సిడ్నీ : వరుస ఓటములతో సతమతమవుతున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును గాడిలో పడేసేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డ్ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ 38.1 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటై ఘోరపరభావాన్ని మూటగట్టకుంది. కొన్ని నెలల క్రితం దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌లో స్మిత్, వార్నర్, బెన్‌క్రాఫ్ట్‌లు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి నిషేధాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. స్మిత్, వార్నర్‌లపై ఏడాది నిషేధం విధించగా, బెన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధాన్ని విధిస్తూ సీఏ నిర్ణయం తీసుకుంది.
దీంతో ఆ జట్టు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకప్పుడు క్రికెట్‌లో అగ్రజట్టు ఎదిగిన ఆసీస్ ప్రస్తుతం వరుస ఓటములతో సిరీస్‌లను కోల్పోతుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ఈ ముగ్గురు ఆటగాళ్లపై నిషేధాన్ని ఎత్తేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)ను డిమాండ్ చేస్తోంది. ఈ విన్నపాన్ని తొలుత తొసిపుచ్చిన సీఏ తాజా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే ఓటమితో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల అసోసియేషన్ డిమాండ్‌ను సీఏ పరిగణలోకి తీసుకుంటుందని, గవర్నింగ్ బాడీ సీఈవో కెవిన్ రోబర్ట్స్ బుధవారం మీడియాకు తెలిపారు.
నిషేధం ఎత్తేయాలని గత కొన్నిరోజులుగా ఆసీస్ ఆటగాళ్ల చేస్తున్న డిమాండ్‌తో సీఏ ఒత్తిడిలోకి కూరుకుపోయిందని, వారి విన్నపంపై బోర్డు సమావేశంలో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక ప్రపంచకప్‌కు కొద్ది రోజుల సమయం ఉండటం.. టీమిండియాతో వచ్చేనెలలో సిరీస్ ఆరంభంకావడంతో సీఏ మరోసారి పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఈ ముగ్గరు ఆటగాళ్ల పట్ల సీఏ కఠినంగా వ్యవహరించిందని, శిక్షలు మరి ఘోరంగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు, మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment