ball-tampering
-
నా కళ్ల ముందు ఇంత జరుగుతున్నా..
సిడ్నీ: బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో ఏడాది పాటు నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ మెలమెల్లగా ఆటకు చేరువవుతున్నాడు. ఇటీవలే బిగ్‌బాష్ లీగ్ ప్రచార వీడియోలో దర్శనమిచ్చిన అతను శుక్రవారం మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించాడు. ట్యాంపరింగ్ వివాదం తర్వాత స్వదేశం చేరుకొని ఉద్వేగభరితంగా మాట్లాడిన అతను... మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా నాటి ఘటనను మరో సారి గుర్తు చేసుకున్న స్మిత్ తన భవిష్యత్తు గురించి చెప్పాడు. ‘స్యాండ్ పేపర్‌తో ట్యాంపరింగ్ గురించి వార్నర్, బాన్‌క్రాఫ్ట్ చెబుతుంటే నేను పట్టించుకోకుండా వెళ్లిపోయాను. నిజానికి దానిని అక్కడే ఆపాల్సింది. కెప్టెన్‌గా అది నా వైఫల్యం. మైదానంలో కూడా మరో అవకాశం వచ్చింది. కనీసం అక్కడ కూడా దానిని ఆపలేకపోయాను. అదీ నా తప్పే. నా కళ్ల ముందు ఇంత జరుగుతున్నా ఏమీ చేయకుండా ఊరుకున్నాను కాబట్టే తప్పును అంగీకరించి శిక్షను అనుభవిస్తున్నాను. బయట ఏమో గాని ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఇలాంటిది జరగడం మాత్రం ఇదే మొదటిసారి’ అని స్మిత్ అన్నాడు. ఈ వివాదం తర్వాత కూడా వార్నర్‌తో తన సంబంధాలు బాగున్నాయని అతను స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన తర్వాత తన జీవితంలో చీకటి రోజులు గడిచాయని, అయితే సన్నిహితుల అండతో కోలుకోగలిగానని స్టీవ్ వెల్లడించాడు. వన్డే ప్రపంచకప్‌కు సన్నద్ధమయ్యేందుకు ఐపీఎల్ తనకు బాగా ఉపయోగపడుతుందని, వన్డేల్లో వేగం పెరిగిన నేపథ్యంలో టి20 తరహా ఆటతో సిద్ధం కావడం సరైందని స్మిత్ అభిప్రాయపడ్డాడు. భారత్, ఆస్ట్రేలియా సిరీస్‌ను బయటనుంచి చాలా కష్టంగా అనిపిస్తోందన్న స్మిత్... పెర్త్ టెస్టు ప్రదర్శనపై సంతోషంగా ఉందంటూ కెప్టెన్ టిమ్ పైన్‌పై ప్రశంసలు కురిపించాడు. -
నిషేధ కాలాన్ని తగ్గించేది లేదు
మెల్బోర్న్: బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి నిషేధం ఎదుర్కొంటున్న స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌ల శిక్ష విషయంలో మరో మాటకు తావు లేదని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) స్పష్టం చేసింది. వారిద్దరితో పాటు బాన్‌క్రాఫ్ట్ శిక్షా కాలాన్ని తగ్గించాలంటూ ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం (ఏసీఏ) నుంచి పదే పదే వస్తున్న విజ్ఞప్తులపై సీఏ వివరణ ఇచ్చింది. ఈ అంశంపై సోమవారం ప్రత్యేకంగా సమావేశమైన సీఏ... ముగ్గురు క్రికెటర్లపై ముందుగా ప్రకటించిన శిక్షలు కొనసాగుతాయని ప్రకటించింది. ముందుగానే మైదానంలోకి దిగేందుకు వారికి అనుమతి ఇచ్చే ప్రశ్నే లేదని సీఏ తాత్కాలిక చైర్మన్ ఎర్ల్ ఎడింగ్స్ చెప్పారు. ఫలితంగా 2019 మార్చి వరకు స్మిత్, వార్నర్ ఆడే అవకాశం లేకపోగా, ఈ ఏడాది డిసెంబర్‌తో బాన్‌క్రాఫ్ట్‌పై నిషేధం ముగుస్తుంది. ‘అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని విచారణ చేసిన తర్వాతే ఈ ముగ్గురు ఆటగాళ్లకు సీఏ శిక్షలు విధించింది. వీటిని ఆటగాళ్లు కూడా అంగీకరించారు. మార్చడం సరైంది కాదు’అని ఎడింగ్స్ అన్నారు. జింబాబ్వే, యూఏఈపై ఆడిన 3 వన్డేలను మినహాయిస్తే గత 18 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా 2 మ్యాచ్‌లు మాత్రమే నెగ్గింది. -
మా పరువు తీసేశారు : క్రికెటర్ ఆవేదన
సిడ్నీ : ఆస్ట్రేలియా క్రికెట్ పరువు తీసిన బాల్ ట్యాంపరింగ్ వివాదం విషయంలో మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ తీరును ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ తప్పుపట్టాడు. ఎలాగో ట్యాంపరింగ్ జరిగిపోయిందని, అప్పుడైనా తమ తప్పును స్మిత్, అందుకు సహకరించిన ఆసీస్ క్రికెటర్లు ఒప్పుకోక పోవడం దారుణమన్నాడు. ఈ కారణంగా ఆసీస్ జట్టును, ముఖ్యంగా సీనియర్ క్రికెటర్లైన నన్ను, హజెల్‌వుడ్, నాథన్ లయన్ లాంటి ప్లేయర్లు ట్యాంపరింగ్‌కు కారకులుగా భావించారని తెలిపాడు. వివాదం అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న స్టీవ్‌స్మిత్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌లు నిజాలు చెప్పి ఉంటే జట్టుకు కూడా మంచి జరిగేదన్నాడు. కానీ తప్పిదం చేసిన వారితో పాటు జట్టు మొత్తానికి కళంకం అంటించారని ఆవేదన వ్యక్తం చేశాడు. కార్పొరేట్ అడ్వైజర్ సూ కెటో సలహా ప్రకారం స్మిత్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొని.. కొన్ని వాస్తవాలు మాత్రమే వెల్లడించాడని పేర్కొన్నాడు. జట్టుతో పాటు మరో వర్గం కలిసి కొన్ని నిజాలు దాచిపెట్టడంతో అంతా నాశనమైందన్నాడు. ఇతర క్రికెటర్ల పేరు, ప్రఖ్యాతలు మంటకలిసిపోతాయని ఎందుకు ఆలోచించలేదంటూ స్మిత్, అతడి మద్దతుదారులను ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ప్రశ్నించాడు. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాపరింగ్‌కు యత్నించి అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. దీన్ని సీరియస్‌గా తీసుకున్న బోర్డు అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లపై ఏడాది నిషేధం విధించగా, ట్యాంపరింగ్‌కు యత్నించిన బాన్‌క్రాఫ్ట్‌ను 9 నెలలు నిషేధించారు. -
ఆ 4 రోజులు ఏడుస్తూనే ఉన్నా..!
సిడ్నీ: బాల్ ట్యాపరింగ్ కుంభకోణం వెలుగుచూసిన తర్వాత మొదటి నాలుగు రోజులు తాను ఏడుస్తూనే గడిపానని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నారు. క్రికెట్ ఆస్ట్రేలియాను కుదిపేసిన బ్యాల్ ట్యాంపరింగ్ వివాదంలో స్టీవ్ స్మిత్‌తోపాటు ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, కామెరాన్ బెన్‌క్రాఫ్ట్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. స్మిత్, వార్నర్ ఏడాది దేశీయ, అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా నిషేధించగా.. బెన్‌క్రాఫ్ట్‌పై 9నెలల నిషేధం విధించారు. అయితే, స్మిత్, వార్నర్ వచ్చే నెలలో జరగనున్న గ్లోబల్ టీ20 కెనడా లీగ్ అనే ప్రైవేటు టోర్నీలో పాలుపంచుకుంటున్నారు. టోరంటో నేషనల్స్ జట్టు తరఫున స్మిత్ ఆడనున్నాడు. ఈ టోర్నీలో తనకు లభించే మ్యాచ్ ఫీజును పూర్తిగా ఆస్ట్రేలియాలో క్రికెట్ అభివృద్ధికి విరాళంగా ఇవ్వనున్నట్టు స్మిత్ ప్రకటించాడు. ఈ సందర్భంగా సిడ్నీ నాక్స్ గ్రామర్ స్కూల్లో విద్యార్థులతో స్మిత్ మాట్లాడుతూ.. ‘నిజాయితీగా చెప్పాలంటే నాలుగు రోజులు నేను ఏడుస్తూనే ఉన్నాను. మానసికంగా నేను ఎంతో క్షోభ అనుభవించాను. కుటుంబసభ్యులు, స్నేహితులు ఆ సమయంలో నాకు ఎంతో అండగా నిలబడ్డారు. వాళ్లు రోజంతా నాతో మాట్లాడుతూ గడిపారు. వాళ్లు నాతో ఉండటం అదృష్టంగా భావిస్తున్నా. వాళ్లు ఇచ్చిన మద్దతు, నైతిక ధైర్యం కారణంగానే నేను ఇలా మీముందు నిలబడగలిగాను’ అని అన్నాడు. ఈ మేరకు అతడి మాటల ఆడియో టేపును సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక విడుదల చేసింది. స్మిత్, వార్నరే కాదు.. కీరన్ పొలార్డ్, క్రిస్ గేల్, అండ్రూ రస్సెల్, టిమ్ సౌథీ, షాహిద్ ఆప్రిదీ, సునీల్ నరైన్, క్రిస్ లిన్ వంటి ప్రముఖ ఆటగాళ్లు గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో ఆడుతున్నారు. టోర్నీలో ఆడబోయే జట్లు ఇవే.. టోరంటో నేషనల్స్: డారెన్ సమ్మీ, స్టీవ్ స్మిత్, కీరన్ పొల్లార్డ్, కమ్రాన్ అక్మల్, హుస్సేన్ తలత్, రుమాన్ రయిస్, నిఖిల్ దత్తా, జాన్సన్ చార్లెస్, కేస్రిర్ విలియమ్స్, నవిద్ అహ్మద్, నిజాకత్ ఖాన్, ఫర్హాన్ మాలిక్, నితీష్ కుమార్, ఒసామా మీర్, రోహన్ ముస్తఫా, మహ్మద్ ఘనీ. కోచ్: ఫిల్ సిమన్స్ వాంకోవర్ నైట్స్: క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్, ఎవిన్ లెవిస్, టిమ్ సౌథీ, చాడ్విక్ వాల్టన్, ఫవాద్ అహ్మద్, బాబర్ హయత్, షెల్డన్ కాట్రెల్, సాద్ బిన్ జాఫర్, రువిందు గుణశేఖర, శ్రీమంత విజేరత్న, కామౌ లెవరాక్, స్టీవెన్ జాకబ్స్, సల్మాన్ నాజర్, రస్సీ వాన్ డెర్ డుస్సేన్, జెరెమీ గోర్డాన్. కోచ్: డోనోవన్ మిల్లెర్ ఎడ్మంటన్ రాయల్స్: షాహిద్ ఆఫ్రిది, క్రిస్ లిన్, ల్యూక్ రాంచి, మహమ్మద్ ఇర్ఫాన్, సోహైల్ తన్వీర్, క్రిస్టియన్ జాంకర్, వేన్ పార్నెల్, ఆసిఫ్ ఆలీ, హసన్ ఖాన్, అఘా సల్మాన్, షాయ్మన్ అన్వర్, అమ్మార్ ఖలీద్, సత్సిమ్రంజిత్ ధిండ్సా, అహ్మద్ రజా, సైమన్ పర్వేజ్, అబ్రాష్ ఖాన్. కోచ్ : మహమ్మద్ అక్రం మాంట్రియల్ టైగర్స్: లసిత్ మలింగ, సునీల్ నరైన్, థిసరా పెరెరా, మహ్మద్ హఫీజ్, దినేష్ రామ్‌దిన్, సందీప్ లిమిచానె, సికందర్ రజా, దాసున్ శంక, ఇసురు ఉదాన, జార్జ్ వర్కర్, నజిబుల్లా జద్రాన్, సెసిల్ పర్వేజ్, ఇబ్రహీం ఖలీల్, డిల్లాన్ హెలింగర్, నికోలస్ కిర్టన్, రయాన్ పఠాన్ . కోచ్: టామ్ మూడీ విన్నిపెగ్ హాక్స్: డ్వేన్ బ్రేవో, డేవిడ్ మిల్లర్, డేవిడ్ వార్నర్, లెండిల్ సిమ్మన్స్, డారెన్ బ్రేవో, ఫిడేల్ ఎడ్వర్డ్స్, రయాద్ ఎమ్రిట్, బెన్ మెక్ డార్మట్, ఆలీ ఖాన్, హంజా తారిక్, జునైద్ సిద్ధిఖీ, టియాన్ వెబ్‌స్టర్, రిజ్వాన్ చీమా, హిరల్ పటేల్, మార్క్ డెయాల్, కైల్ ఫిలిప్ . కోచ్: వకార్ యూనిస్ -
స్టీవ్ స్మిత్‌కు డబుల్ షాక్!
-
కెప్టెన్సీ నుంచి స్మిత్‌కు ఉద్వాసన
-
దక్షిణాఫ్రికా బాల్ ట్యాంపరింగ్
దుబాయ్ : పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడు. శుక్రవారం మూడో రోజు ఆట సందర్భంగా అతను బంతిని ట్రౌజర్కున్న జిప్ మీద పలుమార్లు బలంగా రుద్దినట్లు టీవీ రీప్లేలో స్పష్టమైంది. దీంతో అంపైర్లు రాడ్ ఠక్కర్, ఇయాన్ గౌల్డ్లు కెప్టెన్ స్మిత్‌ను పిలిచి హెచ్చరించారు. దాంతో పాటు సఫారీ జట్టుకు జరిమానా విధిస్తూ పాక్ స్కోరుకు ఎక్స్‌ట్రాల రూపంలో ఐదు పరుగులు కలిపారు. రెండో ఇన్నింగ్స్‌లో 31వ ఓవర్‌కు ముందు ఈ సంఘటన జరిగింది. అప్పటికి పాక్ స్కోరు 67/3. అయితే సవరించిన ఐసీసీ నిబంధనల ప్రకారం ఈ సంఘటనకు బాధ్యుడైన డుప్లెసిస్పై చర్య తీసుకునే అవకాశముంది. ఇదే జరిగితే డుప్లెసిస్పై 50 నుంచి వంద శాతం మ్యాచ్ ఫీజులో కోత, ఒక టెస్టు మ్యాచ్, రెండు వన్డేలు లేదా రెండు టి20ల్లో నిషేధం విధించే అవకాశముంది. ఇందులో ఏది ముందు వస్తే ఆ మ్యాచ్‌లకు ఈ నిషేధం వర్తిస్తుంది. 2006 ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ ట్యాంపరింగ్‌కు పాల్పడిందని అంపైర్లు ఐదు పరుగుల జరిమానా విధించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన అప్పటి కెప్టెన్ ఇంజమామ్ జట్టును తీసుకుని మైదానం బయటకు వెళ్లిపోయాడు. దీంతో ఇంగ్లండ్ గెలిచినట్లు ప్రకటించారు. మళ్లీ అప్పటి మ్యాచ్ తర్వాత ట్యాంపరింగ్ జరగడం ఇప్పుడే. పాక్‌పై విజయం దిశగా స్మిత్‌సేన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా విజయం దిశగా సాగుతోంది. శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 55 ఓవర్లలో 4 వికెట్లకు 132 పరుగులు చేసింది. మిస్బా (42 బ్యాటింగ్), అసద్ షఫీక్ (28 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం పాక్ 286 పరుగులు వెనుకబడి ఉంది. అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టం. అంతకుముందు 460/4 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 163.1 ఓవర్లలో 517 పరుగులకు ఆలౌటైంది. దీంతో 418 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.