
మెల్‌బోర్న్: బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి నిషేధం ఎదుర్కొంటున్న స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌ల శిక్ష విషయంలో మరో మాటకు తావు లేదని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) స్పష్టం చేసింది. వారిద్దరితో పాటు బాన్‌క్రాఫ్ట్ శిక్షా కాలాన్ని తగ్గించాలంటూ ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం (ఏసీఏ) నుంచి పదే పదే వస్తున్న విజ్ఞప్తులపై సీఏ వివరణ ఇచ్చింది. ఈ అంశంపై సోమవారం ప్రత్యేకంగా సమావేశమైన సీఏ... ముగ్గురు క్రికెటర్లపై ముందుగా ప్రకటించిన శిక్షలు కొనసాగుతాయని ప్రకటించింది.
ముందుగానే మైదానంలోకి దిగేందుకు వారికి అనుమతి ఇచ్చే ప్రశ్నే లేదని సీఏ తాత్కాలిక చైర్మన్ ఎర్ల్ ఎడింగ్స్ చెప్పారు. ఫలితంగా 2019 మార్చి వరకు స్మిత్, వార్నర్ ఆడే అవకాశం లేకపోగా, ఈ ఏడాది డిసెంబర్‌తో బాన్‌క్రాఫ్ట్‌పై నిషేధం ముగుస్తుంది. ‘అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని విచారణ చేసిన తర్వాతే ఈ ముగ్గురు ఆటగాళ్లకు సీఏ శిక్షలు విధించింది. వీటిని ఆటగాళ్లు కూడా అంగీకరించారు. మార్చడం సరైంది కాదు’అని ఎడింగ్స్ అన్నారు. జింబాబ్వే, యూఏఈపై ఆడిన 3 వన్డేలను మినహాయిస్తే గత 18 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా 2 మ్యాచ్‌లు మాత్రమే నెగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment