సిడ్నీ: ఇటీవలే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కొత్త కోచ్‌గా నియమితులైన జస్టిన్ లాంగర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆసీస్ క్రికెటర్ బాన్ క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్ వివాదాన్ని ప్రస్తావిస్తూ.. అతని స్థానంలో తానున్నా కచ్చితంగా మోసం చేసేవాడినన్నాడు. తాను ఆడే సమయంలో సీనియర్ క్రికెటర్లు మోసం చేయమని ఆదేశిస్తే అది తప్పకుండా చేసే వాడినని చెప్పాడు. దీనిలో భాగంగా అలెన్ బోర్డర్, స్టీవ్ వా, డేవిడ్ బూన్, ఇయాన్ హేలీ, బాబీ సింప్సన్ తదితరులతో డ్రెసింగ్ రూమ్ విషయాలని లాంగర్ షేర్ చేసుకున్నాడు.
అలెన్ బోర్డర్ వంటి సీనియర్ ఆటగాళ్లు తనను కనుక బంతిని ట్యాంపరింగ్ చేయమని అడిగి ఉంటే యువ ఆటగాడిగా తాను ఆ పని చేసి ఉండేవాడినని పేర్కొన్నాడు. అయితే ట్యాంపరింగ్ అంటే బోర్డర్‌కు కూడా భయమేనని, అలా చేయడానికి ఆయన ఎప్పుడూ ఇష్టపడలేదన్నాడు. ఇక ట్యాంపరింగ్ పాల్పడిన ఏ ఆటగాడ్ని క్షమించే గుణం బాబీ సింప్సన్‌కు లేదన్నారు. కొన్ని నెలల క్రితం దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో బాల్ ట్యాంపరింగ్ ఘటనలో డేవిడ్ వార్నర్ అడగడంతో బాన్ క్రాఫ్ట్ బంతిని ట్యాంపర్ చేసిన సంగతి తెలిసిందే. నూతన కోచ్ లాంగర్ చేసిన వ్యాఖ్యలు.. వార్నర్, స్మిత్‌ల వ్యవహార శైలిని పరోక్షంగా తప్పుబడుతున్నట్లు ఉండగా, క్రాఫ్ట్‌కు మద్దతుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment