మెల్‌బోర్న్: తమ దేశ క్రికెట్‌ను కుదిపేసిన ట్యాంపరింగ్ వివాదం ముగిసిపోయిన అధ్యాయమని, మళ్లీ ఇప్పుడు దానిపై పదే పదే చర్చించుకోవడం అనవసరమైన సబ్జెక్ట్ అని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ పేర్కొన్నాడు. ట్యాంపరింగ్ కారణంగా నిషేధం ఎదుర్కొంటున్న స్టీవ్ స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లు ఇటీవల మీడియాకు ముందుకొచ్చి తమకు ఏ తప్పు తెలియదంటూ మొత్తం నెపాన్ని డేవిడ్ వార్నర్‌పై నెట్టివేసే యత్నం చేశారు. ఆ ట్యాంపరింగ్ వివాదానికి డేవిడ్ వార్నరే కారణమంటూ ఫాక్స్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఇప్పటికే స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌ల తీరును పలువురు మాజీలు తప్పుబట్టగా, తాజాగా కోచ్ లాంగర్ సైతం పెదవి విప్పాడు. ఒక చేదు జ్ఞాపకాన్ని వదిలేయకుండా ఒక సీరియల్ డ్రామాలా సాగదీస్తున్నారంటూ ధ్వజమెత్తాడు. స్మిత్, బాన్‌క్రాఫ్ట్ వ్యాఖ్యలు చూస్తే ఆ డ్రామాకు తానొక డైరక్టర్‌నా అనే భావన కలుగుతుందన్నాడు. ఆ ఇంటర్య్వూ తర్వాత మరొక చికాకును స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లు తెచ్చిపెట్టారంటూ మండిపడ్డాడు. ఇదిలా ఉంచితే, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు పునరాగమనం చేసే వరకు టిమ్ పైన్, అరోన్ ఫించ్‌లు తమ వేర్వేరు జట్లకు కెప్టెన్లగా కొనసాగుతారని లాంగర్ స్పష్టం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment