
బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో తొమ్మిది నెలల పాటు ఆటకు దూరమైన సమయంలో యోగా తన జీవితంలో కీలక పాత్ర పోషించిందని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ అన్నాడు. బహిష్కరణ వేటు పడ్డాక తన దృక్పథం పూర్తిగా మారిపోయిందని... ఒక దశలో క్రికెట్ వదిలేసి యోగా టీచర్‌గా మారిపోదామని అనుకున్నానని తెలిపాడు.
తాను క్రికెటర్‌ననే భావన నుంచి బయటకు వచ్చి కొత్తగా ఆలోచించే విషయంలో యోగా మరచిపోలేని అనుభవాన్నిచ్చిందని అతను చెప్పుకొచ్చాడు. డిసెంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న బిగ్ బాష్ టి20 లీగ్‌తో బాన్‌క్రాఫ్ట్ క్రికెట్‌లోకి పునఃప్రవేశం చేయనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment