వారు ఆడేందుకు అనుమతించాల్సింది. – షేన్‌వార్న్ ఐపీఎల్ నుంచీ తప్పించారు... న్యూఢిల్లీ: తమ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఏడాది నిషేధం విధించిన నేపథ్యంలో బీసీసీఐ కూడా స్పందించింది. వారిని ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరం పెడుతూ నిర్ణయం తీసుకుంది. లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లా బుధవారం ఈ మేరకు మీడియాకు తెలిపారు. ‘మొదట ఐసీసీ నిర్ణయం కోసం వేచి చూశాం. తర్వాత సీఏ ఏం చర్యలు తీసుకుంటుందో గమనించాం. ఇప్పుడు మా వంతుగా ఆలోచించి దీనిని ప్రకటించాం. వీరి స్థానాలను భర్తీ చేసుకునే అవకాశం ఫ్రాంచైజీలకు ఉంది’ అని ఆయన వివరించారు. మరోవైపు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్ష, కార్యదర్శులు సీకే ఖన్నా, అమితాబ్ చౌధరి, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లాలతో సంప్రదించిన తర్వాత స్మిత్, వార్నర్‌లను లీగ్ నుంచి పక్కనపెట్టినట్లు సీఓఏ పేర్కొంది. -
ట్యాంపరింగ్: పట్టించింది డివిలియర్సే.!
కేప్‌టౌన్ : ఆస్ట్రేలియా ఆటగాళ్ల బాల్ ట్యాంపరింగ్ వివాదం అంతర్జాతీయ క్రికెట్లో తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ జరుగుతుండగా.. అందరూ ఆటపై నిమగ్నమైన వేళ ఒక ఆటగాడి కదలికలపై కన్నేసి, ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నట్టు ప్రపంచానికి తెలిసేలా చేసింది మాత్రం దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఫానీ డివిలియర్స్. తాను ఆడుతున్న రోజుల్లోనే ఆసీస్ పని పట్టిన ఈ మాజీ పేస్ బౌలర్ తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆసీస్ ఆటగాళ్ల తొండాటను ప్రపంచానికి తెలియ జేశాడు. సాధారణంగా బంతి పాత బడిన తర్వాతే రివర్స్ స్వింగ్ చేయాడానికి వీలుంటుంది. కానీ ఆసీస్ మాత్రం 30 ఓవర్లలోపే కష్టతరమైన పచ్చిక మైదానంపై రివర్స్ స్వింగ్ చేయడం డివిలియర్స్‌కు అనుమానం వచ్చేలా చేసింది. వెంటనే కెమరామెన్లను అప్రమత్తంచేసి ఆసీస్ ఆటగాళ్లపై నిఘా పెట్టమని సూచించాడు. అప్పటికే ఫీల్డ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ సైతం అంపైర్లకు ఫిర్యాదు చేయడంతో వారు బెన్‌క్రాఫ్ట్ వివరణ కోరారు. ఆ సమయంలో బెన్ క్రాఫ్ట్ అలాంటిదేమి లేదని, సన్ గ్లాస్ కవర్ అని బుకాయించే యత్నం చేశాడు. దీంతో అంపైర్లు బంతిని మార్చకుండా, పెనాల్టీ పరుగులు విధించకుండా మ్యాచ్‌ను కొనసాగించారు. అయితే బెన్ క్రాఫ్ట్ అంపైర్లకు చూపించింది, అతని ప్యాంట్లో దాచిన వస్తువు వేరు కావడంతో డివిలియర్స్ వ్యక్తం చేసిన అనుమానం నిజమయింది. దీంతో ఆసీస్ ఆటగాళ్ల ట్యాంపరింగ్ వెలుగులోకి వచ్చింది. మ్యాచ్‌ను 30 కెమెరాలతో కవరేజ్ చేసామని, ట్యాంపరింగ్ యత్నం జరుగుతందని డివిలియర్స్ తమకు చెప్పగానే మరో ఏడు కెమెరాలతో ప్రత్యేకంగా బంతిపైనే నిఘా ఉంచామని మ్యాచ్ ప్రసారం చేసిన టెలివిజన్ అధికారి ఒకరు తెలిపారు. -
ట్యాంపరింగ్; ఆ ముగ్గురిపై ఏడాది నిషేధం!
జొహన్నెస్‌బర్గ్/కాన్బెరా: బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, కామెరూన్ బెన్‌క్రాఫ్ట్, డేవిడ్ వార్నర్‌లపై ఏడాది నిషేధం విధించనున్నారా, ప్రధాన కోచ్ డారెన్ లీమన్ తక్షణమే పదవి నుంచి తప్పుకుంటారా అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. మంగళవారం ఆస్ట్రేలియన్ ప్రధాన మీడియా నిండా ఇవే కథనాలు. ట్యాంపరింగ్ వ్యవహారాన్ని తేలికగా తీసుకోవద్దన్న ప్రధాని టర్న్‌బుల్ సూచన మేరకు ఆస్ట్రేలియా క్రికెట్(సీఏ).. స్మిత్, వార్నర్, బెన్‌క్రాఫ్ట్‌లపై కొరడా ఝుళిపించడం ఖాయమని, నాలుగో టెస్టు ప్రారంభానికి ముందే లీమన్ రాజీనామా చేస్తాడని సర్వత్రా చర్చజరుగుతోంది. ఇప్పటికే సౌతాఫ్రికాకు వచ్చి ఆటగాళ్లను విచారిస్తోన్న సీఏ బృందం.. మంగళవారమే తన రిపోర్టును సమర్పించనున్న నేపథ్యంలో నిషేధం వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఐసీసీ చేయనిది సీఏ చేస్తుంది: నిబంధనలకు విరుద్ధంగా బంతి ఆకారాన్ని మార్చి ప్రత్యర్థిని దెబ్బతీయాలనే కుట్ర చేయడమేకాక, అది సమిష్టి నిర్ణయమని చెప్పిన ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అరకొర చర్యలతో సరిపెట్టడం దుమారాన్ని రేపుతోంది. అంతపెద్ద తప్పుకు ఇంత చిన్న శిక్ష ఏమిటనే సందేశాలు వ్యక్తమవుతున్నాయి. తన చేతులతో ట్యాంపర్ చేసిన బెన్‌క్రాఫ్ట్‌పై వేటు పడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఐతే, ఆటగాళ్లను శిక్షించడంలో ఐసీసీ చేయనిది సీఏ తప్పక చేస్తుందని ఆసీస్ మీడియా తెలిపింది. క్రికెట్ నిబంధనలను రూపొందించే మెల్బోర్న్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) సైతం ట్యాంపరింగ్ ఉదంతంపై ఘాటుగా స్పందించింది. ఆసీస్ ప్లేయర్లను కఠినంగా శిక్షించాల్సిందేనని, అలా చేస్తేనే జెంటిల్మన్ గేమ్ పట్ల భవిష్యత్ తరాలకు మంచి సందేశం ఇచ్చినట్లు అవుతుందని ఎంసీసీ ఉపకార్యదర్శి జాన్ స్టీఫెన్సన్ అభిప్రాయపడ్డారు. కుట్రలో హెడ్ కోచ్ పాత్ర ఏంటి?: జట్టు సభ్యులంతా ముందే చర్చించుకుని ట్యాంపరింగ్ కుట్రను అమలు చేసినట్లు చెప్పుకొచ్చిన స్మిత్.. ఇందులో కోచింగ్ స్టాఫ్ ప్రమేయమేది లేదని అన్నాడు. కాగా, స్మిత్ చెప్పినదాంట్లో అర్థంలేదని ఆసీస్ మాజీ కెప్టెన్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. ‘‘కుట్రలో కోచ్ లీమన్‌కు ప్రమేయం లేదంటే.. జట్టుపై అతనికి పట్టులేనట్టు అర్థం. ఒకవేళ ప్రమేయం ఉందని తేలితే ఆటగాళ్లతోపాటు అతనూ దోషే అవుతాడు. ఈ రెండు సందర్భాల్లోనూ లీమన్ తప్పుచేసినవాడే అవుతాడు’’ అని క్లార్క్ వ్యాఖ్యానించాడు. -
ట్యాంపరింగ్: బయటపడ్డ మరో నిజం
అనూహ్యంగా బయటపడిన బాల్ ట్యాంపరింగ్ వివాదం పెద్ద కుదుపులకే దారి తీస్తోంది. గత రెండు రోజులు నుంచి అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై జీవితకాల నిషేధం వంటి మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ ఆటగాడు కెమరాన్ బెన్ క్రాప్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన వీడియో వైరల్ కావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతిష్ట మసకబారింది. ఈ నేపథ్యంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏకంగా ఆ దేశ ప్రధాని మార్కమ్ టర్న్‌బుల్ ఆదేశించారు. దీంతో ఈ ఘటనకు సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ చేపడుతోంది. ఇదిలా ఉండగా తాజాగా బయటపడిన ఓ వీడియో ఆస్ట్రేలియా క్రికెట్‌ను మరింత వివాదంలోకి నెట్టింది. గత జనవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్‌లోనూ కెమరాన్ బెన్ క్రాప్ట్ బాల్ టాంపరింగ్ చేసినట్టు అనుమానం కలిగిలే ఓ వీడియా ఇప్పుడు బయటకొచ్చింది. అందులో బెన్ క్రాప్ట్ ఓ స్పూన్‌తో చక్కెర తీసుకుని ప్యాంటు పోకెట్లో వేసుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. దీంతో బెన్ క్రాప్ట్ చక్కెరతో బంతి షేప్‌ను మార్చే ప్రయత్నం చేశాడా అన్న సందేశాలు కలుగుతున్నాయి. సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయినట్టుగా భావిస్తున్నఈ వీడియోను ఓ ఇంగ్లీష్ వెబ్సైట్ ప్రచురించగా, ద సన్ రిపోర్టర్ డేవిడ్ కవర్‌డేల్ తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. తాజా ఘటనతో క్రికెట్ అభిమానులు నివ్వెరపోతున్నారు. అయితే తన కెప్టెన్సీలో ఇలాంటి సంఘటనలు జరగడం మొదటిసారి అని చెప్పిన స్టీవ్ స్మిత్ మాటలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
యాషెస్ సిరీస్‌లోనూ బాల్ ట్యాంపరింగ్?
-
వాళ్లకు తెలియకుండానే జరిగిందా?
సాక్షి, స్పోర్ట్స్ : గత రెండు రోజులుగా క్రికెట్ అభిమానులను కలవరపాటుకు గురిచేస్తున్న బాల్ ట్యాంపరింగ్ వివాదంపై పలువురు క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ‘వ్యక్తిని బట్టి, ప్రాతినిథ్య జట్టును బట్టి శిక్షలు ఖారారు చేయడం ఐసీసీ తీరును తెలియజేస్తుంది.. వారెవ్వా ఐసీసీ’ అంటూ హర్భజన్ మండిపడిన విషయం తెలిసిందే. తాజాగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, దిగ్గజ ఆటగాడు కెవిన్ పీటర్సన్ కూడా ఈ వివాదంపై స్పందించాడు. ‘కోచ్‌తో సహా ఆటగాళ్లంతా కలిసి క్రికెట్‌ను ఎంతగానో ప్రేమించే ఆస్ట్రేలియాను, టెస్ట్ క్రికెట్‌ను అవమానపరిచారు. మీరు చేసిన ఈ పని ఏమాత్రం సరైంది కాదు. జట్టు కోచ్ లీమన్, బౌలింగ్ కోచ్ డేవిడ్ సాకర్‌కు తెలియకుండానే ఇదంతా జరిగిందా? వీరిద్దరిపై కూడా చర్యలు తీసుకోవాల’ని పీటర్సన్ ట్వీట్ చేశాడు. కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ వార్నర్‌లకు క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే ఉద్వాసన పలికింది. కాగా ఈ వివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్లాండ్ ఆస్ట్రేలియా అభిమానులకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. పరువు తీసేలా ప్రవర్తించకండి: ఏఎస్సీ ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కమిషన్ అధికారి జాన్ వీలీ, బోర్డు సీఈఓ కేట్ పామర్ మాట్లాడుతూ.. ఏ ఆటలోనైనా మోసానికి పాల్పడితే ఒప్పుకోబోమని, బాల్ ట్యాంపరింగ్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కెప్టెన్ స్టీవ్ స్మిత్, కోచ్, సహాయ సిబ్బందితో పాటు, జట్టులోని ఇతర సభ్యులెవరైనా సీఏ ముందు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ అంశంలో ఎవరెవరు భాగమై ఉన్నారనేది తెలుకోవాల్సి ఉందని ఏఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆస్ట్రేలియా అథ్లెట్లు, ఇతర జట్లు అన్నీ నిజాయితీగా వ్యవహరించాలని.. క్రీడాస్ఫూర్తి కలిగి ఉండాలని కోరింది. Anyone heard from Lehmann? Saker? That’s Head Coach & Bowling Coach. Pretty instrumental in all of this... — Kevin Pietersen (@KP24) March 25, 2018 Slept on it...Lehmann, Saker & the leaderships groups jobs are untenable! They’ve disgraced a great cricketing nation & Test cricket! — Kevin Pietersen (@KP24) March 25, 2018